శంకరాచార్యులు - సనాతన ధర్మం | Adi Sankaracharya | Rajan PTSK

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • శంకర జయంతి!
    సుమారు 2500 సంవత్సరాల క్రితం బౌద్ధం జైనం చార్వాకం వంటి 72 అవైదిక మతాలు లోకంలో విస్తృతంగా వ్యాపించాయి. ఆ యా మత ప్రవర్తకులు మరణించాక వారిలో కూడా తెగలు పుట్టి, విచ్చలవిడి భావాలు, ఆరాధనలూ పుట్టుకొచ్చాయి. ఎవరికివారు తమ సిద్ధాంతమే గొప్పదని వాదిస్తూ, వర్గాలను ఏర్పరచుకోవడంతో ప్రజలమధ్య వైషమ్యాలు మొదలయ్యాయి. కాపాలికం, కాలాముఖం, భైరవం వంటి క్రూరపూజావిదానాలతో పాటూ, ఎన్నోరకాల క్షుద్రపూజలు, నరబలులు ప్రబలాయి. నీతినియమాలు, వావివరసలు కట్టుతప్పాయి. స్వార్థపరత్వం, పరపీడన ఎక్కువయ్యింది. తప్పు తప్పేకాదని అదీ ఒకరకంగా ఒప్పేనని చెప్పే అర్థంలేని వ్యాఖ్యానాలు బయలుదేరాయి. దానితో సమాజజీవనం అస్తవ్యస్తమయ్యింది. భయం, ఆందోళన రాజ్యమేలాయి. ఎటుచూసినా అజ్ఞానమే, అందరి మనసుల్లోనూ అంధకారమే. అటువంటి స్థితిలో యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటూ ఆనాడు కృష్ణపరమాత్మగా తానిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నిరంతరనిశ్చలజ్ఞానముద్రాస్వరూపంతోబ్రహ్మానందస్థితిలో ఓలలాడే ఆ స్వామి, సకలచరాచరా జగత్తును సృష్టిస్థితిలయతిరోధానఅనుగ్రహాలనే పంచకృత్యాలతో అతి సునాయాసంగా నిర్వహించే ఆ ప్రభువు, తనదికానిదంటూ ఏదీలేని, తాను కానిదంటూ ఏదీకాని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన పరమాత్మ, తన డమరుధ్వనితో అక్షరాన్ని పుట్టించి లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్త్వానికి సగుణ సాకార స్వరూపమైన ఆ లోకైకనాథుడు పరమశివుడు ధ్యానస్థితినుండి కనులు తెరిచాడు. అపారకరుణాసముద్రుడైన ఆ స్వామి జగత్తును ఉద్ధరించడానికై కైలాసాన్ని వీడి కాలడి వైపుగా కదిలాడు. ఆర్యాంబ, శివగురు దంపతుల ముద్దుబిడ్డగా నందన నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ పంచమినాడు, అభిజిత్ లగ్నంలో, ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా ఆర్ద్రా నక్షత్రంలో ఈ భూమిపై అవతరించాడు. ఆదిశంకరుడన్న పేరుతో పరివ్రాజకాచార్యుడై.. లోకాంధకారాన్ని పటాపంచలు చేసే సుజ్ఞానజ్యోతిగా వెలిగాడు. ఆసేతు హిమాచలం పర్యటించి అవైదిక మత ఖండన, అద్వైత సిద్ధాంత స్థాపనా చేశాడు. కవిపండితసకలమతాచార్యుల సమక్షంలో కాశ్మీరంలోని సర్వజ్ఞపీఠం అధిష్ఠించి.. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం అని నిత్యం మనం స్మరించుకునే జగద్గురువయ్యాడు. ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి. జగద్గురు ఆదిశంకరుల వారి జయంతి. ఈ పుణ్యతిథినాడు ఆ మహాపురుషుని గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం.

Komentáře • 70

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 Před 11 dny +2

    జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి కి నమః స్సుమాంజలి

  • @cvenkat7766
    @cvenkat7766 Před 3 měsíci +10

    హిందూ జాతికి మహోపకారం చేసిన మహానుభావుడు శంకరాచార్యులు . ఆయన నిస్వార్థ సేవ ను గుర్తించడంలో ఈ జాతి పూర్తిగా విఫలం అయింది .

  • @subhash7588
    @subhash7588 Před 3 měsíci +7

    శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు చేస్తూ ఆది శంకరులు సాక్షాత్ శంకర భగవానులు . రాజన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @krishnaneeraj7508
    @krishnaneeraj7508 Před 3 měsíci +2

    తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో నా బిడ్డకు బోధించడానికి ఉత్తమ veda patshala కావాలి. దయచేసి ఒకటి సూచించండి. నేను మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాను.

  • @SharabhanS
    @SharabhanS Před 3 měsíci +3

    🙏🙏🙏🙏🙏

  • @User__9963sr
    @User__9963sr Před 3 měsíci +9

    మానవ సేవయే మాధవ సేవ అనేది మాత్రమే నా సిద్ధాంతం గురువు గారు.

  • @kkirankumar4767
    @kkirankumar4767 Před 3 měsíci +16

    శంకర భగవత్పాదులు ఈ దేశం కు చేసిన మేలు అందరికీ తెలియాలి ❤🎉

  • @sambasivaraosamarla4889
    @sambasivaraosamarla4889 Před 3 měsíci +5

    వందే 🙏ఆదిశంకరాచార్య

  • @ravikuchimanchi5110
    @ravikuchimanchi5110 Před 3 měsíci +5

    రాజన్ గారూ మీరు సరస్వతి పుత్రులు. అది శంకరులు గురించి చాల బాగ చెప్పారు.

  • @varaprasadmtech
    @varaprasadmtech Před 3 měsíci +6

    Excellent description. I am fan of your voice. Jaya Jaya Sankara

  • @ragaswami2551
    @ragaswami2551 Před 3 měsíci +2

    🙏🙏🙏 అద్భుతంగా చెప్పారు గురువుగారు.

  • @ManjuNaadhan
    @ManjuNaadhan Před 3 měsíci +2

    Proud be a hindhu

  • @vvvmk1718
    @vvvmk1718 Před 3 měsíci +14

    కనీసం మీరేనా శంకరుల సరయిన కాలం చెప్పి మమ్మల్ని ధన్యులని చేశారు…🙏🙏🙏ఇప్పుడు గొప్ప గొప్ప ప్రవచనకారులే శంకరుల కాలం 8వ శతాబ్దం అని తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. మీకు నమస్కారమండీ🙏🙏🙏

    • @venkatabharghavp6838
      @venkatabharghavp6838 Před 3 měsíci

      czcams.com/users/livePY4CH8CJ5QQ?si=wq1HA_UDQftGhyZy

    • @ChidVanhi
      @ChidVanhi Před 3 měsíci +1

      509 BCE

    • @rajutvs-dn7tn
      @rajutvs-dn7tn Před 3 měsíci +1

      Samavedam gari ni manam v imarsincha lemu.Yae Kalama anedi kadu.Sankarulu cheppindi manam acharinchali.

  • @sumangali9800
    @sumangali9800 Před 2 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JanakiramayyaK-hw7xv
    @JanakiramayyaK-hw7xv Před 3 měsíci +8

    నమస్తే జీ జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు వారు సం 2500 వత్సరముల నాటి వారని తెలియజేసినందులకు కృతజ్ఞతలు జీ 🙏

  • @koundinyasa
    @koundinyasa Před 3 měsíci +4

    మీకు ధన్యవాదాలు శంకరుల సరైన కాలం చెప్పారు

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn Před 3 měsíci +1

    Aaacharya sakaracharya janma janmalaku meere guruvulu.

  • @kumarikarumanchi2379
    @kumarikarumanchi2379 Před 3 měsíci +7

    జయజయశంకర

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 Před 3 měsíci +5

    భాగప్రవచనము చేప్పినారు

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad Před 3 měsíci +4

    🕉🔱🕉🇮🇳👏🙏
    నమః శివాభ్యామ్ |
    నమోనమః శఙ్కరపార్వతీభ్యామ్||
    నమామి భగవత్పాదాచార్యమ్
    శఙ్కరమ్ లోకశఙ్కరమ్||
    అపార కరుణాసిన్ధుమ్
    జ్ఞానదమ్ శాన్తరూపిణమ్|
    శ్రీచన్ద్రశేఖరగురుమ్
    ప్రణమామి ముదాన్వహమ్||
    జయజయశఙ్కర హరహరశఙ్కర||

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před 3 měsíci +2

    అ.....నా.......ది .....పరమసత్ జగద్గురు🤣🇲🇰🤣సుప్రియమహో🧖‍♂️ప🧖‍♀️ కా👳‍♂️రు💋🇲🇰💋👌✅💯🙋లు✅🤗

  • @MudiliPavani
    @MudiliPavani Před 2 měsíci

    Excellent speech

  • @rakeshsarvabhotla4998
    @rakeshsarvabhotla4998 Před 2 měsíci

    Vande guru paramparam

  • @marripudisubrahmanyam2781
    @marripudisubrahmanyam2781 Před 3 měsíci +2

    శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం 🔱🙏🔱🙏🙏🙏🌹🙏🌷🙏🙏🌹🙏🌷🙏🌷🙏🌷🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @gayataridevi5516
    @gayataridevi5516 Před 3 měsíci +6

    Jai sankaracharya

  • @user-iu5cz9qv1d
    @user-iu5cz9qv1d Před 3 měsíci +2

    అద్భుతమైన వ్యాఖ్యానం🙏🙏

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 Před 3 měsíci +3

    చెప్పింది బాగుంది గురువుగారూ మేము అడిగేది చెప్పరు విక్రమార్క జననం శాలివాహన జననం

  • @SeshuDuvvuri
    @SeshuDuvvuri Před 3 měsíci +5

    జయ జయ శంకర హర హర శంకర! ధన్యోస్మి. 🙏🙏🙏

  • @bathinaleela4718
    @bathinaleela4718 Před 2 měsíci

    Thanks for your wonderful message.Your Telugu vocabulary is too good.

  • @rameshram5825
    @rameshram5825 Před 3 měsíci +3

    Aum sri Gurubhyonamah

  • @ramuch5382
    @ramuch5382 Před 3 měsíci +3

    Excellent explanation.. thabk youbfor ur kindness🙏

  • @abhi-dx8wm
    @abhi-dx8wm Před 3 měsíci

    🙏

  • @godfathershiva6217
    @godfathershiva6217 Před 3 měsíci +3

    Shiva baba blesses all' us

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 3 měsíci +1

    జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర
    శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య గురు పర బ్రహ్మణే నమః 💐🙏😢😢😢😢అనేక ధన్యవాదములు సార్ అద్భుతమైన విషయాలు తెలియజేసారు

  • @vemuriramam9994
    @vemuriramam9994 Před 3 měsíci +2

    श्रुति स्मृति पुराणानामालयं करुणालयम् । नमामि भगवत्पादशंकरं लोकशंकरम् ॥

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 Před 3 měsíci

    🌹🙏 Namaste sir

  • @sivarajubaburao
    @sivarajubaburao Před 2 měsíci

    Super sir purti ga bartam teliyani vallu ku manchi ga chepperu

  • @hemavathihosur3235
    @hemavathihosur3235 Před 3 měsíci +3

    Chala manchi vishyalu chepparu Rajan garu..mukhyanga panchayathanam lo pujinche devathaurthula saligramaluye yekkada dorukuthayi anedi vivarincharu..chala mukhyamaina vishayalu sekarinchi channel samarpincharu..CZcams dwara Live chusanu shringeri nundi..tharuvatha Mee channel chudatam jarigindi...
    Sharakara jayanthi sandarbhanga meeku namassulu

  • @vamshikrishnamarupak
    @vamshikrishnamarupak Před 3 měsíci +1

    Poortiga chusamu vinnamu

  • @shankar1050
    @shankar1050 Před 3 měsíci +2

    chaala baaga chepparu

  • @madhu085
    @madhu085 Před 3 měsíci +2

    శంకర భగవత్పాదులు గురించి మరిన్ని వీడియోలు చేయండి

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3r Před 3 měsíci +2

    Very happy to see you on screen. So far I heard your voice only❤

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 Před 3 měsíci +2

    అన్ని

  • @riskyravi1
    @riskyravi1 Před 3 měsíci +1

    Jaya Jaya Sankara Hara Hara Sankara

  • @lakshmipydikondala8243
    @lakshmipydikondala8243 Před 3 měsíci +2

    Dhanyavaadaalu Rajan Mahoday 🙏🏻

  • @sudhayaram5828
    @sudhayaram5828 Před 3 měsíci +2

    Thank you so much Andi 🙏🙏🙏

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 Před 3 měsíci +1

    Jai Srimannarayana

  • @himabindu3189
    @himabindu3189 Před 3 měsíci +1

    Very good tribute to adisankara

  • @kiranthota8966
    @kiranthota8966 Před 3 měsíci

    రాజన్ గారికి చాలా చాలా ధన్యవాదములు 🙏🏻🙏🏻

  • @vamshikrishnamarupak
    @vamshikrishnamarupak Před 3 měsíci +1

    Jai gurudeva datta

  • @doddisatishsatish7879
    @doddisatishsatish7879 Před 3 měsíci +1

    Hi sir please continue vigyaana Bhairava tantram you have to given one video only please continue

  • @SameerDharmasastha
    @SameerDharmasastha Před 3 měsíci +1

    🕉️

  • @Lookintoyourmirrorfirst
    @Lookintoyourmirrorfirst Před 3 měsíci +1

    Sankarulu andinchina panchayathanam ni vimarsisthunnarandi. Advaitham paatinche vaarini (smarthulani) maayavaadulu , abedham batch antu thiduthunnarandi. Vaishnavulaki smarthulante yendukandi anta manta? 😢 ..

  • @barubhairavabhotla831
    @barubhairavabhotla831 Před 3 měsíci +2

    @rajanptsk ayya 2500 yesars kadu 5000years back please check

  • @proudcherla
    @proudcherla Před 3 měsíci +1

    1600 SAMVATSARAALU, 2500 SAMVATSARAALU GODAVA VISADEEKARINCHA GALARU

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 Před 3 měsíci +2

    శ్రీ శంకరభగవత్పాదుల వారి కాల నిర్ణయానికి చెందిన లంకె, జ్యోతిష శాస్త్రం ప్రకారం శంకరమంచి వారు చెప్పినది czcams.com/users/livePY4CH8CJ5QQ?si=wq1HA_UDQftGhyZy

  • @yarnagulaprasanthi6454
    @yarnagulaprasanthi6454 Před 3 měsíci

    visvanaduni yekavira kada kavali sir

  • @madhavigorantyal9460
    @madhavigorantyal9460 Před 3 měsíci +1

    🙏🪷🙏🪷🙏🪷

  • @mahikommathoti
    @mahikommathoti Před 3 měsíci +1

    Sanathana ధర్మం లో కూడా వివక్ష ఉందిగా అజ్ఞానం మూఢ నమ్మకాలు అన్నీ మతాల్లో ఉన్నాయి

  • @pulluru.prabhakararao3214
    @pulluru.prabhakararao3214 Před 3 měsíci +1

    PTSK means

  • @somupeguda3218
    @somupeguda3218 Před 3 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @madhumathidevi3652
    @madhumathidevi3652 Před 3 měsíci

    🙏

  • @girijamanchi8241
    @girijamanchi8241 Před 3 měsíci

    🙏🙏🙏

  • @pvbnmurty
    @pvbnmurty Před 3 měsíci

    🙏🙏🙏

  • @pratappratap2618
    @pratappratap2618 Před 3 měsíci +2

    🙏🙏🙏

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Před 3 měsíci +1

    🙏