Sai Gurukulam Episode1309//బాబా ఖ్యాతిని పెంచే ఉపన్యాసాలే కాదు ఎవ్వరూ చేయలేని సేవను చందోర్కర్ చేశారు

Sdílet
Vložit
  • čas přidán 24. 06. 2024
  • Sai Gurukulam Episode1309//బాబా ఖ్యాతిని పెంచే ఉపన్యాసాలే కాదు ఎవ్వరూ చేయలేని సేవను చందోర్కర్ చేశారు
    శ్రీసాయిబాబా సశరీరులుగా ఉండగా వారిని ప్రత్యక్షంగా దర్శించి సేవించుకున్న భక్తులలో అగ్రగణ్యుడు శ్రీనారాయణ్ గోవింద్ చందోర్కర్ ఉరఫ్ నానాసాహెబ్ చందోర్కర్. ఇతను శ్రీసాయిబాబాకు ఎంతో ప్రీతిపాత్రుడు. తమ భక్తులందరినీ తామే ఎన్నో మిషల ద్వారా తమ వద్దకు రప్పించుకున్నప్పటికీ, బాబా స్వయంగానూ, బాహాటంగానూ తన వద్దకు పిలిపించుకున్న ఏకైక భక్తుడు నానాసాహెబ్ చందోర్కర్. అనేక దశాబ్దాలుగా వ్యాప్తిచెందుతున్న సాయిభక్తి అనే మహావృక్షానికి బీజం మహల్సాపతి అయితే, కాండం చందోర్కర్. శ్రీసాయి వరదహస్తం అతనిపై ఉన్నందున చందోర్కర్ తన జీవితాంతం బాబాకు సేవచేసి 1921, ఆగస్టు 21వ తేదీన శ్రీసాయిలో ఐక్యమయ్యాడు. బాబాతో అతనికున్న అనుబంధం, బాబా అతనిని తీర్చిదిద్దిన విధానం, విద్యావంతులైన భక్తుల అభివృద్ధికి బాబా ఉపయోగించే పద్ధతులు మరియు సమాజం కోసం బాబా చేసిన కృషి గురించి తెలుసుకోవడం ఒక విలక్షణమైన, అత్యంత ఉపయోగకరమైన అధ్యయనం. ఆ వివరాలను నానాసాహెబ్ చందోర్కర్ వర్ధంతి సందర్భంగా ప్రచురించి ఆ సాయిభక్తునికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నాం.
    ఒకసారి బాబా సద్గురువు యొక్క బాధ్యత గురించి నానాసాహెబ్ చందోర్కర్‌తో ఇలా చెప్పారు, "ఈ రోజుల్లో చాలామంది గురువులుగా మారాలని ఆరాటపడుతున్నారు. కానీ గురువు యొక్క బాధ్యత భారమైనది. గురువు తన శిష్యుడు మోక్షం పొందేవరకు ప్రతి జన్మలో అతనిని అనుసరిస్తూ చివరికి అతన్ని విముక్తుణ్ణి చేయాలి. కేవలం సలహా ఇవ్వడంతో ఎవరూ గురువులు కాలేరు. నేర్చుకున్న దానితో పుష్కలంగా ఉపన్యాసాలు ఇచ్చే వివేకవంతులైన పండితులు చాలామంది ఉన్నారు. అంతమాత్రంతో వాళ్ళు ఆధ్యాత్మిక గురువులుగా మారలేరు. నిజమైన గురువు తన శిష్యుడికి విషయాన్ని బోధించడంతో తృప్తి చెందక, అతడా విషయాన్ని ఎలా ఆచరిస్తున్నాడో జాగ్రత్తగా గమనిస్తుంటాడు. అంతేకాదు, అడుగడుగునా ప్రోత్సహిస్తూ, అవసరమైనప్పుడు సరిదిద్దుతూ, సరైన మార్గంలో నడిపిస్తూ జన్మ జన్మలందు అతని పురోగతిని పర్యవేక్షిస్తాడు" అని. ఈ కారణంగానే సర్వజ్ఞుడైన సాయిబాబా పూర్వజన్మలలో తమతో ఋణానుబంధాన్ని కలిగి ఉన్న వారినందరినీ వివిధ మిషల ద్వారా తమ వైపుకు ఆకర్షించి వారి ఆధ్యాత్మిక పురోగతి విషయంలో శ్రద్ధ వహిస్తున్నారు. ఆయన తమకు శరణాగతి చెంది పూర్తిగా తమపై ఆధారపడే వారి అన్నీ వ్యవహారాల(చిన్న చిన్న విషయాలతో సహా) పట్ల బాధ్యత వహిస్తారని చాలామంది నేటి భక్తులకు కూడా తెలుసు. బాబా యొక్క ఆ శ్రద్ధ, రక్షణ మరియు అన్నీ సమకూర్చడం శరణాగతి చెందడానికి కారణాలు మాత్రమే కాకుండా, శరణాగతి పథంలో కొనసాగడానికి మరియు వారిలో ఐక్యం చెందే దిశగా నడిపించడానికి చాలా ముఖ్యమైన అంశాలు. కాబట్టి బాబా నానాను తమ చెంతకు రప్పించుకొని అతనిపట్ల శ్రద్ధ వహించి ప్రాపంచికంగా అవసరమైన సహాయాన్ని, రక్షణను అందించి తమపట్ల అతనికి విశ్వాసాన్ని స్థిరపరచి తమకు శరణాగతి చెందేలా చేసారు. కానీ కేవలం ప్రాపంచికంగా రక్షణనివ్వడం మాత్రమే సరిపోదు. బాబా పని అతని ఆత్మను రక్షించడం మరియు దాని లక్ష్యాన్ని చేరుకునేలా శిక్షణ ఇవ్వడం. అందువల్ల ప్రాపంచిక విషయాలలో సైతం బాబా జోక్యం, వారి సహాయం చాలా మంచి ఆధ్యాత్మిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సరే, బాబా ప్రతి చిన్న సందర్భాన్ని ఉపయోగించుకొని నానాకి ఎలా పారమార్థిక ప్రయోజనాన్ని చేకూర్చారో చూద్దాం.
    మరో సందర్భంలో నానాసాహెబ్ శిరిడీలో బాబా సన్నిధిలో గడుపుతున్నాడు. అప్పుడొకరోజు ఉదయం నానా కలెక్టరును కలవడానికి కోపర్గాఁవ్ వెళ్ళాలనుకున్నాడు. అయితే అతను బయలుదేరేముందు సెలవు తీసుకోవడానికి బాబా వద్దకు వెళితే, "రేపు వెళ్ళు" అన్నారు బాబా. అంటే అప్పుడు వెళ్ళడానికి బాబా అతనికి అనుమతిని ఇవ్వలేదు. నానా కంటే తక్కువ విశ్వాసం ఉన్న వాళ్ళు బాబా మాటను పెడచెవిని పెట్టి బయలదేరేవాళ్ళు. కానీ నానాకి బాబా మీద పూర్తి విశ్వాసం, ఫలితంగా ఇంకో రోజు బాబాతో గడిపే ప్రయోజనం పొందాడు. అతను ఆరోజు శిరిడీలో గడిపి మరుసటిరోజు సెలవు తీసుకోవడానికి బాబా వద్దకు వెళ్ళాడు. అప్పుడు బాబా, "నువ్వు ఇప్పుడు వెళ్లి కలెక్టరుని కలుసుకో" అని అన్నారు. నానా బాబాకు ప్రణామాలర్పించి కోపర్గాఁవ్ వెళ్ళాడు. అతను అక్కడికి చేరాక కార్యాలయ సిబ్బందిని "నిన్న ఏం జరిగింది?" అని విచారించాడు. అప్పుడు వాళ్ళు, "ఈరోజు రావడం లేదు. రేపు వస్తానని కలెక్టరు టెలిగ్రాం పంపారు" అని చెప్పారు. ఆ టెలిగ్రాం కాపీ ఏం బాబాకు చేరలేదు. కానీ వారు తమ అంతర్ జ్ఞానంతో కలెక్టరు రావడం మరుసటిరోజుకు వాయిదా పడిందని తెలుసుకొని నానాకు తన గురువుతో ఇంకొక రోజు సమయం గడిపే ప్రయోజనాన్ని ఇచ్చారు. ఈ విధంగా అత్యంత ముఖ్యమైన అధికారిక విషయాలలో కూడా నానా విశ్వాసం బాబా మాటలను పాటించేలా చేసి ప్రాపంచికంగా మరియు ఆధ్యాత్మికంగా చాలా ప్రయోజనకారి అయింది.
  • Zábava

Komentáře • 33