ఏ దారి ఏచ్చటికో శంకరా ఎవరి దారి ఏచ్చటికో హర హర.ఈ పాట వింటే ఏ తప్పు చేయరు.Ye dari yecchatiko Sankara.

Sdílet
Vložit
  • čas přidán 24. 04. 2024
  • ఏ దారి ఏచ్చటికో శంకరా ఎవరి దారి ఏచ్చటికో హర హర
    శివరంజని రాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం కడప జిల్లా భజన
    పల్లివి.
    ఏ దారి ఏచ్చటికో శంకరా.
    ఎవరి దారి ఏచ్చటికో హర హర.
    కడదాకా ఎవరో చితిదాకా ఎవరో
    ఎవరికి ఎవరో.... చివరి ఎవరో
    సంకట హరణ చూపుము కరుణ
    నాగా భరణా గౌరీ రమణా....
    "ఏ దారి ఏచ్చటికో శంకరా "
    చరణం.1
    మాయలో పుట్టేము మాయలో పెరిగేము."2"
    పెనుమాయలో తెలియాడేము."2"
    నీమాయ మేమెరుగక మాయమై పోయేము.
    మా మాయ తొలగించి మమ్మావల ధరిచేర్చు.
    మమ్ము బ్రోవ రావా.. గౌరి శంకరా హర..
    "ఏ దారి ఏచ్చటికో శంకరా "
    చరణం 2
    శోకముతో పుట్టుక భవబంధాలతో భాదలు."2"
    చివరి యాత్ర తీరని శోక సంద్రమాయే "2"
    నీ శ్లోక మేమెరుగక శోకములో మునిగేము."2"
    మా బ్రాంతి తొలగించి నీ కాంతిలో ముంచు.
    మమ్ము కావా రావా.. శంభో శంకరా హర.
    " ఏ దారి ఏచ్చటికో శంకరా "
    చరణం 3
    తలచేది ఒక్కటి జరిగేదింకొక్కటి "2"
    తలచేది జరగక తల్లడిల్లెమయ్యా "2"
    నీ వాడించేవు తోలు బొమ్మలాట "2"
    నీ ఆట మేమెరుగక మా ఆట ముగిసేను
    మమ్ము కాపాడవా... ఉమా శంకరా హర..
    "ఏ దారి ఏచ్చటికో శంకరా "

Komentáře • 9