శ్రీశైల దేవస్థానం "ఈ.ఓ." పెద్దిరాజుగారి ప్రశ్న |

Sdílet
Vložit
  • čas přidán 5. 01. 2024
  • "వైభవోపేతంగా జరిగిన గీతావధానం"
    23-12-23, గీతాజయంతి సందర్భంగా సాయంత్రం 7:30 గంటలకు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి శ్రీశైల దేవస్థానములో దేవస్థానం వారి నిర్వహణలో అష్టావధాని, గీతావధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావుగారి గీతావధానం ఎంతో వైభవోపేతంగా జరిగింది. అవధానానికి సంచాలకులుగా శతావధాని డా.బులుసు అపర్ణగారు వ్యవహరించి తమ సమర్థవంతమైన నిర్వహణలో అవధానాన్ని జయప్రదంగా నడిపించారు. ఈ అవధానం దీప ప్రజ్వలనతో మొదలై నాలుగు ఆవృత్తులతో కొనసాగి ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. ఈ అవధానంలో విశేషమేమిటంటే దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈ.ఓ.) శ్రీ పెద్దిరాజుగారు సపత్నీకంగా వచ్చి ఆద్యంతం పాల్గొనడం. వారు అవధానాన్ని చక్కగా పరిశీలించి ఎంతో ఆనందించారు. వారి ప్రథమ ప్రశ్నతో ప్రారంభమైన అవధానం, వారి అంతిమ ప్రశ్నతో ముగిసింది. తదనంతరం ఈ.ఓ. పెద్దిరాజుగారు ప్రష్టలను, సంచాలకులను, అవధానిని ఘనంగా సత్కరించారు.
    #Umamaheswararao #Yarramsetti
    ‪@UmamaheswararaoYarramsetti‬ ‪@sahithikoumudi‬

Komentáře • 19

  • @saispiritualsparksbyjandhy5456
    @saispiritualsparksbyjandhy5456 Před 5 měsíci +1

    అద్భుతం
    ఉమామహేశ్వర రావు గారికి అభినందనలు
    సోదరి అపర్ణ గారికి నమస్సులు

  • @rameshbusetty
    @rameshbusetty Před 2 měsíci +1

    అతని సాధన మరియు తనమీద తనకు వున్న నమ్మకము మరియు ఆదైవ ఆశీర్వాదము తనకు మిండు గా వున్నది.
    తను ఇంకా ముందు ముందు మరింత ఖ్యాతి గడించాలి
    అని కోరుకుంటున్నాను.

  • @baktisadhanam9177
    @baktisadhanam9177 Před 5 měsíci +1

    అద్భుతం మహోదయ

  • @venkataratnakumar1688
    @venkataratnakumar1688 Před 5 měsíci +1

    ఉమామహేశ్వర రావు గారికి అభినందనలు

  • @venkataratnamadabala4992
    @venkataratnamadabala4992 Před 5 měsíci +1

    అద్భుతం. అభినందనలు

  • @durgaprasanth711
    @durgaprasanth711 Před 5 měsíci +1

    proud of you ఉమామహేశ్వరరావు💐🙏

  • @sahithnc
    @sahithnc Před 6 měsíci +2

    చాలా అద్భుతం అన్నయ్య! అమితమైన ధారణా శక్తి మీ సొంతం. దీర్ధారణావతీ మేధా అని అన్నారు కదా. ఆ మేధా దేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన వారు మీరు. 2022 జూన్ లో జరిగిన మీ గీతావధానంలో ఒకానొక పృచ్ఛకునిగా పాల్గొనటం నా అదృష్టం. మీకు హృదయ పూర్వక శుభాభినందనలు... 🙏🙏

    • @GoniguntlaPradeep
      @GoniguntlaPradeep Před 6 měsíci +1

      Excellent work🎉

    • @UmamaheswararaoYarramsetti
      @UmamaheswararaoYarramsetti  Před 5 měsíci +1

      ధన్యవాదాలు అవధానిగారు! మీ మొదటి అవధానంలో నేను పాల్గొనడం వల్ల మీ కళాకౌముదీ మధురానుభూతితో ఆనందించాను... 😊♥️🤝

  • @purushotham4235
    @purushotham4235 Před 6 měsíci +1

    🙏🙏🙏

  • @BasuBBasu
    @BasuBBasu Před 5 měsíci +1

    Super