సంగమేశ్వర దేవాలయం | Sangameshwara Temple | Ancient Shiva Temple |Temples in Telangana.

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • సంగమేశ్వరాలయం :
    అలంపూర్‌కు ఈశాన్యంలో కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో కూడవెల్లి అను గ్రామం ఉండేది. ఇక్కడే సంగమేశ్వరాలయం ఉండేది. ఈ గ్రామం, ఆలయం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన ముంపుకు గురయ్యాయి. ఈ గ్రామంలోని ప్రజలు సమీప గ్రామాలలో పునరావాసాన్ని ఏర్పాటు చేసుకోగా, ఇక్కడి సంగమేశ్వరాలయాన్ని తరలించి అలంపూర్‌లో పునర్నిర్మించారు. గ్రామంలో జూనియర్ కళాశాలకు సమీపంలో ఈ ఆలయాన్ని పునఃనిర్మించారు. ఈ ఆలయ శిల్పసంపద ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం కూడా చాళుక్యుల నిర్మాణ శైలిలోనిదే. శివరాత్రి పర్వదినాన ఇక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విశాలమైన తోటలో ఆలయం అలరారుతుంది.

Komentáře • 6