మార్పు చెందవా నీవు మర్పుచెందవా || Marpu Chendava Neevu || Telugu Christian Song

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • మార్పుచెందవా నీవు మర్పుచెందవా
    మార్పుచెందవా నీవు మర్పుచెందవా
    నీ బ్రతుకు మార్చుకోవా (2)
    అనుకూల సమయం ఇదియేనని ఎరిగి
    మారు మనసునూ పొందవా (2)
    1
    ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని
    ఏమున్నది ఈ లోకంలో
    ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
    తీర్పున్నది పై లోకంలో (2)
    తీర్పు దినమునందున ఆయన ముందు నీవు
    నిలిచే ధైర్యం నీకుందా (2)
    నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా||
    2
    దిగంబరిగానే వచ్చావు నీవు
    దిగంబరిగా పోతావు
    మన్నైన నీవు మన్నై పోతావు
    ఏదో ఒక దినమందున (2)
    నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు
    నీవెంట రావెన్నడు (2)
    నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా||
    3
    ఆత్మని కాక దేహాన్ని చంపే
    మనుషులకే భయపడకయ్యా
    ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
    దేవునికే భయపడవయ్యా (2)
    దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
    నీకంటూ ఏముందిలే (2)
    నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||

Komentáře •