జీవితంలో ఆయా స్థితుల్లో నీవు ఎలా ఉండాలో తెలిపే రుసోమమా ప్రియాంబిక // Sai Gurukulam episode1230

Sdílet
Vložit
  • čas přidán 5. 03. 2024
  • Sai Gurukulam episode1230 // జీవితంలో ఆయా స్థితుల్లో నీవు ఎలా ఉండాలో తెలిపే రుసోమమా ప్రియాంబిక
    బాబా యందరివద్దనుంచి దక్షిణ తీసికొనుచుండునని యందరికి తెలిసిన విషయము. ఈ విధముగా వసూలుచేసిన మొత్తములో నెక్కువ భాగము దానము చేసి మిగతదానితో వంటచెఱకును (కట్టెలను) కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది యిప్పటికి నటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది యనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమతమ యిండ్లకుతిరిగి పోవునప్పుడు పంచిపెట్టెడివారు.
    ఊదీవలన బాబా యేమి బోధించ నుద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిదవలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నియు సౌఖ్యముల ననుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద యగును. ఈ సంగతి జ్ఞప్తికి దెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు, కొడుకుగాని, తండ్రిగాని, తల్లిగాని, మనవాండ్రు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, యొంటరిగానే పోయెదము. ఊదీ యనేకవిధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊదీద్వారా నిత్యానిత్యమునకు గల తారతమ్యము, అనిత్యమైనదానియం దభిమానరాహిత్యము గంటమ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది (ఊది) వివేకము, రెండవది (దక్షిణ) వైరాగ్యము బోధించుచుండెను. ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా యడిగి దక్షిణ తీసికొనుచుండెను. షిరిడీనుంచి యింటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా నిచ్చి, కొంత నుదుటపై వ్రాసి తన వరదహస్తమును వారి శిరస్సులపై నుంచుచుండెను. బాబా సంతోషముతో నున్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊదీ గురించి యొకటి పాడుచుండిరి. దాని పల్లవి "కళ్యాణ రామ రారమ్మ; గోనెలతో ఊదీని తేతెమ్ము." బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు.
  • Zábava

Komentáře •