అంబికా వందనం అందుకో హరి చందనం సాంబశివుని ధర్మపత్ని నీవని. Ambika vandanam అందుకో har chandanam.

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • అంబికా వందనం అందుకో హరి చందనం
    సింధుభైరవి రాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి
    అంబికా వందనం.. అందుకో హరి చందనం"2"
    సాంబ శివుని ధర్మపత్ని నీవనీ ...
    సతతము ప్రార్థంతునో భవాని
    అంబికా వందనం అందుకో హరి చందనం
    చరణం1
    హిమవంతుని ప్రియ నందిని జగతికి జననీ
    బ్రమరాంబవె సుమభాసిని ఆశ్రితావని
    నా కన్నతల్లివని. నన్నెల గలవనీ"2"
    మాత నిన్ను కోరితిని మదినీవే నాగతి
    "అంబికా వందనం"
    చరణం 2
    హిమగిరి శిఖరాలపైన నీవు ఉండినా
    ఈధరలో నిన్ను నేను చేరుకుందునా
    అమలా స్వరూపిణీ ఆనందకారిణీ"2"
    ప్రేమాను రాగాలు ప్రసరించే ఓ జననీ
    " అంబికా వందనం "
    చరణం 3
    హంసగమన ఆదిమాత అందుకో జ్యోస్నా
    కంసహారి సోదరివే దివ్య కాళికా
    సింహా విహారివే సిరులిచ్చే తల్లివే"2"
    సన్యాసి రవార్చిత పుణ్యాల రాశివే
    "అంబికా వందనం"

Komentáře • 5

  • @ramana7992
    @ramana7992 Před 6 dny +2

    బాగా పాడారు బంగారు తల్లులూ

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 6 dny +2

    Bollbvanemathaki 🎉🎉

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 6 dny +1

    Supar 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 6 dny +1

    czcams.com/video/-haWTDwzlKw/video.htmlsi=bKOgzwe5OabfOcjr అందరికి పేరు పేరున శుభోదయ శుభాకాంక్షలు.అమ్మవారి కి అత్యంత ప్రీతికరమైన ఈ శుక్రవారం రోజు. సింధుభైరవి రాగంలో గీత మరియు లక్ష్మి పాడిన అద్భుతమైన పార్వతి దేవి పాట విని తరించండి.నా ckreddy devotional ఛానల్ ద్వారా ఎంతో మంది పాటలు నేర్చుకుని భక్తి పారవస్యంతో ఆడుతున్నారు. కొంతమందిలో అయినా మార్పు తీసుకొని వస్తున్నందుకు గర్వంగా ఉంది 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 6 dny +2

    ఇద్దరూ ఇద్దరే చాల అద్భుతంగా పాడారు తల్లులు.
    మీకు మీరే సాటి మీకు లేరు ఎవరు పోటీ....
    శుక్రవారం అమ్మవారి ఆశీస్సులు అందరిపై మెండుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺