goreti venkanna - vaana paata- karaoke

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • vanocchenammo vardaocchenammo
    గోరేటి వెంకన్న గారి పాట
    వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా
    వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2
    ఎఱ్రభూములనెఱలన్నీ పూడ్సినాది2
    రేగాడినేలాను మాగాణి చేసింది తొవ్వగడ్డాలల్లో కవ్వాతు చేసింది2
    సౌడు భూములు తాకి దౌడుతీసినాది
    పొంగేటి కల్లులో పోసింది సన్నీళ్ళు
    ఈతా సెట్టు లొట్టి మూతిని కడిగింది
    వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా
    వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2
    కొట్టం పై రాలిన మట్టంతా కడిగింది
    కోడి పుంజు జుట్టు కొంటెగా తాకింది
    చెట్ల కురులా మీద బొట్లులా రాలింది
    గట్ల కొండల మీద గంధమై పారింది దున్నపోతులనేమోదున్కులాడించిందీ
    బర్ల మందనేమో చెర్లల్ల ముంచింది !!
    వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా
    వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2
    "గద్దగూటిలోని గడ్డిని తడిపింది గువ్వగూటి గులకరాళ్లను జరిపింది తీతువగొంతును తియ్యగజేసింది పరికిపిట్ట ముక్కు పాసిని కడిగింది ఎద్దు మూపురాన్ని ముద్దాడి మురిసింది ముల్లుగర్ర వొల్లు సల్లగ జేసింది”
    వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా
    వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2
    కొత్త నీటితో వచ్చి కోనేట్ల చేరింది.
    పచ్చటి నాసూని పగలచీరేసింది
    చేపకేమో నీటి పులుపునీ తాపింది కొంగకేమో విందు కోరిక రేపింది.
    కప్పల పండగ కండ్లార చూసింది.
    తాబేలు పెండ్లికి తల నీరు పోసింది !!
    వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2
    పారాడి పారాడి గోదారిలో కలిసి
    సీతమ్మ పాదాలు శిరసొంచి తాకింది వంకలూడొంకలు వనమూలెల్లా తిరిగి కృష్ణమ్మ ఒడిలోన ఇష్టంగ ఒదిగింది
    దుందుపీతలకంటి దుమ్మంతా కడిగింది
    అందమైనిసుకను అద్దంలా చేసింది
    ఇష్టముందోలేదొ పట్నానికొచ్చింది.
    ముక్కు మూసుకొని మూసీల మునిగింది
    వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా
    వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2
  • Zábava

Komentáře •