Sai GurukulamEpisode1314//శ్రీ సాయికి తొలి గురుపూజ, తొలి హారతి ఇచ్చే అదృష్టం నూల్కర్కు ఎలా దక్కింది?

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • Sai Gurukulam Episode 1314 //శ్రీ సాయికి తొలి గురుపూజ, తొలి హారతి ఇచ్చే అదృష్టం నూల్కర్కు ఎలా దక్కింది?
    అంకితసాయిభక్తుడైన శ్రీలక్ష్మణ్ కృష్ణాజీ నూల్కర్ వురఫ్ 'తాత్యాసాహెబ్ నూల్కర్'ను గురించిన వివరాలు శ్రీసాయిసచ్చరిత్ర 31వ అధ్యాయంలో స్వల్పంగా ప్రస్తావించబడ్డాయి. శ్రీసాయిబాబాకు అత్యంత సన్నిహిత భక్తులలో ఒకరైన శ్రీనూల్కర్ కు సంబంధించిన పూర్తివివరాలు శ్రీసాయిచరిత్రలలో లభించడం లేదు. కాని లెఫ్టనెంట్ కల్నాల్ (రిటైర్డ్) శ్రీనింబాల్కర్ గారు శ్రీనూల్కర్ బాల్యము, ఉద్యోగము, వారి ఆధ్యాత్మిక ప్రగతి, వారు ఏ విధంగా సాయిబాబాచే ఆకర్షితులై చివరకు శిరిడీలో ఎలా జన్మరాహిత్యాన్ని పొందారు మొదలైన వివరాలన్నీ ఆనాడు శ్రీ షామా తదితరులు వ్రాసిన ఉత్తరాలతో సహా సేకరించి 1991లో శ్రీసాయిలీల పత్రికలో ప్రచురించారు. ఈ వ్యాసమేగాక శ్రీనూల్కర్ గూర్చి శ్రీడి.యస్.టిప్నిస్ మరాఠీలో రచించిన మరో వ్యాసం 1978 సాయిలీలామాసిక్ (మరాఠీ) పత్రికలో ప్రచురింపబడింది. శ్రీనూల్కర్ జీవిత విశేషాలు, గురుపూర్ణిమనాడు బాబాకు భక్తులు చేసిన గురుపూజకు సంబంధించిన వివరాలలో పైన పేర్కొన్న రెండు వ్యాసాలకు కొంత వైరుధ్యముంది. ఆ వ్యాసాలలోను, తక్కిన సాయిచరిత్రలలోను శ్రీనూల్కర్ గురించి ప్రచురింపబడిన వివరాలనన్నిటినీ క్రోడీకరించి, యీ సమగ్ర వ్యాసాన్ని పాఠకులకందిస్తున్నాం!
    శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్ 1862 లేక 1863లో జన్మించారు. పూనాలో విద్యాభ్యాసం జరిగింది. తర్వాత న్యాయవాదపట్టా పుచ్చుకొని ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించారు. వీరు న్యాయవాదిగానే గాక సత్యవాదిగా, దృఢసంకల్పం కలిగిన స్వార్థరహితుడుగా పేరు తెచ్చుకొన్నారు. న్యాయమూర్తిగా తన వృత్తి నిర్వహణలో వీరు చూపిన సంయమనము, నిజాయితీ అందరిచే ప్రశంసలందుకొంది. ఆధ్యాత్మికచింతన గలిగినవాడు. ఉపనిషాది వేదాంతగ్రంథాలు క్షుణ్ణంగా చదివినవాడు. సాధుసంతులను తరచూ దర్శించి వారి సాంగత్యంలో గడిపేవాడు.
    తమను పూజించేందుకు బాబా ఎవరినీ అనుమతించేవారు కాదు. భక్తులెవరైన పూల మాలవేయబోయినా నిరాకరించేవారు. ఒక గురుపూర్ణిమ రోజున మొట్టమొదట బాబాకు పూజ నిర్వహించే భాగ్యం తాత్యాసాహెబ్‌‌కు దక్కింది. ఒకరోజు ఉదయం తాత్యాసాహెబ్ మసీదుకు వెళ్ళి నమస్కరించగానే, బాబా అతనికి మసీదు ప్రక్కన స్తంభం కేసి చూపుతు "రేపు ఆ స్తంభాన్ని పూజించు!" అన్నారు. బాబా అలా ఎందుకన్నారో నూల్కర్‌‌కు బోధపడలేదు. బసకు తిరిగి వెళ్ళిన తరువాత బాబా ఆదేశాన్ని షామాకు చెప్పి, అలా ఆదేశించడంలో బాబా ఉద్దేశ్యమేమై వుంటుందని అడిగాడు. షామాకు కూడా అర్థం కాలేదు. అతను వెంటనే బాబాను అడుగుదామని మసీదుకెళ్ళాడు. బాబా అతనితో కూడా అదే మాట చెప్పారు. ఆ తర్వాత తాత్యాకోతేపాటిల్ తోనూ, దాదాకేల్కర్ తోనూ బాబా అవే మాటలన్నారు. మరుసటిరోజు శనివారం. ఉదయం నిద్ర మేల్కొన్న నూల్కర్‌‌కు ఆరోజు గురుపూర్ణిమ అని హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఆ విషయాన్ని అతడు షామా తదితర భక్తులకు చెప్పాడు. అందరూ పంచాంగం, కేలండర్ తెప్పించి చూచారు. నిజమే! ఆ రోజు గురుపూర్ణిమ! ఆ ముందురోజు బాబా తమతో 'రేపు ఆ స్తంభాన్ని పూజించమ'ని ఆదేశించడంలోని పరమార్థం వారికప్పుడు బోధపడింది. అందరికీ ఎంతో ఆనందమయింది.
    వెంటనే అందరు మసీదుకు వెళ్ళి, 'గురుపూజ' చేసుకోవడానికి అనుమతించమని బాబాను వేడుకొన్నారు. బాబా ముందురోజు చెప్పినట్లుగానే మసీదులోని స్తంభానికి పూజచేసుకొమ్మన్నారు. “దేవా, ఆ స్తంభాన్ని ఎందుకు పూజించాలి? మేము మీకే పూజ చేసుకుంటాము. సాక్షాత్తు దైవమే మా ఎదురుగా వుంటే, స్తంభాన్ని పూజించవలసిన పనేముంది?" అని షామా వాదించాడు. తమను పూజించేందుకు బాబా ససేమిరా అంగీకరించలేదు. భక్తులు పట్టువిడువలేదు. చివరకు, భక్తిభావంతో వారు కోరే విన్నపాన్ని మన్నించక తప్పలేదు బాబాకు. “సరే మీ ఇష్టం!” అన్నారు. భక్తుల ఆనందానికిక పట్టపగ్గాలు లేవు.
    వెంటనే గురుపూజకు సన్నాహాలు మొదలుపెట్టారు. బాబా భిక్షకు వెళ్ళివచ్చిన తర్వాత పూజ నిర్వహించాలని తలచి వారికీ విషయం తెలిపారు. బాబా దయతో అంగీకరించడమే కాకుండా వారికన్నీ ఉపచారాలు (పూజావిధులు) చేయడానికి కూడ అనుమతించారు. బాబా రాధాకృష్ణఆయీకి, దాదాకేల్కర్‌‌కు కబురు పంపారు. రాధాకృష్ణఆయీ పూజాద్రవ్యాలు పంపింది. దాదాకేల్కర్ పూజావస్తువులతో మశీదు చేరాడు. సామూహికంగా పూజ నిర్వహించబడింది. తమకు సమర్పించిన దక్షిణలన్నీ బాబా తిరిగి భక్తులకే ఇచ్చివేశారు. పూజ అయినతర్వాత ఆరతిచ్చారు. అలా, ఆ సంవత్సరంనుంచీ ప్రతిఏటా శిరిడీలో గురుపూర్ణిమ ఎంతో వైభవంగా జరగటం ప్రారంభమయింది.
    తాత్యాసాహెబ్ నూల్కర్‌‌కు, బాబాకు ఆ ఆరతి రోజూ ఉంటే ఎంతో కన్నులపండుగగా ఉంటుంది కదా అనిపించింది. శిరిడీలో సాయిసన్నిధిలో ఏ పూజ అన్నా, ఉత్సవమన్నా ఎంతో ఉత్సాహం చూపే రాధాకృష్ణఆయీకి కూడా ఆ ఆలోచనే కలిగింది. ఆ విధంగా ఆనాడు వారి మనసుల్లో పుట్టిన ఆ సత్సంకల్పమే బాబా మందిరాలలో శిరిడీ ఆరతి సంప్రదాయమనే మహావృక్షానికి బీజమైంది. ప్రేరణ రాధాకృష్ణఆయిదే అయినా ప్రయత్నమూ, కార్యాచరణ నూల్కర్ పరమయ్యాయి.
    ప్రతిరోజూ బాబాకు ఆరతి నూల్కరే నిర్వహించేవాడు. బాబా శరీరధారిగా ఉన్నపుడు మధ్యాహ్న ఆరతి మాత్రమే మసీదులో జరిగేది. శేజ్ ఆరతి, కాకడ ఆరతులు చావడిలో మాత్రమే జరిగేవి. నూల్కర్ చివరిరోజులలో అనారోగ్యం వలన మసీదుకి, చావడికీ నడిచి రాలేని పరిస్థితి కలిగేంతవరకు బాబాకు ఆరతి అతని చేతులమీదుగానే జరిగింది. ఆ తర్వాత ఆ భాగ్యం మేఘునికి దక్కింది. 1912లో మేఘుడు చనిపోయిన తర్వాత బాపూసాహెబ్ జోగ్, బాబా మహాసమాధి వరకు ఆరతి నిర్వహించే అదృష్టం పొందాడు.
    బాబా తాత్యాసాహెబ్ ల పరస్పర ప్రేమ వర్ణించనలవికానిది. బాబా తాత్యాను 'తాత్యాబా' అని కానీ 'మ్హాతర' (ముసలీ) అనీ ప్రేమతో పిలిచేవారు. పూజకు ముందు భక్తులందరూ వివిధ భక్ష్యాలను నైవేద్యంగా బాబా ముందుంచేవారు. బాబా ఒక్కొక్కసారి, “ఈరోజు నాకు తాత్యాబా పోళీయే కావాలి!” అంటూ భక్తులు తెచ్చి రాశిగా పోసిన పోళీలనుండి సరిగ్గా నూల్కర్ సమర్పించిన పోళీనే తీసుకొని ప్రీతితో తినేవారు. ఎవరూ యేమీ చెప్పకుండా ఏ పోళీ ఎవరు సమర్పించారో చెప్పే బాబా మహిమకు భక్తులు ఆశ్చర్యపోయేవారు.
  • Zábava

Komentáře • 40