Alishetti Prabhakar - Kavitaa Chitralu [2]: Dasari Nagabhushanam, IFS., Retd.

Sdílet
Vložit
  • čas přidán 15. 01. 2024
  • Alishetti Prabhakar - Kavitha Chitralu [2]: Dasari Nagabhushanam, IFS., Retd.
    : నా మాట :
    మిత్రుడు ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ పుట్టిన రోజూ వర్ధంతి ఒకే రోజు అంటే జనవరి 12 వ తేదీ కావడం అత్యంత అరుదైన సంఘటన. ప్రభాకర్ మరణించి మూడు దశాబ్దాలు దాటినా తెలుగు సాహిత్యాభిమానుల్లో ఆయన తను రాసిన కవితల రూపంలో ఇంకా సజీవంగా నిత్య నూతనంగా విరాజిల్లుతూనే ఉన్నాడు.
    సమాజంలోని దీన జనుల అవస్థలపై, మహిళల వేధింపులపై, కుళ్ళు రాజకీయాలపై, కునారిల్లిన విద్యా వ్యవస్థపై. పెత్తందారీ ఆగడాలపై ఇలా అనేక అంశాలపై తన భావజాలాన్ని అలతి సులభమైన పదాలతో సూటిగా, వాడిగా, ఘాటుగా, నిక్కచ్చిగా, ఏమాత్రం రాజీలేని తనదైన పంథాలో కవితల రూపంలో వ్యక్తపరచడం జరిగింది. అలాగే తన కవితలకు తానే స్వయంగా వేసుకున్న నలుపు తెలుపు రేఖా చిత్రాలను సునిశితంగా పరిశీలిస్తే చిత్రాల్లోని ప్రతి గీతలో ఆయన మనసులో దాగిన క్షోభ, అనితరమైన తపన, ఆర్తి వగైరాలు కవితాక్షరాల కంటే పదునుగా చూపరుల గుండె లోలోతుల్లోకి చొరబడి గుచ్చుకునేలా, హృదయాన్ని కదిలించే రీతిలో ఉద్విగ్నభరితంగా ఉంటాయి.
    ఈ కవితా చిత్రాలు గతంలో “అక్షర నక్షత్రమ్మీద” మరియు “అక్షర క్షిపణులు” అనే పుస్తకాల రూపంలో వచ్చాయి. ఆయన బ్రతికున్న రోజుల్లో ఈ చిత్రాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల మరియు ఇతర అనేక చోట్ల ప్రదర్శించిన సందర్భంలో విద్యార్థులు మరియు ఎంతోమంది ఈ ప్రదర్శనలను తిలకించి అభినందించడం జరిగింది. ప్రభాకర్ తన అభిమానులకు పెన్నిధిగా మిగిల్చిన ఈ చిత్రాలను నాకు తెలిసిన మాధ్యమంలో అందరికీ చేరువ చేసేందుకు మిత్రునిగా నేను చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని అందరూ సహృదయంతో ఆదరించి స్పందిస్తారని భావిస్తూ ధన్యవాదాలతో...
    - దాసరి నాగభూషణం,
    +91 80865 11200.

Komentáře •