బూటకంబు శివ పూజలు చేసిన బుద్ది మంతుడగునా. Butakambu siva pujaluchesina buddi manthu.లిరిక్స్ ఉన్నవి

Sdílet
Vložit
  • čas přidán 15. 06. 2024
  • బూటకంబు శివ పూజలు చేసిన బుద్ది మంతుడగునా
    నామనాద క్రియ రాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి
    బూటకంబు శివ పూజలు చేసిన బుద్ది మంతుడగునా
    కాటికట్టి గణకల్లె మేసిన గాడిది గర్రమగునా "2"
    "బూటకంబు శివ పూజలు"
    చరణం 2
    యెలమి ధాతనని ఎంత ఎగసినా ఖలుడు కర్ణుడగునా
    బలుపు ఎక్కువై బడగ దూకినా పంది ఏనుగగునా
    "బూటకంబు శివ పూజలు"
    చరణం2
    మనస్సు నిల్పక భజనలు చేసిన మనిషి భక్తుడగునా..
    కనక పర్వతం ఎక్కికూసినా కాకి కోకిలగునా"2"
    "బూటకంబు శివ పూజలు"
    చరణం 3
    గోచిబూని మెడ పూసలేసినా ఆశ రహికు డగునా .
    కోరి చేపలకు దృష్టి నిచ్చినా కొంగయోగమగునా
    "బూటకంబు శివ పూజలు "
    చరణం 4
    కొల్లలుగా ఉప దేశమల్చినా కుశిక మౌని యగునా
    అల్లరిగా కపి గంతులేసినా ఆంజనేయుడగునా
    "బూటకంబు శివ పూజలు"
    చరణం5
    మొప్పె మానవుడు సాధు వేషములో మోక్ష ప్రాప్తుడగునా
    అల్లిబిల్లిగను అరవబూసిన పిల్లి వ్యాగ్రమగునా
    "బూటకంబు శివ పూజలు"
    చరణం 6
    మానవ ధ్యాన చింతన లేక మనసు నిలకడగనా.
    ఈ హనుమ భక్తుని భజన అనభవం- ఆరగింప దగునా
    "బూటకంబు శివ పూజలు"

Komentáře • 4

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 24 dny +2

    Omenamashivy 🎉🎉

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 24 dny +2

    హర హర మహాదేవ శంభో శంకర.
    ఓం నమఃశివాయ........🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🚩🌺🌺🌺🌺🌺

  • @sivasankarreddyisukapalli7676

    ఓమ్ నమశివాయ. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 24 dny +2

    czcams.com/video/FDVSPNMZJP4/video.htmlsi=fwBMwk-buyn3_z-f అందరికి సోమవారం శుభోదయ శుభాకాంక్షలు. కలియుగంలో ఆధునిక జీవనం గడుపుతున్న మానవవులకు భక్తి ఒక్కటే ముక్తి మార్గము కావున ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఐదు నిముషాలు సమయం కేటాయించి. భగవన్ నామ స్మరణ చేయండి. 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏