వేంకట రమణ తండ్రి వేంకట రమణ | Venkata Ramana Tandri Venkata Ramana | ఓం నమో వేంకటేశాయ |

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • చరణం! వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచే టి తిరుమల రమణ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా....వెంకటరమణ తండ్రి(1)
    పల్లవి! 1) తెల్లవారు జాము ల్లో వెంకటరమణ తండ్రి , సుప్రభాతము చేసెను సిరులే రమణ - పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే ననిత్యము రమణ - వజ్రమ్మ కుటుంబముతో నువ్వే వెంకటరమణ తండ్రి, శంకు చక్ర దారుడువే తిరుమల రమణ - మూడు నామాల తోను వెంకటరమణ తండ్రి, ముల్లోకములు ఏలిది మూర్తి వి రమణ
    పల్లవి! 2) నీలాల కన్నుల్లో తో వెంకటరమణ తండ్రి, నీలమేఘశ్యామా తిరుమల రమణ - అందాల అదరముపై వెంకటరమణ తండ్రి, పాల పట్టి నవ్వుల యా తిరుమల రమణ - నల్లని వాడవయ్యా వెంకటరమణ తండ్రి, సుందరాకార ఉడకవే తిరుమల రమణ - ఓంకార రూపుడవే వెంకటరమణ తండ్రి, ఉగ్ర నరసింహుడవే వెంకటరమణ
    పల్లవి! 3) నిలువైన హృదయము పై వెంకటరమణ తండ్రి, పద్మావతి మంగళ నిలయము రమణ - వేద వేదాంగములే వెంకటరమణ తండ్రి, సామవేదానికి సరి సారధి రమణ - వెన్నముద్దల దొంగ వెంకటరమణ తండ్రి, ముల్లోకముల మోహన మురళివి రమణ - వైకుంఠ వాసుడవే వెంకటరమణ తండ్రి, వాసు దేవుడవయ్యా వెంకటరమణ
    పల్లవి! 4) ఏకాంత సేవ లతో వెంకటరమణ తండ్రి, శ్రీకాంత సేవలతో తిరుమల రమణ - వరాలు వర్షం పగ వెంకటరమణ తండ్రి, వరాహ మూర్తి వయా వెంకటరమణ - ప్రత్యక్ష దైవము రా వెంకటరమణ తండ్రి, ఆది నారాయణుడే తిరుమల రమణ - అలివేలు మంగా పతి వెంకటరమణ తండ్రి, అనురాగ మూర్తి వయ్య తిరుమల రమణ
    పల్లవి! 5) ప్రసిద్ధ వందిత శ్రీ వెంకటరమణ తండ్రి, వైకుంఠ వాసుడవే తిరుమల రమణ - మోక్షసాధన నీవే వెంకటరమణ తండ్రి, మోక్షద్వారము నీవే తిరుమల రమణ - కారుణ్య మూర్తి వయా వెంకటరమణ తండ్రి, కటాక్ష వీక్షణ లే తిరుమల రమణ - గోవింద గోవిందా వెంకటరమణ తండ్రి, గోవింద రాజువయ్యా గోకుల రమణ
    పల్లవి! 6) సహస్ర మూర్తి అడుగో వెంకటరమణ తండ్రి, ఆనందనిలయముపై వెంకటరమణ - భక్తజనులను రాగపు వెంకటరమణ తండ్రి, గోశాల లాలించెడి తిరుమల రమణ - అనంతపద్మనాభ వెంకటరమణ తండ్రి, అఖండ తేజముతో తిరుమల రమణ - అశేష భక్తులతో వెంకటరమణ తండ్రి, విశేష పూజలతో వెంకటరమణ
    పల్లవి! 7) సిద్ది బుద్ధులను ఇచ్చెడి వెంకటరమణ తండ్రి, శేషాద్రి శేఖరు డే తిరుమల రమణ - అనాధి నాధుడే వెంకటరమణ తండ్రి, పుండరీకాక్షుడవే తిరుమల రమణ - వర వెంకటాద్రి షా వెంకటరమణ తండ్రి, వామనావతారముతో తిరుమల రమణ - కోటి దివ్వెల నిచ్చెడి స్వామివిరా శ్రీ రమణ, కోదండపాణి వయా వెంకట రమణ
    పల్లవి! 8) దశవతారము లే వెంకటరమణ తండ్రి, ధర్మసంస్థాపకుడే తిరుమల రమణ - పద్మావతి దేవి తో వెంకటరమణ తండ్రి, ప్రసన్న మూర్తి వయా వెంకటరమణ - ఆద్యంతము నీవే వెంకటరమణ తండ్రి, అంజనా దిషుడవే తిరుమల రమణ - చిత్రాలకే చిత్రము వెంకటరమణ తండ్రి, నీ రూప సౌందర్యము వెంకటరమణ
    పల్లవి! 9) సంసార సాగరమును వెంకటరమణ తండ్రి, దాటించు వాడవు లే తిరుమల రమణ - లోకాల ఏలిక తో వెంకటరమణ తండ్రి, భక్తజన పాలకుడే తిరుమల రమణ - దాస జన పోషకుడే వెంకటరమణ తండ్రి, దరిద్ర నాషణివే తిరుమల రమణ - అజ్ఞానమే మాపగ వెంకటరమణ తండ్రి, విజ్ఞాన మీచెడ్డివో వెంకటరమణ
    పల్లవి! 10) మధురాతి మధురము లే వెంకటరమణ తండ్రి, నీ నామ సంకీర్తన మధురము రమణ - సప్త వాహనములపై వెంకటరమణ తండ్రి, దీవించు హస్తముతో తిరుమల రమణ - అండపిండ బ్రహ్మాండం వెంకటరమణ తండ్రి, విధాత యే కడిగిన పాదము రమణ - పరిమళ గంధముతో వెంకటరమణ తండ్రి, చందనోత్సవములయ వెంకటరమణ
    పల్లవి! 11) సాగర మధనము లో వెంకటరమణ తండ్రి, కూర్మావతారుడవే తిరుమల రమణ - ఏలేటి వాడ వయ్యా వెంకటరమణ తండ్రి, క్షీరాబ్ధి కన్యకక తో తిరుమల
    రమణ - స్మరించినంతనే శ్రీ వెంకటరమణ తండ్రి, వరించు వరములతో వెంకటరమణ - వడ్డీ కాసుల వాడే వెంకటరమణ తండ్రి, వజ్రాల కవచ ముతో తిరుమల రమణ
    పల్లవి! 12) భరతఖండము నందున వెంకటరమణ తండ్రి, భాగ్యాల పంట వయా తిరుమల రమణ - ప్రకృతి వికృతి శ్రీ వెంకటరమణ తండ్రి, కాల గమనము నీవే తిరుమల రమణ - సమస్త శాస్త్రాలను వెంకటరమణ తండ్రి, రచించు వాడవు లే తిరుమల రమణ - భోగ భాగ్యాలతో శ్రీ వెంకటరమణ తండ్రి, బాల బాలాజీ శ్రీ తిరుమల రమణ
    పల్లవి! 13) నిత్య సత్యము వాడే వెంకటరమణ తండ్రి, సత్యనారాయణ నుడే తిరుమల రమణ - నారద తుంబురు లే వెంకటరమణ తండ్రి, నీ నామ సంకీర్తన చేతురు రమణ - నీ పాదపద్మాలకు వెంకటరమణ తండ్రి, పారిజాతమ్ము లతో అర్చన రమణ - గోవింద గోపాల వెంకటరమణ తండ్రి, మయూర పించము తో వెంకటరమణ
    పల్లవి! 14) శృంగార మూర్తి వయా వెంకటరమణ తండ్రి, శ్రీరంగనాథుడువే వెంకటరమణ - ఊగేటి ఊయలపై వెంకటరమణ తండ్రి, తులతూగు వాడవులే వెంకట రమణ - కస్తూరితిలక ముతో వెంకటరమణ తండ్రి, కారుణ్య మూర్తి వయా తిరుమల రమణ - పదివేల శేషుల పై వెంకటరమణ తండ్రి, పవళించు వాడవయ్య వెంకటరమణ
    పల్లవి! 15) ముల్లోకములను మేలేడీ వెంకటరమణ తండ్రి, మత్స్యావతారుడవే తిరుమల రమణ - పవానాకారము తో వెంకటరమణ తండ్రి, పరశురాముండు ఇతడే తిరుమల రమణ - ఏడుకొండలవాడా వెంకటరమణ తండ్రి, బౌద్ధ కల్కివి నీవే తిరుమల రమణ - నీదావ తారమూలే వెంకటరమణ తండ్రి , కీర్తింప మా తరమా తిరుమల రమణ
    పల్లవి! 16) అఖండ జ్యోతులతో వెంకటరమణ తండ్రి, అష్టలక్ష్ముల కొలువే తిరుమల రమణ - గోపాల పోషకుడే వెంకటరమణ తండ్రి, శోక నాశకుడు ఇతడే తిరుమల రమణ - వేదాల ఘోషలతో వెంకటరమణ తండ్రి, మోసేటి పల్లకిపై తిరుమల రమణ - సర్వాంగ సుందరుడే వెంకటరమణ తండ్రి, సౌఖ్య ద్వారము నీవే తిరుమల రమణ
    పల్లవి! 17) అభీష్ట వరదాయ క వెంకటరమణ తండ్రి, కలియుగ దైవమురా తిరుమల రమణ - అన్నమయ్య కీర్తన లే వెంకటరమణ తండ్రి, ముద్దుగుమ్మ వేరు లయ తిరుమల రమణ - అట్టి సామ్రాజ్యమునే వెంకటరమణ తండ్రి, పాలించు వాడవయ్యా తిరుమల రమణ - ముత్యాల నవ్వులతో వెంకటరమణ తండ్రి, జీవకోటికి పోషణ చేస్తవి రమణ
    పల్లవి! 18) పచ్చని తోరణము వెంకటరమణ తండ్రి, నిత్య కళ్యాణము లే నిత్యము రమణ - శ్రీదేవి భూదేవితో వెంకటరమణ తండ్రి, కళ్యాణ మూర్తి వయా తిరుమల రమణ - భక్తి సాగర మందున్న వెంకటరమణ తండ్రి, ముక్తి కెరటము నీవే తిరుమల రమణ - నిను చూడ వచ్చేటి భక్తులు రమణ తండ్రి, గోవింద గోశలతో ముగ్దులు రమణ.... గోవింద...
    వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచే టి తిరుమల రమణ
    #god #tirumala #tirupati #govinda

Komentáře • 75