ప్రమాణస్వీకారం చేసినటువంటి | గౌరవ శాసన సభ్యులందరికీ | తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు.

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2024
  • అందరికీ నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరొక చారిత్రాత్మక దినంగా మనం భావించుకోవాల్సిఉంది, రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు గత శాసనసభలో గౌరవ శాసన సభ్యుల పనితీరు ఏవిధంగా ఉన్నదో కూడా మన రాష్ట్రం అంతా చూసాము, మరి ఈరోజు రాష్ట్ర శాసనసభలో గౌరవ శాసనసభ కొలువు తీరింది, ఈ గౌరవ శాసనసభలోకి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి హోదాలో 163 మంది గౌరవ శాసన సభ్యులు వెంటరాగా మొదటిసారిగా గౌరవ శాసనసభలోకి అడుగుపెట్టడం జరిగింది, ఇది శుభ సందర్భం మనం ఒకసారి గతంలోకి వెళ్తే గత శాసనసభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు గా ఉన్నప్పుడు అధికారపక్షంలోని వైకాపా ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తించారు మనమంతా చూశాం, ఆరోజు అధికారం మదంతో కొంతమంది అధికారపక్ష శాసనసభ్యులు సభా నియమాలను నిబంధన ఉల్లంఘించి సభ మర్యాదను కాపాడుకుండా అసభ్యకరమైన అశ్లీలమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ గౌరవ ప్రతిపక్ష నాయకుడి యొక్క వ్యక్తిత్వానికి కించపరిచే విధంగా ప్రవర్తించారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండేటువంటి గౌరవ శాసనసభ్యుల పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించారు, ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని హరణం చేసే విధంగా ఆరోజు వాళ్లు మాట్లాడడం జరిగింది, ఆ విధంగా మాట్లాడినప్పుడు గౌరవ చంద్రబాబునాయుడు గారు తీవ్రంగా కలత చెంది
    ఆవేదంతో కన్నీళ్లు పెడితే దాన్ని కూడా అవహేళన చేసి మాట్లాడడం జరిగింది అవన్నీ మనం చూసాం, ఇది 2021 నవంబర్ 19 వ తారీఖున జరిగిన సందర్భంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆనాటి కౌరవసభలో ఒక శబదం చేసి మళ్లీ ముఖ్యమంత్రి హోదా లోనే ఈ శాసనసభలోకి అడుగు పెడతాను, కౌరవ సభ బదలు గౌరవ సభ ఏర్పాటు చేసిన తర్వాత సగర్వంగా లోపలికి వస్తానని చెప్పి శబదం చేసి ఆరోజు బయటికి రావడం జరిగింది, దీన్ని రాష్ట్ర ప్రజలంతా ఆరోజు చూశారు కల్లారా చెవులారా విన్నారు, ఆరోజు ఆయన చేసిన శబ్దాన్ని గౌరవించి రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేసిన అరాచకాలను దుష్ట పరిపాలనను ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అదేవిధంగా ఆరోజు శాసన సభలో వారు మాట్లాడినటువంటి భాష తీరు ఇవన్నీటిని గమనించిన ప్రజలు సరి అయిన నిర్ణయం తీసుకొని ఈరోజు ఎవరైతే ఆనాటి సభలో ఆ విధంగా ప్రవర్తించారో వారికి తగిన బుద్ధి చెప్పి నేడు శాసనసభలో అడుగు పెట్టే అవకాశం లేకుండాచేసినటువంటి ప్రజలందరికీ శిరసు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాము, ఈరోజు 11 మంది శాసనసభ్యులకే పరిమితం చేశారు ఆ పార్టీని , మరి ఆరోజు సభా నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాటి సభా గౌరవాన్ని కాపాడుకుండా తన సహచర శాసనసభ్యులు ఆ విధంగా అమానుషంగా ప్రవర్తిస్తుంటే పైశాచికమైన ఆనందం పొందారు మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా కేవలం సాధారణ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా వైకాపా పార్టీ నాయకులంతా కూడా ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి ఇప్పుడు కూడా ప్రజా తీర్పు గౌరవించకుండా అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఏదేమైనా కూడా ఈరోజు గౌరవ శాసనసభలో గౌరవ శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేసినటువంటి గౌరవ శాసన సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో గౌరవ శాసనసభ ఏర్పడటానికి సహకరించి ఈరోజు ప్రజాతీర్పు ఇచ్చినటువంటి గౌరవ ఓటర్లకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి పాదాభివందనాలు చేసుకుంటున్నాము.

Komentáře • 20

  • @rksevasadhan7412
    @rksevasadhan7412 Před 7 dny +3

    గురూజీ 🙏💐

  • @rrplywoodsmunirajunaiduvol2388

    ఎక్సలెంట్ స్పీచ్ బావగారు...

  • @dyviswa3461
    @dyviswa3461 Před 7 dny +1

    Yes congratulation sir 💐👏💐 thanking you. Visu

  • @rksevasadhan7412
    @rksevasadhan7412 Před 7 dny +2

    గురూజీ..మీరూ ఎక్కడ ఉంటే అక్కడ
    గొప్ప వెలుగు...అధి మన తెలుగు...
    ఇతరులకు సెగలు...
    మాకు పట్ట పగల వెలుగు....
    సదా మీ సేవలో మీ
    శిష్యుడు🙏💐

  • @vijayarao3420
    @vijayarao3420 Před 7 dny +2

    👍😍🙏

  • @p.s.alikhan7869
    @p.s.alikhan7869 Před 7 dny +1

    Thanks for good information sir

  • @rksevasadhan7412
    @rksevasadhan7412 Před 7 dny +2

  • @p.s.alikhan7869
    @p.s.alikhan7869 Před 7 dny +1

    🎉🎉🎉

  • @muthuqm
    @muthuqm Před 7 dny +1

    Congratulations to your party and you. Wish you all the best sir. 🎉

  • @p.s.alikhan7869
    @p.s.alikhan7869 Před 7 dny +1

    Thanks Anna garu mi abhimani THIRUPATHI ALI KHAN MUSLIM CELL TDP

  • @vanithavani3520
    @vanithavani3520 Před 7 dny

    Congratulations 🎊 👏 💐

  • @Raja13rithvik
    @Raja13rithvik Před 7 dny +1

    అర్థం చేసుకొనే జ్ఞానం బుర్రకు ఉంటే మంచి చెడ్డ తెలుస్తుంది

  • @ravikumar-cz4ul
    @ravikumar-cz4ul Před 7 dny +1

    Congratulations 💐🌹👍

  • @pmalathikumari1956
    @pmalathikumari1956 Před 7 dny

    🎉🎉🎉🎉

  • @muthuprasad4221
    @muthuprasad4221 Před 7 dny

    Super anna ✌️✌️✌️

  • @sumathik2909
    @sumathik2909 Před 7 dny

    Good coversation to public, your speech ever green sir, keep it all political meetings 🙏

  • @p.s.alikhan7869
    @p.s.alikhan7869 Před 7 dny +1

    SIR OUR C.M. CHANDRABABU GARU SAYS AFTER 2024 ELECTIONS I CANCELLED 22/A, REVENUE LANDS ACT TOTALLY CANCELLED

  • @mahindramahindra-hj6op
    @mahindramahindra-hj6op Před 6 dny +1

    Jai ycp Jai jagan Garu