ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది worship song by Raj prakash Paul 🙏🏽 GODS LOVE IS GREAT 🙌🏼

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • పల్లవి : ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది
    అతి శ్రేష్టమైనది - అంతమే లేనిది
    అవధులే లేనిది - అక్షయమైన ప్రేమ ఇది
    కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది
    1. సింహాసనము నుండి - సిలువకు దిగి వచ్చినది
    బలమైనది మరణము కన్నా - మృతి ని గెల్చి లేచినది
    ఇది సజీవమైనది - ఇదే సత్యమైనది
    ఇదే నిత్యమైనది - క్రీస్తు యేసు ప్రేమ ఇది
    కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది
    2. నా స్థాన మందు నిలిచి - నా శిక్ష నే బరియించి
    క్రయ ధనమును చెల్లించి - గొప్ప రక్షణ నిచ్చినది
    నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది
    ఆ ఉన్నత రాజ్య మందు - నాకు స్థాన మిచ్చినది
    ఉన్నత ప్రేమ ఇది - అత్యున్నత ప్రేమ ఇది
    3. భూ రాజులు అధిపతులు - రాజ్యాలు అధికారాలు
    చేరయైన ఖడ్గమైన - కరువైన ఎదురైనా
    ఎవరు ఆర్పలేనిది - ఎవరు ఆపలేనిది
    ప్రవహించుచున్నది - ప్రతి పాపి చెంతకు
    ప్రేమ ప్రవాహమిది - యేసు ప్రేమ ప్రవాహమిది

Komentáře • 8