'శతావధాని' బులుసు అపర్ణగారి తొలి పలుకులు | గీతావధానం, శ్రీశైలము 23-12-23 |

Sdílet
Vložit
  • čas přidán 1. 01. 2024
  • "వైభవోపేతంగా జరిగిన గీతావధానం"
    23-12-23, గీతాజయంతి సందర్భంగా సాయంత్రం 7:30 గంటలకు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి శ్రీశైల దేవస్థానములో దేవస్థానం వారి నిర్వహణలో అష్టావధాని, గీతావధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావుగారి గీతావధానం ఎంతో వైభవోపేతంగా జరిగింది. అవధానానికి సంచాలకులుగా శతావధాని డా.బులుసు అపర్ణగారు వ్యవహరించి తమ సమర్థవంతమైన నిర్వహణలో అవధానాన్ని జయప్రదంగా నడిపించారు. ఈ అవధానం దీప ప్రజ్వలనతో మొదలై నాలుగు ఆవృత్తులతో కొనసాగి ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. ఈ అవధానంలో విశేషమేమిటంటే దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈ.ఓ.) శ్రీ పెద్దిరాజుగారు సపత్నీకంగా వచ్చి ఆద్యంతం పాల్గొనడం. వారు అవధానాన్ని చక్కగా పరిశీలించి ఎంతో ఆనందించారు. వారి ప్రథమ ప్రశ్నతో ప్రారంభమైన అవధానం, వారి అంతిమ ప్రశ్నతో ముగిసింది. తదనంతరం ఈ.ఓ. పెద్దిరాజుగారు ప్రష్టలను, సంచాలకులను, అవధానిని ఘనంగా సత్కరించారు.
    #Umamaheswararao #Yarramsetti
    ‪@UmamaheswararaoYarramsetti‬
    ‪@sahithikoumudi‬ ‪@srisailamdarshanam4907‬

Komentáře • 15