మీ ఆశీస్సులతో 'అజగవ'కు ఐదేళ్ళు | Ajagava 5th Anniversary | Rajan PTSK

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • ఈరోజుతో మన అజగవ సాహితీ ఛానల్ పుట్టి ఐదు సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ ఐదేళ్ళలో మనం ఎన్నో కథలు చెప్పుకున్నాం, కావ్యాలలోని సంగతులు మాట్లాడుకున్నాం, భగవత్ తత్త్వం గురించి, మహర్షుల మహత్తు గురించి, మన సనాతనధర్మం గొప్పతనం గురించి ఇలా అనేక ప్రామాణికమైన విషయాలను చెప్పుకున్నాం. బాణుడి కాదంబరి, భాసుడి స్వప్నవాసవదత్త, శూద్రకుని మృచ్ఛకటికం, విశాఖదత్తుని ముద్రారాక్షసం, కాళిదాసు మహాకవి మేఘదూతం, రఘువంశం, హాలుడి ప్రాకృతగాథా సప్తశతి ఇలా అనేక సంస్కృత ప్రాకృత రచనలను కథలుగా మలచుకుని చెప్పుకున్నాం. తెలుగు విషయానికి వస్తే పెద్దనగారి మనుచరిత్ర, రామరాజభూషణుని వసుచరిత్ర, శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద, శ్రీనాథుని క్రీడాభిరామం, పాల్కురికి సోమనాథుని బసవపురాణం, ఇంత అని చెప్పలేనంత బావుండే పింగళి సూరన కళాపూర్ణోదయం, వేదం వేంకటరాయశాస్త్రిగారి ప్రతాపరుద్రీయం, చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి గయోపాఖ్యానం, కాళ్ళకూరి నారాయణరావుగారి చింతామణి నాటకం, కందుకూరి వీరేశలింగం పంతులుగారి రాజశేఖర చరిత్ర, అలానే వారిదే సత్యరాజా పూర్వదేశ యాత్రలు మొదలైన తెలుగు కావ్యాలు, నవలలలోని కథలను కూడా మనం మన అజగవలో చెప్పుకున్నాం. అంతే కాకుండా నాలుగు వేదాలు పది ఉపనిషత్తులలో ఏముందన్న విషయాన్ని, 18 పురాణాల సంగతులను, యోగవాసిష్ఠం విశిష్టతను, మణిద్వీప వర్ణనను, న్యాయము, సాంఖ్యము, వైశేషికము, యోగము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనే ఆరు ఆస్తికదర్శనాలలోను, బౌద్ధం, జైనం, చార్వాకం అనే మూడు నాస్తిక దర్శనాలలోను చెప్పబడ్డ సంగుతుల గురించి, భారతీయుల విజ్ఞాన సర్వస్వంగా చెప్పబడే గరుడపురాణం విశేషాలను, కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని, వాత్స్యాయనుని కామశాస్త్రాన్నీ. 64 కళలంటే ఏవేవి అన్న విషయాన్ని వాటి వివరణను, 124 యక్ష ప్రశ్నలను ఇలా అనేకానేక విషయాలను చెప్పుకున్నాం. తమిళ సాహిత్యంలో చూస్తే తమిళ పంచమహాకావ్యాలలో ఒకటైన సిలప్పదికారమ్ కథను రెండు భాగాలుగా చెప్పుకున్నాం. తమిళ భాషలో వ్రాయబడ్డ భారతీయులందరికీ చెందిన గ్రంథం తిరువళ్ళువర్ వారి తిరుక్కుఱళ్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇంకా ఆండాళ్ అమ్మవారైన గోదాదేవి రచించిన 30 పాశురాల తిరుప్పావై గురించి, పన్నెండుగురు ఆళ్వారుల దివ్య చరిత్రల గురించి కూడా వివరంగానే చెప్పుకున్నాం. ఇక షట్చక్రవర్తుల కథలు, సప్త చిరంజీవుల కథలు, తెలుగువారి ప్రాచీన జానపద కథ బాలనాగమ్మ కథ, స్వామిభక్తుడైన గొడుగుపాలుని కథ ఇలా అనేక కథలు చెప్పుకున్నాం. చాలామందికి అభిమానపాత్రమైన కాశీమజిలీ కథలను వందకుపైగా భాగాలుగా చెప్పుకున్నాం. కొంతకాలంగా కాశీమజిలీలు ముందుకు సాగలేదు. త్వరలోనే మరలా ఆ ప్రయాణం కూడా మొదలుపెడదాం. ఇవి కాకుండా మహాబలుడు కొడి రామ్మూర్తి నాయుడు, గొప్ప కవి రచయిత చిత్రకారుడు అయిన అడవి బాపిరాజు, ఆధునికకాలంలో మహోన్నత భారతీయ విజ్ఞానవేత్త అయిన జగదీశ్ చంద్రబోస్ మొదలైనవారి గురి జీవిత కథలను కూడా సంక్షిప్తంగా చెప్పుకున్నాం. అలానే తెలుగు సాహిత్యంలో ముద్దు మీద వచ్చిన మొదటి పద్యం గురించి, కాఫీ దండకం, దోమ దండకం గురించి, ప్రసిద్ధుల హాస్యోక్తుల గురించి, విశ్వనాథ సత్యనారాయణ గారు, శ్రీశ్రీ గారు, సినారె గారు మొదలైనవారి చతురోక్తుల గురించి, కరుణశ్రీ గారి సమస్యాపూరణల గురించి, దాశరథి గారు, కృష్ణశాస్త్రిగారు, శ్రీశ్రీ గారు సినారె గార్ల కవిత్వ పరిచయాల గురించి, నలందా విశ్వవిద్యాలయం గొప్పతనం గురించి, భారతదేశంలో ప్రాచీన రాజ్యాలు ప్రస్తుతం ఏ ఏ పేర్లతో పిలవబడుతున్నాయన్న విషయం గురించి, తెనాలి రామలింగని హాస్య కథలు, పద్యాల గురించి, పొన్నియన్ సెల్వన్‌కు తెలుగువారి మహాభారతానికి ఉన్న సంబంధం గురించి, విజ్ఞాన భైరవ తంత్ర గురించి, తావోయిజమ్ గురించి, జాషువా గారి శిశువు, విశ్వనరుడు పద్యాల గురించి, 14 లోకాల సంగతుల గురించి, నూటపదహార్లు అన్న మాట ఎలా పుట్టిందన్న విషయం గురించి, ఇంకా సనాతన ధర్మానికి సంబంధించిన అనేక విషయాలు, కథల గురించి బోలెడన్ని వీడియోలలో చెప్పుకున్నాం. తెలుగు సినిమా పుట్టిన దగ్గర నుండి ఇప్పటివరకూ ఉన్న అనేకమంది గీతరచయితలలో అరవై ముగ్గురు రచయితల పాటలను ప్రస్తావిస్తూ ఒక వీడియో చేశాను. ఈ విధంగా ఈ ఐదేళ్ళలో అనేక సాహిత్యరీతులపై సుమాకు 350 వరకూ వీడియోలు చేశాను. మీ ఆదరాభిమానానలతో ఇంకా అనేకంగా చేస్తూనే ఉంటాను.
    చిన్నప్పుడు మా అమ్మ అన్నం తినిపిస్తూ చెప్పిన రామాయణ భారత కథలు, మా నాన్నగారు రాత్రివేళ నన్ను మా అక్కను ప్రక్కన పడుకోబెట్టుకుని పాడిన పోతనగారి భాగవత పద్యాలు నన్ను సాహిత్యంవైపు నడిపించి ఉంటాయేమో అనిపిస్తుంటుంది. ఇక పుస్తక పఠనం అన్నది చందమామ బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు మొదలైన బాలసాహిత్య పత్రికలతో మొదలైంది. షాడో మధుబాబు, యండమూరి నవలలతో మరికొంత ముందుకువెళ్లింది. ఆపై మల్లాది రామకృష్ణశాస్త్రి గారు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, చాసోగారు, రావిశాస్త్రిగారు, తిరుమల రామచంద్రగారు, చలంగారు, అడవి బాపిరాజుగారు, జాషువాగారు, కరుణశ్రీ గారు, బుచ్చిబాబుగారు, ముళ్ళపూడివారు మొదలైనవారి రచనలతో తెలుగు సాహిత్యం రుచి ఎంతటితో తెలిసింది. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి వంటి మహారచయిత రచనలు చదివాక తెలుగు సాహితీకారులస్థాయి సంస్కృత మహాకవుల స్థాయికి తీసిపోదని అనిపించింది. నాకు నచ్చిన రచయితలు ఎందరో ఉన్నా విశ్వనాథ సత్యనారాయణగారే నా వరకూ నాకు అత్యుత్తమ రచయిత. అలానే సినీగీత రచయితలలో వేటూరివారంటే నాకు ఎంతో అభిమానం.
    ఇక సంస్కృత సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోవడానికి వావిళ్ళవారి ప్రచురణలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి. తెలుగు సాహిత్యాన్ని నాణ్యమైన రూపంలో, ప్రామాణికతతో తెలుగువారికి అందించిన సంస్థ వావిళ్ళ వారి ప్రచురణాలయం. తెలుగువారంతా ఆ సంస్థకు కృతజ్ఞులుగా ఉండాలి.
    సనాతన ధర్మాన్ని, భారతీయ సాహిత్యాన్ని నా పరిధిలో నేను మీకు పరిచయం చేయగలుగుతున్నానంటే అందుకు ప్రధాన కారణం మీ ఆదరణే. మీ అభిమానమే అజగవను నడిపిస్తోంది.
    ధన్యవాదములతో
    మీ
    రాజన్ పి.టి.ఎస్.కె

Komentáře • 101

  • @jathindrasarmamodukuri4983
    @jathindrasarmamodukuri4983 Před 2 měsíci +26

    అయ్యా! రాజన్ గారు...నాకిప్పుడు అరవైతొమ్మిదేళ్ళ వయసు. ఇంక బతికినన్నాళ్ళూ అజగవ చానెల్ చూస్తాననే నమ్మకం ఉంది. మీ చానెల్ కలకాలం వృద్ధి చెందాలనీ ఆశీస్సులు

  • @ramachandusharma5867
    @ramachandusharma5867 Před měsícem +3

    శుభమస్తు. గ్రంథాలు చదవడం ఒక ఎత్తు..అందులోని విషయాలని సులభగ్రాహ్యాలుగా చెప్పగలగడం క్లిష్టమైన పని. మీరు చేసే శ్రమ శ్లాఘనీయం.
    అమ్మవారు మీకు సదా రక్షగా ఉండాలని ప్రార్థిస్తూ, మీ ఛానల్ మరింత పురోగతి సాధించాలని ఆశిస్తున్నాను.

  • @balasubrahmanyamaddanki7398
    @balasubrahmanyamaddanki7398 Před 2 měsíci +2

    మీకు అభినందనలు సార్ 💐🙏

  • @Deekshith573
    @Deekshith573 Před měsícem

    అభినందనలు. మీ సాహితీ సేవకు కోటి వందనములు. మీకు నా తరుపున సహకారములను అందించడానికి ప్రయత్నం చేస్తాను. నాది ఒక విన్నపం. మన తెలుగు గడ్డపై పుట్టి భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో తమ ముద్ర వేసుకున్న ప్రముఖుల గురించి దయచేసి తెలియచేయండి.

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Před 2 měsíci +2

    చాల బాగుంది మీ గ్రంధాలయం

  • @sriram4461
    @sriram4461 Před 2 měsíci +4

    చాలా ఆనందం గా ఉంది గురువు గారు

  • @kamsalimanemma3620
    @kamsalimanemma3620 Před 2 měsíci +4

    వే వే లెండ్లుగ వర్ధిలు
    నీ వీ సాహితి నడుపుము
    నిత్యము వెలుగన్
    నీవే సాటిగ లేకను
    నీ వే అజగవ యశస్సు
    నిరతము తెలుగన్.
    డా. కె. బాలస్వామి
    నీ

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr Před 2 měsíci +6

    అజగవ లో సాహిత్యం అక్షర రూపం లో అత్యవసరం.ప్రతిఒక్కరూ వ్రాసు కునే విధంగా ఉండాలని మనవి.

  • @manjulathag4298
    @manjulathag4298 Před 2 měsíci +4

    మీరు ముద్దుగా పెంచుకున్న ఐదు సంవత్సరాల మీ చిన్నారి చిట్టితల్లి దిన దిన ప్రవర్ధమానం అయి మీకు అండగా నిలవాలి అని ఆశీస్తూ......ఒక శ్రేయోభిలాషి

  • @shobhaganti7546
    @shobhaganti7546 Před 2 měsíci +2

    చాలా సంతోషం మీరు ఇలాగే మాకు సాహిత్యం పంచాలని🙏🏼🙏🏼🙏🏼

  • @yakaiahvivekperaboina1886
    @yakaiahvivekperaboina1886 Před měsícem +1

    శుభాభినందనలు

  • @BanalaSreenivasulu
    @BanalaSreenivasulu Před 2 měsíci +2

    అభినందన మందారమాల మన తెలుగు సాహిత్య తేనరసా లు మాకు తెలియజేస్తున్నా మీకు శుభాకాంక్షలు

  • @User__9963sr
    @User__9963sr Před měsícem

    ఆధునిక విశ్వనాధ సత్యనారాయణ అంటే మీరేనని నా అభిప్రాయం గురువు గారు.

  • @srinivasavenkatachalammond9260
    @srinivasavenkatachalammond9260 Před 2 měsíci +2

    చాలా సంతోషంగా ఉంది. మంచి ఛానల్ మీరు ఇలాగే మంచి మాటలు మంచి విషయాలు తెలుపగలరు

  • @sasivaddi5222
    @sasivaddi5222 Před 2 měsíci +4

    ఆ శ్రీ నారాయణుని కృప మీ పై ఉండుగాక . Ajagava చానెల్ కు శుభ అభినందనలు

  • @deepsburle
    @deepsburle Před 2 měsíci

    చాలా underrated ఛానెల్ అండి మీది. హృదయపూర్వక అభినందనలు.

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 Před 2 měsíci +2

    మన సంస్కృతి మనసాహిత్యం మన సంప్రదాయం గురించి మరియు ఎన్నో తెలియని చరిత్ర గురించి కథల గురించి వేదాలు ఉపనిషత్తులు గురించి ఏమీ తెలియని మాకు చాలా చాలా తెలుసుకుంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం కొంచెం కొంచెంగా సాహిత్య జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నాం నిజంగా ఇంత మంచి జ్ఞానాన్ని ఒక గురువుగా మాకు వీడియోలు ద్వారా తెలియజేస్తూ చెబుతున్న మీకు ఎంతో ఎంతో రుణపడి ఉంటాము ఇంత వివరంగా తెలియజేస్తున్న మీకు శతకోటి వందనాలు ధన్యవాదాలు 🙏🏾🙏🏾

  • @cvslsastry3790
    @cvslsastry3790 Před 2 měsíci +2

    సాహితి సంస్కృతి సేవలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు

  • @nagabhushana1150
    @nagabhushana1150 Před 2 měsíci

    Thank you, sir , for your unique services to Telugu literature and culture. Pranams.

  • @umadasa8226
    @umadasa8226 Před 2 měsíci

    Long live this channel God bless you

  • @raniatmuri
    @raniatmuri Před 2 měsíci +1

    👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @neelavenidondappagari6238
    @neelavenidondappagari6238 Před 2 měsíci

    Shubabinandanalu rajangaru

  • @dwarampudivenkatareddy3987
    @dwarampudivenkatareddy3987 Před 2 měsíci

    Good sar namaskaram meku santosam

  • @manyam6470
    @manyam6470 Před 2 měsíci +3

    Congratulations 🎉 👏 సాహిత్యం మన పురాతన సనాతన ధర్మాన్ని గురించి మీ గొంతుకలో వినడం నాకు ఎంతో ఇష్టం గా హాయిగా ఉంటుంది 😊 పుస్తకాల మధ్యలో మిమ్మల్ని అలా చూడటం నయనానందకరంగా ఉంది

  • @ravishankar35333
    @ravishankar35333 Před 2 měsíci

    Congratulations to Rajan Sir.

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před měsícem

    🤝👌👍👏🙌శ్రీరామ రక్ష..

  • @durgasivads338
    @durgasivads338 Před 2 měsíci

    Congratulations Rajan garu 🎉Mahabharatam chadavali anukunta Vyasa bharatham evari dagarunchi tisukomantaru publishers edi asaludi.

  • @veera222
    @veera222 Před 2 měsíci

    Congratulations sir🤝🚩🇮🇳

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 Před 2 měsíci

    Hearty congratulations sir 🎊🎊🎉🎉

  • @sambasivaraosamarla4889
    @sambasivaraosamarla4889 Před 2 měsíci

    శుభాకాంక్షలు 🙏🙏🙏

  • @gangadharashastry9801
    @gangadharashastry9801 Před měsícem

    అభినందనీయం శుభం Congratulations 🎊 👏 💐 🥳
    దయచేసి మిరు చేసిన చెప్పిన కథలు మరి సమస్త విషయాల లిస్ట్ పెట్టగలరు

  • @cricket5179
    @cricket5179 Před 2 měsíci

    shubhaakaankshalu...

  • @kottevenkatesh5894
    @kottevenkatesh5894 Před 2 měsíci +1

    రాజంగారు మీకృషికి శతకోటి వందనాలు.మీరు అందించిన సమాచారం అద్భుతం ,అనిర్వచనీయం

  • @yanamandravijayalakshmitha1639

    God bless you Rajan .

  • @ramaswamyErapani
    @ramaswamyErapani Před 2 měsíci

    Me helping nature ki thank u sir 🙏...na phn lift cheyakapovatam badhaga VUNDHI sir

  • @namanipadmavathi7000
    @namanipadmavathi7000 Před 2 měsíci +1

    శుభాకాంక్షలు సోదరా!🎉

  • @pavankumarvakulabharanam6717

    Namaskaram guruvu garu

  • @sairamakrishnaperubhotla8745
    @sairamakrishnaperubhotla8745 Před 2 měsíci +1

    నమస్కారం రాజన్ గారు. సాహిత్యం పట్ల మీకున్న మక్కువ, సాహిత్యాభిమానులకు మీరు పంచుతున్న సాహిత్య విజ్ఞానం అభినందనీయం. మీరు ఇలాగే సాహిత్య విజ్ఞానం ఆజగవ అభిమానులందరికీ పంచుతూ ఉండాలని కోరుకుంటున్నాను. అజగవకు ఐదేళ్లు సందర్భంగా మీకు హృదయపూర్వక అభినందనలు.

  • @asamardhudu8921
    @asamardhudu8921 Před měsícem

    Jai hind...

  • @వాసుదేవాయ
    @వాసుదేవాయ Před 2 měsíci +1

    గురువు గారు మీకు అభినందనలు🎉🎉🎉 మీలాంటి వారు ఇంకా రావాలి.మీరు మాత్రం ఎవర్ గ్రీన్ 🙏

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 Před 2 měsíci

    Congratulations Rajan garu 🎉🎉🎉👏👏👏

  • @periumasankar
    @periumasankar Před 2 měsíci +1

    శుభాకాంక్షలు.
    అజగవ రక్ష మనందరికీ.

  • @varaprasadmtech
    @varaprasadmtech Před 2 měsíci

    Congratulations sir n keep going on

  • @seetharamamma6244
    @seetharamamma6244 Před 2 měsíci +1

    అభినందనలు సర్ మీ కృషి అసామాన్యం. ఆశీస్సులు మీకు.

  • @santhoshyenugula7444
    @santhoshyenugula7444 Před měsícem

    Congratulations sir 🎉🎉🎉🎉

  • @sanjeev1530gamil
    @sanjeev1530gamil Před 2 měsíci

    Congratulations 🎉🎉 guruji

  • @mahee1
    @mahee1 Před 2 měsíci

    Congratulations Rajan garu 🎉🎉

  • @vaddipartis.v.r.nmurtyvadd4560

    Congratulations Rajan Sir

  • @MrRohitbhaskar
    @MrRohitbhaskar Před 2 měsíci

    Congratulations Sir

  • @raghunandanareddy9112
    @raghunandanareddy9112 Před 2 měsíci

    Good luck sir

  • @naraharimanne5240
    @naraharimanne5240 Před 2 měsíci

    ❤ ty congratulations Rajan garu

  • @lalithavoruganti9172
    @lalithavoruganti9172 Před 2 měsíci

    Congratulations sir

  • @satyavathipagadala3825
    @satyavathipagadala3825 Před 2 měsíci

    Congratulations sir 👏

  • @vudayabhaskar2764
    @vudayabhaskar2764 Před 2 měsíci

    I pray for 100 years

  • @sureshkumarp4144
    @sureshkumarp4144 Před 2 měsíci

    Congratulations anna

  • @ushasrivelegapudi8858
    @ushasrivelegapudi8858 Před 2 měsíci

    👏👍💐

  • @Pranav2380
    @Pranav2380 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaraju913
    @krishnaraju913 Před 2 měsíci

    💐💐💐🙏🙏🙏

  • @godfathershiva6217
    @godfathershiva6217 Před 2 měsíci +2

    Shiva baba blesses on this occasion

  • @kamalreddy2390
    @kamalreddy2390 Před 2 měsíci

    🎉🎉🎉🎉🎉

  • @rajeshanyam5136
    @rajeshanyam5136 Před 2 měsíci

    🎉🙏

  • @madhumathidevi3652
    @madhumathidevi3652 Před měsícem

    🙏

  • @kameswararaomitnala5848
    @kameswararaomitnala5848 Před 2 měsíci +1

    మీ కృషికి అభినందనలు.

  • @kamakshich19
    @kamakshich19 Před 2 měsíci +1

    సాహిత్య పరమైనపుస్తకాలుమరిన్నిచదివిమాకుచెప్పాలనిమాకోరి క

  • @madhumadhu3494
    @madhumadhu3494 Před 2 měsíci

    ❤❤❤❤❤❤❤❤

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 Před 2 měsíci

    తెలుగు సంస్కృత భాషలలో ఉన్న ముఖ్యమైన కవితా పరిచయం బాగా చేసారు. Araebian nights కూడా చెప్పండి. శుక్రవారం ready చేసి ఆదివారం రిలీజ్ చెయ్యండి. పురాణ వైర గ్రంథ మాల మొదలైన వి. సి నా వారి పుస్తక పరిచయాలు చెయ్యండి

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 Před 2 měsíci

    🙏🏻🙏🏻🙏🏻

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 Před 2 měsíci

    మాకు చాల సంతోషంగా ఉంది. ముందు ముందు మరింత ప్రాచుర్యంలోకి వచ్చి మరెంతో మందికి అనుభవైకమవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు మావయస్సు(80సం.) దాటిన తర్వాత కూడా అమ్మవారి కటాక్షంతో ఈ సాహిత్య యజ్ఞాన్ని కొనసాగించే అవకాశం లభించాలని ఆశిస్తున్నాను. జై తెలుగుతల్లి🙏 నమామి గంగే🙏 నమో గోమాత🙏 వందేమాతరం🙏

  • @bisagonigangadhar8842
    @bisagonigangadhar8842 Před 2 měsíci +2

    🙏🙏🙏🙏🎉🎉🎉👌👌

  • @AR-vt9rx
    @AR-vt9rx Před 2 měsíci +1

    అభినందనలు😊😊

  • @venkeyvenkat2094
    @venkeyvenkat2094 Před 2 měsíci

    గురువు గారి కి నమః అభిజ్ఞాన శాకుంతలం గురించి చెప్పగలరని ప్రార్థన

  • @patnalkarri4830
    @patnalkarri4830 Před 2 měsíci

    🎉

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 Před 2 měsíci +1

    Congratulations Guruvugaaru

  • @srinivasraobhallamudi9661
    @srinivasraobhallamudi9661 Před 2 měsíci

    శతమానం భవతి

  • @gopal7243
    @gopal7243 Před 2 měsíci +1

    Subha abinandanalu Rajan garu

  • @srividyabhaskara6253
    @srividyabhaskara6253 Před 2 měsíci

    👏👏👏🙏

  • @balaammanabrolu9375
    @balaammanabrolu9375 Před 2 měsíci +1

    Congratulations all the best sir

  • @saijaideep5510
    @saijaideep5510 Před 2 měsíci

    గురువు గారు కాశీ మజిలీలు చెప్పి చాలా రోజులు అయింది. మేము మరచిపోయే లోపు తొందరగా మళ్ళీ చెప్పి అవచేయంది ,,🙏

  • @GullapalliRajyalakshmi-kp5rc

    ఐదేళ్లు నిండిన " అజగవ " కు అనేక శుభాకాంక్షలు , శుభాశీస్సులూ .
    ఇట్లు శ్రీమతి గుళ్లపల్లి రాజ్యలక్ష్మీ పంతులు ( సాహిత్య అభిమాని ) విశాఖపట్టణం.
    మన అజగవ గ్రంథాలయం చాలా గొప్పగా వుంది . అభినందనలు .

  • @najinshaik786
    @najinshaik786 Před 2 měsíci

    గురువు గారికి నా ధన్యవాదాలు🙏🏻🙏🏻💐💐

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 Před 2 měsíci

    Jai Srimannarayana Congratulations

  • @sivaspurthi2860
    @sivaspurthi2860 Před 2 měsíci +1

    Sukhinobhavanthu

  • @yanamandravijayalakshmitha1639

    Congratulations to Ajagava.

  • @bottasankar4212
    @bottasankar4212 Před 2 měsíci

    దంత్య చ జ ల గురించి వాటి ఉచ్చారణ గురించి చెప్పండి.

  • @kamakshich19
    @kamakshich19 Před 2 měsíci +1

    నాకు ఇఅంగ్లీషు లోపొగడటంఇష్టంలేదు,కాని మీకుబోలెడుఆశ్శీశులూ

  • @rasmlakshmi6512
    @rasmlakshmi6512 Před 2 měsíci

    Sir
    మీరు ఏ ఊరు లో ఉంటారు. నా పేరు రెడ్డి వెంకట వర ప్రసాద్ రావు, వేద గణిత రచయిత మరియు international master trainer from Vanasthalipuram Hyderabad
    మీకు అభనందనలు

  • @vejayanandch3454
    @vejayanandch3454 Před 2 měsíci

    Sri Ronanki Appalaswami garu???

  • @ssvalivali5788
    @ssvalivali5788 Před 2 měsíci

    Hi

  • @kavithavudattu6618
    @kavithavudattu6618 Před 2 měsíci

    Please give your library adress in bhimavaram

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 Před 2 měsíci

    105 ❤ view 🎉
    33 ❤️ like🎉 😊🙏
    మీరు ఏమి అనుకోకపోతే మీరు ఎక్కడ ఉంటారు...???
    మీకు సమ్మతం అయితేనే సమాధానం ఇవ్వండి..
    అన్యధా భావించకండి 🙏

  • @Vijjiprsn
    @Vijjiprsn Před 2 měsíci

    శుభాకాంక్షలు🌅🚩🙏

  • @gellavenkateswarrao
    @gellavenkateswarrao Před měsícem +1

    శివుని ధనస్సు పేరు పినాకిని కదా మరి మీరు అజగవ అంటున్నారు, దీని గురించి వివరంగా ఒక వీడియో చేయగలరు

  • @13suns
    @13suns Před 2 měsíci

    Congratulations sir

  • @BanalaSreenivasulu
    @BanalaSreenivasulu Před 2 měsíci

    అభినందన మందారమాల మన తెలుగు సాహిత్య తేనరసా లు మాకు తెలియజేస్తున్నా మీకు శుభాకాంక్షలు

  • @BanalaSreenivasulu
    @BanalaSreenivasulu Před 2 měsíci

    అభినందన మందారమాల మన తెలుగు సాహిత్య తేనరసా లు మాకు తెలియజేస్తున్నా మీకు శుభాకాంక్షలు

  • @kompellysanthoshgoud7069
    @kompellysanthoshgoud7069 Před 2 měsíci +1

    Congratulations sir