లక్ష్మీ గౌరీ సంవాదం | శివతత్త్వం | Conversation between Lakshmi and Parvathi | Rajan PTSK

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • శివతత్త్వాన్ని తెలిపే లక్ష్మీ గౌరీ సంవాదం
    అమృతం కోసమని దేవతలు రాక్షసులు సముద్రాన్ని మథించారు. అందులో నుండి హాలాహలం, కామధేనువు, ఉచ్చైశ్రవం, ఐరావతం, కౌస్తుభమణి, పారిజాతమనే కల్పవృక్షం, అప్సరసలు, శ్రీమహాలక్ష్మి, సురకు అధిష్టానదేవతయైన వారుణి, ఆపై చివరిగా అమృతభాండంతో సహా ధన్వంతరి ఆవిర్భవించారు. వీటిలో అన్నిటికంటే ముందుపుట్టిన హాలాహలాన్ని పరమశివుడు భక్షించి లోకాలను రక్షిస్తే కామధేనువును మహర్షులు, ఉచ్చైశ్శ్రవాన్ని బలిచక్రవర్తి, ఐరావతాన్ని ఇంద్రుడు, కౌస్తుభమణిని విష్ణువు, కల్పవృక్షాన్ని, అప్సరసలను దేవతలు, వారుణిని రాక్షసులు తీసుకున్నారు. ధన్వంతరి ఆయుర్వేదాన్ని ప్రవర్తిల్ల జేసిన దేవ వైద్యుడు కాగా, అమృతాన్ని శ్రీమహావిష్ణువు జగన్మోహినిగా అవతారమెత్తి దేవతలకు పంచిపెట్టాడు. ఇక లోకపావని అయిన శ్రీమహాలక్ష్మి లోకపాలకుడైన శ్రీమహావిష్ణువును వివాహమాడి ఆయనకు దేవేరి అయ్యింది. ఆపై ఆ నవవధువు వైకుంఠానికి వెళ్లింది. కొత్తగా కాపురానికి వచ్చిన తన వదినగారిని చూడాలనుకుంది గౌరీదేవి. అనుకున్నదే తడవుగా బయలుదేరి పాలకడలికి వెళ్లింది. లక్ష్మీదేవి తన ఆడపడుచు అయిన గౌరీదేవికి ఎన్నో మర్యాదలు చేసి ఆదరించింది. ఆపై వారిద్దరూ పాలకడలి కెరటాలపై పరచిన వట్టుదుప్పటిపై కూర్చుని ఊయలలూగుతూ కబుర్లు చెప్పుకోసాగారు. లక్ష్మీదేవి తన ఆడపడుచు భర్త అయిన పరమశివుణ్ణి తన వివాహసమయంలో చూసింది. మహాతేజోవంతుడైన ఈ సత్పురుషుని వేషం ఇలా ఉందేమిటా అనుకుంది. ఆపై అతని గురించి వైకుంఠంలో తనవారిని ఆరాతీసి మరికొన్ని విషయాలు కూడా కనుక్కుంది. ఆయన మహాత్ముడనీ, యోగీశ్వరేశ్వరుడని, దేవతాసార్వభౌముడనీ ఇలా అందరూ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారే కానీ, అసలా మహానుభావుడు అలా ఎందుకుంటాడన్న విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. ఈరోజు సాక్షాత్తూ ఆ పరమేశ్వరుని సతీమణే స్వయంగా తనప్రక్కన కూర్చుంది కాబట్టి, ఆ విషయమేదో ఈవిడనే అడుగుదామనుకుంది. దానితో.. “గౌరీ! నేను నీ నాథుని గురించి కొన్ని ప్రశ్నలు అడగవచ్చునా” అంది లక్ష్మీదేవి. తన భర్త పేరు చెబితేనే చాలు పులకించిపోతుందా జగన్మాత. ఇక ఆయన గురించి అడిగితే చెప్పనంటుందా! “ఓ అడుగు లక్ష్మీ, చెబుతాను” అంది సంతోషంగా. ఆ వదినామరదళ్ళిద్దరూ ఒకరు వయసులోను, ఇంకొకరు వరసలోను పెద్ద కాబట్టి వారిమధ్య ప్రేమనిండిన మాటలే తప్ప మీరు మీరు అనే మన్నింపు సంబోధనలు లేవు. ఇక వారి సంవాదం ఇలా మొదలయ్యింది. లక్ష్మీదేవి అందమైన తన చుబుకం క్రింద చేయిపెట్టుకుని ఆశ్చర్యం నిండిన కళ్ళతో ఇలా అడగసాగింది.

Komentáře • 53

  • @jittu88
    @jittu88 Před 2 měsíci +9

    మీ కవిత చాలా బాగుంది రాజన్ గారు. అమ్మ మాటల్లో హరుడిని అద్భుతంగా వర్ణించారు 🙏🙏🙏
    ఓం నమఃశివాయ🙏🙏🙏

  • @sumanthkuchana5995
    @sumanthkuchana5995 Před 2 měsíci +11

    మీ రచన మహద్భుతంగా ఉంది.🙏

  • @abhimanyuvaradhi7083
    @abhimanyuvaradhi7083 Před 2 měsíci +12

    సరస్వతి మాత కటాక్ష సిద్ది పొందిన రాజన్ గురువు గారికి నమస్కారములు...🙏🙏🙏

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 Před 2 měsíci +5

    🙏🙏శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ గురవే నమః 🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 Před 2 měsíci +5

    అద్భుతం . 🙏 నిజంగా మీలో ఇంత గొప్ప కవి ఉన్నాడు
    మీ రు రాసిన శివుడికి లేఖ కూడా చాలా బావుంది బాబూ 🙏

  • @kamakshich19
    @kamakshich19 Před 17 dny +1

    ఎంతో బాగున్నదిమనస్సుకుహత్తుకుంది

  • @kvr4756
    @kvr4756 Před 2 měsíci +2

    బాగుంది. సరళమైన పదాలతో చక్కని భావాన్ని చాలా అందంగా ఆవిష్కరించారు. అభినందనలు.

  • @user-eq9li8bj3w
    @user-eq9li8bj3w Před 2 měsíci +2

    అద్భుతమైన రీతిలో సులువైన భాషలో రచించారు.

  • @nidamartiramayya1064
    @nidamartiramayya1064 Před 2 měsíci +4

    🕉️ 🙏 చాలా అర్ధవంతంగా మరియు మనోరంజకంగా ఉంది. ధన్యోస్మి 💐🙏

  • @praneethkarthikeya1406
    @praneethkarthikeya1406 Před 2 měsíci +3

    నమస్కారము అయ్యా ! తారాశశాంకం గురించి తెలుసుకోవాలనుంది దయచేసి
    తెలుపగలరు .

  • @sainagamaniyayavaram5150
    @sainagamaniyayavaram5150 Před 2 měsíci +5

    అద్భుతం🙏🙏🙏

  • @ChidVanhi
    @ChidVanhi Před 2 měsíci +2

    చాలా బాగుంది రాజన్ గారు.
    దయచేసి పి.డి.ఎఫ్ లో upload చేయండి.

  • @mastermaster5442
    @mastermaster5442 Před 2 měsíci +3

    Jai shree Ram

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 Před 2 měsíci +3

    ధన్యవాదాలు

  • @vijayalakshmim7483
    @vijayalakshmim7483 Před 2 měsíci +3

    👌👌👏👏🙌🙌సుఖీభవ సరస్వతీ పుత్రా:

  • @prasadvvsrprasadsarmaprasa4862
    @prasadvvsrprasadsarmaprasa4862 Před 2 měsíci +3

    Chalabagundisir

  • @sivalakshmi8273
    @sivalakshmi8273 Před 2 měsíci

    Adbhutam, Sir, mee explanation Akshara rupamlo chadavalani undi. JSL

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 Před 2 měsíci

    Chala chakaaga vivarimcharu.Dhanyavadamulu.Om namah Sivaya...

  • @satyadevigade8498
    @satyadevigade8498 Před 2 měsíci +2

    నమస్కారం గురువు గారు

  • @vishnuinsane
    @vishnuinsane Před 2 měsíci

    Superb 🎉🎉🎉🎉

  • @kvr8137
    @kvr8137 Před 2 měsíci +2

    నమస్కారం

  • @swarna4409
    @swarna4409 Před 2 měsíci +2

    🙏🏻👌👌👌

  • @nageswararaoyella7897
    @nageswararaoyella7897 Před 2 měsíci +8

    ఆ పరమేశ్వరుని ప్రబోధం....మీ వాగ్రూపం లో

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 Před 2 měsíci

    Jai sri ram🙏🙏

  • @gayataridevi5516
    @gayataridevi5516 Před 2 měsíci +3

    Evanni cheppatanikie dhevudu ninnu puttinchademo rajan babu intha chinna vayasulo anni bodhanalu great

  • @user-es5vb1cq1x
    @user-es5vb1cq1x Před měsícem

    Hari om sir

  • @malathivvn3958
    @malathivvn3958 Před 2 měsíci

    Chala bagundi Rajan garu.

  • @balrajdobba6748
    @balrajdobba6748 Před 2 měsíci

    Om namaha shivaya

  • @raghuramjaisrirammahamkali4956
    @raghuramjaisrirammahamkali4956 Před 2 měsíci +3

    జై శ్రీరామ్🙏

  • @gayataridevi5516
    @gayataridevi5516 Před 2 měsíci +2

    Gayathri anu nenu rajan babu mi patalu vinna adhbhuthaha nenu kuda patalu paduthanandi miru cheppetappudu miru padetappudu nenu padithe bavuntundhani na abhiprayam avakasam isthara rajan babu

  • @NarendraKumarAmbula
    @NarendraKumarAmbula Před měsícem

    🙏🙏🙏

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @kethinenisurendra3354
    @kethinenisurendra3354 Před 2 měsíci +5

    ఆర్యకు నమస్కారాలు మీరు ఎన్నో కథలు , ఆధ్యాత్మిక గురించి చెపుతుంటారు.
    అలానే మన ఆంధ్రుల మహా భారతం గా ప్రసిద్ధి చెందిన పల్నాటి యుద్ధం గురించి కూడా చెప్పగలరు

  • @godfathershiva6217
    @godfathershiva6217 Před 2 měsíci

    Excellent 👌 Shiva batblesses all you

  • @prathitanandaswami5379
    @prathitanandaswami5379 Před 2 měsíci +1

    God bless you

  • @banothsurender3148
    @banothsurender3148 Před 2 měsíci

    🙏🕉️💪🇮🇳

  • @k.l.n.h6253
    @k.l.n.h6253 Před 2 měsíci

    జై శ్రీ రామ్ 🙏🏼 రాజన్ గారు.

  • @padmajabhattiprolu7574
    @padmajabhattiprolu7574 Před 2 měsíci

    Chala బాగుంది

  • @usharaniippili3786
    @usharaniippili3786 Před 2 měsíci

    Adbhutam

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 Před 2 měsíci +1

    🙏🙏

  • @sumangali9800
    @sumangali9800 Před 2 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @keerthikeerthi5222
    @keerthikeerthi5222 Před 2 měsíci

    Sir Vijgyana Bhairava tantra continue cheyandi

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Před 2 měsíci

    సంవాదం గురించి వినటమే గాని ఏ సందర్భంలో నో. .తెలియదు ఇప్పటివరకు మీవివరణ చాలావినసొంపుగా ఉన్నది

  • @eswarakalyani2770
    @eswarakalyani2770 Před 2 měsíci

    తమ అభి మతం ఈడేరుగాక

  • @saradakulkarni7635
    @saradakulkarni7635 Před 2 měsíci

    Ammamala kalam nati ganga gouri samvadam kuda padagalaru guru garu.

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 Před 2 měsíci +1

    దశపాపహర దశమి కాబట్టి గంగాధరుని నామము స్తుతించినట్లయితే బాగుండేది

  • @durgagayathri4413
    @durgagayathri4413 Před 2 měsíci +2

    Miru evaru , em chestu vuntaru, vruthi emi. ,

  • @lalitmohan2823
    @lalitmohan2823 Před 2 měsíci +2

    Jai Shri Ram

  • @vagulasrinivasan4558
    @vagulasrinivasan4558 Před 2 měsíci +1

    🙏🙏🙏

  • @narayanakanta1101
    @narayanakanta1101 Před 2 měsíci +1

    🙏🙏🙏🙏🙏

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 Před 2 měsíci +1

    🙏🙏🙏

  • @Pranav2380
    @Pranav2380 Před 2 měsíci +1

    🙏🙏🙏