!! ఉప్పు చింతపండు ఊరిలో నుండగా - మన వేమన వెలుగులు !!

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త. "విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. వేమన సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించాడు. వేమన కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. సి పి బ్రౌన్ చెప్పిన ప్రకారం ఇతను జంగమ కులానికి చెందిన శివకవి. ఇంకొక పరిశోధన ప్రకారం కడప మండలం లోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కులస్థులకు జన్మించారని అంటారు.
    బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించాడు. ఆటవెలదితో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చాడు.
    వేమన పద్యాలపై పరిశోధకుల్లో అగ్రగణ్యులు డాక్టర్ ఆచార్య ఎన్. గోపి.1980లో వెలువడిన ఆయన థీసెస్ ఆధారంగా చేసిన వ్యాఖ్యానమే ఈ వేమన వెలుగులు. ఆయన పడిన శ్రమకు ఉడతా భక్తిగా నా కంఠస్వరాన్ని జోడించి ఎప్పటికీ వన్నె తరగని వేమన పద్యాలను మన తెలుగు వారందరికీ తెలియజేయాలని చదివి వినిపిస్తున్నాను, విని ఆశీర్వదించండి. సి.ఎన్.బాబు

Komentáře •