శిరిడి బూటి వాడ వైభవం ... బూటి వారసుల సమాధి మందిరాన్ని ఎలా దర్శించుకుంటారో తెలుసా

Sdílet
Vložit
  • čas přidán 10. 04. 2021
  • షిరిడి సిరులు // Shiridi Sirulu Ep 43 || శిరిడి బూటి వాడ వైభవం ... బూటి వారసుల సమాధి మందిరాన్ని ఎలా దర్శించుకుంటారో తెలుసా // Shiridi SaiBaba Story // SaiLeela ||
    నాగపూర్‌ నివాసి, కోటీశ్వరుడు అయిన శ్రీ గోపాలరావ్ ముకుంద్ అలియాస్ బాపూసాహెబ్ బూటీ సాయిబాబాకు గొప్ప భక్తుడు. అతనొక న్యాయవాది మరియు వ్యాపారవేత్త. అతని వ్యాపారానికి సంబంధించిన శాఖలు పలుచోట్ల ఉన్నాయి. బాబా అతన్ని ప్రేమగా “బూటయ్యా!” అని పిలిచేవారు. చాలామంది భక్తులు బాబాతో మాట్లాడేవారు, వాదించేవారు. కానీ బూటీ, నూల్కర్ మరియు ఖపర్డేలు ముగ్గురు మాత్రం బాబా సమక్షంలో ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. వాళ్ళ లక్ష్యమొక్కటే - బాబా చెప్పినట్లు నడుచుకోవడం.కోటీశ్వరుడైనప్పటికీ బూటీ సాధుసత్పురుషుల సేవను ఎంతో ఇష్టపడేవాడు. అతను బెరార్‌కి చెందిన సత్పురుషుడు గజానన్ మహరాజ్‌ను గురువుగా భావిస్తూ సంవత్సరంలో ఎక్కువ సమయం వారి సేవలో గడపాలని తలచేవాడు. ఒకసారి బూటీ హజరత్ తాజుద్దీన్‌బాబాను దర్శించాడు. ఆయన, "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్? నీ గురువు శిరిడీలో నీకోసం వేచి ఉన్నారు, త్వరగా అక్కడికి వెళ్ళు!" అని అన్నారు. ఆయన మాటలు బూటీకేమీ అర్థం కాలేదు. ఆ తరువాత 1910వ సంవత్సరంలో శ్రీ ఎస్.బి.ధుమాళ్ అతన్ని మొట్టమొదటిసారి సాయిబాబా దర్శనానికి తీసుకుని వెళ్ళాడు. ఒకప్పుడు గజానన్ మహరాజ్ సేవలో ఎక్కువ సమయం గడపాలనుకున్న బూటీ, బాబా దర్శనంతో ఎంతో తృప్తి చెంది, కుటుంబంతో సహా తరచూ శిరిడీ వెళ్లి బాబా సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతుండేవాడు. క్రమంగా అతను శిరిడీనే తన శాశ్వత నివాసం చేసుకోవాలని ఆరాటపడసాగాడు. అందుకోసం శిరిడీలో ఒక భవన నిర్మాణం చేయాలని తరచూ అనుకుంటుండేవాడు. ప్రతిరోజూ మధ్యాహ్న ఆరతి తరువాత, బాబాకు ఎడమవైపున కూర్చుని బూటీ భోజనం చేసేవాడు. బాబా రోజూ లెండీకి వెళ్లిరావడం ఒక ఉత్సవంగా మారినప్పటినుండి అతను బాబాకు ఎడమవైపున నడిచేవాడు. ఒకసారి నానాసాహెబ్ డేంగ్లే అను గొప్ప జ్యోతిష్కుడు బూటీతో, "ఈరోజు మీకు అత్యంత అశుభమైన రోజు. ఈరోజు మీకు ప్రాణగండం ఉంది. మనసులో ధైర్యాన్ని కూడగట్టుకుని అప్రమత్తంగా ఉండండి" అని చెప్పాడు. అది విని బూటీ మనసు ఆందోళనకు గురైంది. ప్రతిక్షణం దాని గురించే చింతించసాగాడు. తరువాత తన అలవాటు ప్రకారం నానాసాహెబ్ తదితర భక్తులతో కలిసి మసీదుకు వెళ్లి బాబా వద్ద కూర్చున్నాడు. బాబా అతనిని చూస్తూనే, "ఈ నానా ఏమంటున్నాడు? ఈరోజు నీ జాతకం బాగాలేదని, నీకు మరణం సంభవిస్తుందని చెప్తున్నాడా? సరే, నీవు భయపడనక్కరలేదు. ‘మృత్యువు ఎలా చంపుతుందో చూద్దాం’ అని అతనితో ధైర్యంగా చెప్పు" అని అన్నారు. ఆ సాయంత్రం బూటీ మరుగుదొడ్డికి వెళ్ళినప్పుడు అక్కడొక పాము కనిపించింది. అతను భయంతో బయటకు పరిగెత్తుకు వచ్చాడు. అతని సేవకుడైన లహను ఒక రాయిని తీసుకుని ఆ పామును చంపబోయాడు. బూటీ అతనిని వారించి, "వెళ్లి కర్ర తీసుకుని రమ్మ"ని పంపించాడు. లహను కర్ర తీసుకుని వచ్చేలోపు పాము గోడపైకి ప్రాకుతూ అదుపుతప్పి క్రిందపడి ఒక రంధ్రం గుండా బయటకు వెళ్ళిపోయింది. ఆ ఉదయం బాబా తనతో అన్న మాటలను జ్ఞాపకం చేసుకుని, తనకు, పాముకు ఏ హానీ జరగకుండా బాబా కాపాడిన విధానానికి బూటీ ఆశ్చర్యపోయాడు.1916లో బూటీ రెండవ వివాహం శిరిడీలో జరిగింది. ఆ పెళ్ళికి ఎమ్.డబ్ల్యు.ప్రధాన్ మొదలైన భక్తులు హాజరయ్యారు. ఒకసారి ఒక భక్తుడు బాబా చేతిలో ఒక జ్యోతిష్య శాస్త్ర గ్రంథాన్ని పెట్టి, తిరిగి దాన్ని వారి ప్రసాదంగా తీసుకోదలిచాడు. అలా తీసుకోవడం వల్ల తనకా శాస్త్రంలో ప్రావీణ్యం సిద్ధిస్తుందని, తద్వారా తన దశ మారుతుందని అతని ఆలోచన. కానీ బాబా ఆ పుస్తకాన్ని అతనికి ఇవ్వకుండా దగ్గరలో కూర్చుని ఉన్న బూటీ చేతికిచ్చి, "దీన్ని తీసుకో!" అన్నారు. బూటీకి ఆ పుస్తకాన్ని చదవాలన్న ఆసక్తి లేకపోయినప్పటికీ బాబా ప్రసాదించారని కష్టపడి ఒకసారి చదివాడు. ఒక్కసారే చదివినప్పటికీ అతనికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగి, నైపుణ్యం కలిగిన జ్యోతిష్కుడిలా పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయగలిగేవాడు. ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే దీక్షిత్ గెలుస్తాడో బూటీ చెప్పాడు. బూటీ చెప్పినట్లుగానే ఎన్నికలు ఆ సమయంలోనే జరిగి దీక్షిత్ గెలిచాడు.ఒకరాత్రి బూటీ, శ్యామాలు దీక్షిత్‌వాడా పైఅంతస్తులో నిద్రపోతున్నారు. కొంతసేపటికి బూటీకి ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా అతనికి దర్శనమిచ్చి, "మందిరంతో సహా ఒక వాడాను నిర్మించు” అని ఆదేశించారు. వెంటనే అతనికి మెలకువ వచ్చి, కలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతలో ప్రక్కనే పడుకుని ఉన్న శ్యామా ఏడుస్తున్న శబ్దం అతనికి వినిపించింది. బూటీ అతనిని మేల్కొలిపి, "మీరెందుకు ఏడుస్తున్నార”ని అడిగాడు. అందుకు శ్యామా, "నాకొక స్వప్నదర్శనమైంది. అందులో బాబా కనిపించి, “మందిరంతో సహా ఒక వాడాను నిర్మించండి! నేనక్కడ ఉండి అందరి కోరికలు తీరుస్తాను” అని చెప్పారు. మధురమైన వారి ప్రేమ పలుకులు విని నాకు భావోద్రేకం కలిగి, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఆ పారవశ్యంలో నా కళ్ళనుండి కన్నీళ్లు పొంగిపొర్లుతున్నాయి" అని చెప్పాడు. శ్యామా మాటలు విన్న బూటీ తనకు కూడా అదే కల వచ్చిందని చెప్పాడు. ఇద్దరికీ ఒకే కల వచ్చినందుకు శ్యామా, బూటీలు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ కల ద్వారా శిరిడీలో స్వంత భవనం నిర్మించుకోవాలన్న తన కోరికకు బలం చేకూరి, ఆలస్యం చేయక మందిరంతో సహా ఒక వాడాను నిర్మించాలని బూటీ సంకల్పించాడు. వెంటనే శ్యామా, బూటీలిరువురూ కూర్చుని వాడా రూపురేఖల నమూనాను తయారుచేశారు. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని పరిశీలించి ఆమోదించాడు. మరుసటిరోజు ఉదయం ముగ్గురూ బాబా వద్దకు వెళ్లారు. శ్యామా తనకి, బూటీకి గతరాత్రి వచ్చిన కల గురించి సాయిబాబాతో చెప్పాడు. వెంటనే బాబా వాడా నిర్మాణానికి తమ అనుమతిని ప్రసాదించారు.1921లో బాపూసాహెబ్ బూటీకి అంతిమ ఘడియలు సమీపించాయి. బూటీ శ్యామాను దగ్గరకు పిలిచి, "మాధవరావ్! నేను ఈ బాధను భరించలేకపోతున్నాను. బాబా నన్ను తమ పాదాల చెంతకు చేర్చుకుంటే బాగుంటుంది. నాకు మీ గురించి బాగా తెలుసు. మీరు దగ్గర ఉంటే, నాకు బాబా పాదాల వద్ద ఉన్నట్లే అనిపిస్తుంది" అని చెప్తూ, మా పాదాలనే బాబా పాదాలుగా భావించి శ్యామా పాదాలపై తన శిరస్సునుంచాడు.
  • Zábava

Komentáře • 43