కానరావే అలనాటి కన్నీటి ప్రార్థనలు/ Kanarave alanati kanniti prardhanalu/ Jesus songs telugu.

Sdílet
Vložit
  • čas přidán 6. 08. 2022
  • కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు
    కదలవేమి అపవాది చెరసాల పునాదులు
    ఇది నీ లోపమా - మరి నా లోపమా
    యోచించుమా క్రీస్తు సంఘమా (2)
    యోచించుమా క్రీస్తు సంఘమా ||కానరావే||
    సమూయేలుల నందించే హన్నాలేరి
    సమర్పణతో ప్రార్ధించే ఎస్తేరులేరి (2)
    నీతి కొరకు నిలబడే స్తెపనుల జాడేది (2)
    నిండు మనస్సుతో ఆరాధించే కాలేబులెటు పోయిరో
    కాలేబులెటు పోయిరో ||ఇది నీ లోపమా||
    అపొస్తలుల ఆదరించే బర్నబాలేరి
    ఆత్మలకై పరుగెత్తే ఫిలిప్పులేరి (2)
    శ్రమలకే ఎదురు నిలచే పౌలు వారసులేరి (2)
    శత్రువుతో పోరాడి గెలిచే దావీదులెటు పోయిరో
    దావీదులెటు పోయిరో ||ఇది నీ లోపమా||
    నిద్ర లేవాలి ఓ సంఘమా
    అసత్యాన్ని ఖండించే సత్య స్థంభమా
    క్రీస్తుకై కదలాలి ఓ సంఘమా
    ఉజ్జీవం నీలో నిండాలి
    ఓ సంఘమా… నిజ సంఘమా

Komentáře •