కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి | Karma Siddhanta | Rajan PTSK

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • ఈరోజు మనం కర్మసిద్దాంతం అంటే ఏమిటో సంక్షిప్తంగా, తేలికైన మాటలలో చెప్పుకుందాం. సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా అనుకోని ఇబ్బంది కలిగినప్పుడు, లేదా కష్టం వచ్చినప్పుడు అంతా నా కర్మ అని తలకొట్టుకోవడం చూస్తూనే ఉంటాం. అసలు ఏమీటీ కర్మ? ఈ కర్మల గురించి చెప్పే కర్మసిద్ధాంతం అసలు స్వరూపం ఏమిటి? మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం. అయితే కర్మసిద్ధాంతం వేరు, కర్మయోగం వేరు. మనం చేసిన కర్మల తాలుకూ ఫలితం ఏవిధంగా నిక్షిప్తమై ఉంటుందో, ఆ కర్మఫలితాన్ని ఎలా అనుభవిస్తామో చెప్పేది కర్మసిద్ధాంతం. అసలు మానవుడు కర్మలు ఎందుకు చెయ్యాలో, ఏ విధంగా కర్మలు చేస్తే మనకు పాపపుణ్యాలు అంటవో చెప్పేది కర్మయోగం.
    కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
    మా కర్మఫలహేతుర్భూః మా తే సంగో2స్త్వకర్మణి
    అర్జునా! నీ కర్తవ్యాన్ని అనుసరించి కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉంది తప్ప, వాటి ఫలితాలపై మాత్రం నీకు ఎటువంటి అధికారం లేదు. అలా అని కర్మలు చెయ్యడం ఎప్పుడూ మానకూడదు. ఇదీ తనవారిపై యుద్ధం చేయనని కూర్చున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసినటువంటి బోధ. చేయాల్సిన కర్మపై కాకుండా కర్మఫలితంపై మాత్రమే దృష్టి పెడితే చిత్తశుద్ధితో ఆ కర్మను చేయలేం. అందుకే కర్మ ఫలితం గురించి ఆలోచించకుండా, “నా కర్తవ్యం కనుక ఈ పని చేస్తున్నాను” అని ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తే ఆ కర్మలకు తగ్గ ఫలితం తప్పకుండా లభించి తీరుతుంది. ఫైగా ఆ కర్మల పాపపుణ్యాలు కూడా చేసినవానికి అంటుకోవు. ఇది కర్మయోగానికి మూలసూత్రం వంటిది. ఈ కర్మయోగం గురించి మరింత విపులంగా రానున్న రోజుల్లో మనం చెప్పుకోబోయే “భగవద్గీత ఏ అధ్యాయంలో ఏముంది” అనే శీర్షికలో మాట్లాడుకుందాం. ఈరోజు మాత్రం కర్మసిద్ధాంతం అంటే ఏమిటో సంగ్రహంగా చెప్పుకుందాం.

Komentáře • 62

  • @commonman6304
    @commonman6304 Před 3 měsíci +18

    "అవస్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం"
    ".. జ్ఞానాగ్ని కర్మ దగ్ధ కర్మాణి.." అన్నారు..!!

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 3 měsíci +17

    ముక్తి..మోక్షం..కైవల్యం..నిర్వాణం.!🏵️
    మరు జన్మ అనేది లేకుండా ముక్తి కావాలంటే..ముఖ్యంగా ముగించవలసినది..మోయలేక మోస్తున్న మూడు కర్మల మూట - సంచిత..ప్రారబ్ద..ఆగామి.!
    అద్వైత జ్ఞానంతో సంచితాన్ని దగ్ధం చేసి..సర్వదా,వివేకంతో
    ఆగామిని అదుపులో పెడుతూ,విడిచి పెట్టిన బాణం లాంటి
    ప్రారబ్ధకర్మ ఫలాన్ని పరిపూర్ణంగా స్వీకరించి.. జీవన్ముక్తునిగా
    జీవిస్తే ఏ మనిషికైనా,ఆ జన్మలోనే ముక్తి సాధ్యం.!
    🙏🙏🙏🙏🙏

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Před 3 měsíci

      నమస్కారం సర్.అద్వైత జ్ఞానం అంటే ఏమిటో వివరించమని మనవి.ఆ జ్ఞానంతో సంచిత కర్మల్ని ఏ విధంగా దగ్ధం చేయాలి? ఆగామి కర్మల్ని అదుపులో ఉంచడం ఎలా? ప్రారబ్ద కర్మల ఫలాలు ఏమిటి? కొంచెం టూకీగా వివరించమని మనవి

    • @kodurivenkatasubbarao5082
      @kodurivenkatasubbarao5082 Před 2 měsíci +1

      చక్కగా చెప్పారు అండి

    • @commonman6304
      @commonman6304 Před 13 dny

      🙏🙏🙏🙏🙏

  • @commonman6304
    @commonman6304 Před 13 dny +1

    🙏🙏🙏🙏🙏

  • @mahanth9
    @mahanth9 Před 3 měsíci +2

    చాలా విపులంగా కర్మ సిద్ధాంతం గురించి వివరించారు 🙏

  • @vvvmk1718
    @vvvmk1718 Před 3 měsíci +1

    ఈ సంసారం నుండి విముక్తి ఎప్పుడో🙏🙏🙏

  • @lakshmiksvrs306
    @lakshmiksvrs306 Před 3 měsíci +1

    Thankyou SRI RAMA RAKSHA 🙏🙏

  • @vamshikrishnamarupak
    @vamshikrishnamarupak Před 3 měsíci +2

    ❤🎉 motham chusamu

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 Před 3 měsíci +3

    బాగా చెప్పారు

  • @sriramaraksha83
    @sriramaraksha83 Před 3 měsíci +2

    Super thanku

  • @bisagonigangadhar8842
    @bisagonigangadhar8842 Před 3 měsíci +2

    చాలా బాగా చెప్పారు 💐💐💐🙏🙏🙏🙏🙏

  • @chakri7706
    @chakri7706 Před 3 měsíci +1

    Vasudeva 🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 3 měsíci

    👌👍👏🙌🤝భారతీయ తత్వము బ్రతకటానికి, బ్రతికించటానికి, శారీరక, మానసిక, ఆరోగ్యాలు, ఆత్మా నం దము పొందే పద్ధతుల సమ్మేళనమేకదా…

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 Před 2 měsíci

    805❤️like🎉
    నా లాంటి పామరులకు కూడా అర్థమయ్యే లాగా.... చెప్పారు..🙏

  • @satyagun1
    @satyagun1 Před 2 měsíci

    చాలా చక్కగా వివరించి చెప్పారు!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు

  • @nvsrkprasad
    @nvsrkprasad Před 3 měsíci +1

    చాలాబాగా చెప్పారు

  • @kalyanappikatla8737
    @kalyanappikatla8737 Před 3 měsíci +1

    Kamala gurinchi chala Baga chepparu guruvu garu

  • @dinakartirumalla8033
    @dinakartirumalla8033 Před 3 měsíci +1

    బాగుంది 😊

  • @narasimharaomvl4413
    @narasimharaomvl4413 Před 3 měsíci +1

    Bavundi sir ❤

  • @cradisudharshan7280
    @cradisudharshan7280 Před 3 měsíci +1

    Superb

  • @SameerDharmasastha
    @SameerDharmasastha Před 3 měsíci +1

    బావుంది 😊

  • @shreeperi3105
    @shreeperi3105 Před 3 měsíci +1

    Chaala baavundhi

  • @drtnrao57
    @drtnrao57 Před 3 měsíci +1

    Good video thanks.

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 Před 3 měsíci +1

    😊🤗👏🏻👏🏻👏🏻

  • @KrishnaKumar-sn5qp
    @KrishnaKumar-sn5qp Před 3 měsíci

    Excellent explanation guruvu garu ........namaskaramulu.

  • @sivag5041
    @sivag5041 Před 3 měsíci

    Explained very well Sir... thank you

  • @kvr8137
    @kvr8137 Před 3 měsíci +1

    నమస్తే

  • @user-xq8ur3kh7p
    @user-xq8ur3kh7p Před 3 měsíci

    చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 Před 3 měsíci +1

    🌹🙏🌹 namaste sir

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn Před 3 měsíci

    Thank you babu. Maaku veelainatha sahayam chestamu.

  • @asamardhudu8921
    @asamardhudu8921 Před 3 měsíci +1

  • @bheempavani9261
    @bheempavani9261 Před 3 měsíci +1

    🙏🙏

  • @user-mr3nn7nm4s
    @user-mr3nn7nm4s Před 3 měsíci

    Sir miru chappy vidanam bagundi

  • @chandrikaprabhakar4536
    @chandrikaprabhakar4536 Před 2 měsíci

    Kruthagnathalu Sir

  • @kkmurthy
    @kkmurthy Před 2 měsíci

    Please add with examples

  • @user-uj3gk3px5r
    @user-uj3gk3px5r Před 3 měsíci +1

    🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 Před 3 měsíci +3

    గురువుగారూ ఇప్పటికి (60 ఏళ్ళు ) ఎలా నడవాలో ఎలా ఉండాలో సద్గురు బోధనలతో అర్దము అయినది కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు సహకారం లేదు ఏజన్మ పాపమో ..........

    • @vvvmk1718
      @vvvmk1718 Před 3 měsíci

      భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకోండి… అన్నీ ఆయనే అయి మనల్ని నడిపిస్తాడు.🙏🙏🙏

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Před 3 měsíci

    🙏

  • @padmavathiallaka2245
    @padmavathiallaka2245 Před 3 měsíci

    👌👌🙏🙏

  • @veera222
    @veera222 Před 3 měsíci

    🙏🚩🇮🇳

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 Před 3 měsíci

    Cow feeding, service is best solution to many problems

  • @Hanu-kt5bs
    @Hanu-kt5bs Před 2 měsíci +2

    జనన మరణ చక్రం నుండి బయట పడడమే మన గమ్యం

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Před 3 měsíci +2

    జీవులందరూ మోక్షానికి వెళుతూ ఉంటే కొన్ని కోట్ల కోట్ల కల్పముల తర్వాత భూమి మీద పుట్టే జీవుల సంఖ్య తగ్గిపోతుంది కద

    • @upparamanju2506
      @upparamanju2506 Před 3 měsíci

      అనంతమైన ఆత్మలు ఉన్నాయి
      అవన్నీ ముక్తి పొందాలి అంటే
      శాస్త్రం ప్రకారం లెక్కలు సరిపోవు అంటే అన్ని ఆత్మలు ఉన్నాయి అన్నమాట

  • @NaveenKumar-cx4dl
    @NaveenKumar-cx4dl Před 3 měsíci

    అన్నగారు, రామాయణం మహాభారతం సులభంగా చదవాలంటే ఏ ఏ పుస్తకాలు చదవాలి. వాటిలో ఎన్ని రకాలు వున్నాయి. కాస్త reply ఇవ్వగలరు.ప్లీజ్❤❤

  • @konayadagiri
    @konayadagiri Před 3 měsíci +1

    Athma Namaste🙏

  • @ncvenugopal8742
    @ncvenugopal8742 Před 3 měsíci +1

    One doubt guruvu garu. How do we know about previous janma and know about karma

  • @DKD183
    @DKD183 Před 3 měsíci

    prarabhdha karma ante..gatha jsnmallo pogupadina karma samastham annaru kada...mari gnanam chetha sanchitha karmalanni dagdham chesukonna yogulaku prarabdha karma yela vachhindi marippudu anubhavinchadaniki....yendukate merega annaru sanchitha karmanu ee janmalo anubhavinchadame prarabdhakarma ani... inkonchem clarity kaavali ikkada

  • @rsreedhar2332
    @rsreedhar2332 Před 3 měsíci +1

    బౌద్ధం గురుంచి చెప్పండి

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 Před 3 měsíci +1

    కర్మ ముందా జన్మ ముందా
    వివరించగలరు

    • @vvvmk1718
      @vvvmk1718 Před 3 měsíci

      దీనికి సమాధానంలేదు.

    • @pavannaidu1613
      @pavannaidu1613 Před 2 měsíci

      Exact question adigav brother naku same doubt

    • @Hanu-kt5bs
      @Hanu-kt5bs Před 2 měsíci

      కర్మ అంటే నువ్వు చేసే క్రియ.
      కర్మ అంటే చేసేది చేసేదాన్ని కర్మ అంటారు
      జన్మ అంటే పుట్టుక పుట్టుక అనేది నీ చేతిలో లేదు
      కర్మ నీ చేతిలో ఉంటుంది
      పుడితేనే కదా కర్మ చేసేది
      జన్మింస్తేనే కాదా కర్మలు చేసేది
      జన్మ లేకుంటే కర్మలు లేవు

  • @bhavani3142
    @bhavani3142 Před 3 měsíci +1

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 Před 3 měsíci

    🙏🙏

  • @sambasivaraosamarla4889
    @sambasivaraosamarla4889 Před 3 měsíci +1

    🙏🙏🙏