మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్భర్‌కు వెల్లువెత్తున్నా వినతులు | Praja Darbar | Minister Nara Lokesh

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేష్ చేపట్టిన 'ప్రజాదర్బార్ ' కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలు చెప్పుకునేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే యువనేతను నేరుగా కలిసి సమస్యలు విన్నవించేందుకు బారులు తీరారు. విశాఖ జిల్లా దువ్వాడలో 4 కోట్ల విలువైన 84 సెంట్ల భూమిని గత వైకాపా ప్రభుత్వ అండతో వెంకటరమణ, రావి సత్యనారాయణ కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని శ్రీనివాసరావు, తాతారావు లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, సీఐ బి.శ్రీనివాసరావు అండతో ఫోర్జరీ డ్యాక్యుమెంట్లు సృష్టించి భూమిని అక్రమించారని వాపోయారు. విద్యుత్ షాక్ తో రెండు చేతులు కోల్పోయిన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని యర్రబాలెంకు చెందిన రవీంద్ర... నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తొలగించిన వితంతు పెన్షన్ పునరుద్ధరించాలని... పోలకంపాడుకు చెందిన అనవాయమ్మ, హైమావతి మంత్రిని కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె వైద్యానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా కోవెలమూడికి చెందిన కమలాకరరావు కోరారు. ప్రతి ఒక్కరి సమస్యను సావదానంగా విన్న యువనేత.... పరిష్కరిస్తానని.. వారికి భరోసా ఇచ్చారు. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 1

  • @nar880
    @nar880 Před 9 dny

    రేపటినుంచి మొదలు పెడతారు సామీ తీర్చలేదని...మంగళగిరి అంతా సమస్యలేనా...