ఉజ్జయిని మహాకాళ జ్యోతిర్లింగ రహస్యం | The mysterious origin story of Mahakaleswar Jyotirlingam | DDT

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • ఉజ్జయిని మహాకాళ జ్యోతిర్లింగ రహస్యం | The mysterious origin story of Mahakaleswar Jyotirlingam | DDT
    Chapters:
    0:00 Intro
    0:34 Main Story
    2:21 Temple History
    2:58 Temple Architecture
    Story: ద్వాదశజ్యోతిర్లింగాలలో మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగము. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో వుంది ఈ ప్రసిద్ధ శైవ క్షేత్రం... ఈ దేవాలయం రుద్రసాగరం అనే సరస్సు సమీపంలో ఉంటుంది. ఇతర శైవ క్షేత్రాలలా కాకుండా ఇక్కడ శివలింగం మంత్రశక్తులతో ఏర్పడిందని భావిస్తారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు భస్మాలతో ఆరతి ఇస్తారు. ఈ జ్యోతిర్లింగం ఎలా ఏర్పడిందనే చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.
    పూర్వకాలంలో ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు ఉండేది. ఇది ఏడు పుణ్య నగరాలలో ఒకటి. ఉజ్జయిని నగరం ఎంతో అందంగా నిర్మించబడింది అని చెప్తారు. ఇది ప్రాచీన భారతదేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. ఉజ్జయనిని చంద్రసేన అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పెద్ద శివ భక్తుడు. ఒకనాడు శ్రికరుడు అనే రైతు బిడ్డ రాజభవనం యొక్క మైదానంలో నడుచుకుంటూ వెళ్తుండగా రాజుగారు శివ నామస్మరణ చేయడం విన్నాడు. ఆ ఓంకారనాదం విని ఉప్పొంగిపోయిన శ్రికరుడు రాజుగారితో కలిసి శివుడి గురించి ప్రార్థనచేయడానికి ఆలయం వైపు పరిగెడుతూ వెళ్ళాడు. అప్పుడు రాజభటులు అతనిని అడ్డగించి ఊరినుంచి వెలివేసి ఊరిబయట వున్నా క్షిప్రా నది దగ్గరకి పంపిస్తారు...
    ఉజ్జయిని పక్కన రాజ్యాలకి రిపుదామనుడు మరియు సింఘాదిత్యుడు అనే రాజులూ ఉండేవారు. వీరు ఇరువురు దూషణుడు అనే రాక్షస రాజుతో కలిసి ఉజ్జయిని పై దండయాత్ర చేయడానికి పన్నాగం వేశారు. దూషణుడికి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యే శక్తిని ఇచ్చాడు. పథకం ప్రకారం వీరు ఉజ్జయిని నగరంపై దాడిచేసి ప్రజలని హింసించడం మొదలుపెట్టారు. ఎవ్వరిని పూజాపునస్కారాలు చేయకుండా అడ్డుకున్నారు...
    ఈ విషయం తెలుసుకున్న శ్రికరుడు వ్రిద్ధిమానుడు అనే సాధువుతో కలిసి క్షిప్రా నది ఒడ్డున శివుడిని ప్రార్ధించడం మొదలుపెట్టారు. శ్రీకరుడు నదిలోని నల్ల మట్టితో ఒడ్డున ఒక శివలింగాన్ని మలచి ప్రార్ధన చేసాడు. వీరిని చూసి ఉజ్జయిని నగరంలోని ప్రజలందరూ శివుడికి పూజలు చేసారు. అప్పుడు ఆ మహా శివుడు భూమిని చీల్చుకొని మహాకాళ రూపంలో ఉద్భవించి దూషణుడిని, తన సైన్యాన్ని భస్మం చేసాడు. ఆక్రమణదారులను ఓడించి ఉజ్జయిని నగరాన్ని రక్షించాడు. అప్పుడు ప్రజలందరూ ఆ పరమేశ్వరుడిని ఎల్లపుడు తమతోనే ఉండమని కోరుకున్నారు. వారి భక్తికి మెచ్చిన శివుడు ఉజ్జయినిలో
    మహాకాళ జ్యోతిర్లింగంగా వెలిసాడు. ఆ తరువాత స్వయంగా భ్రమ్మదేవుడే ఆ జ్యోతిర్లింగానికి ఆలయాన్ని నిర్మించాడు అని చెప్తారు.
    ఆలయ చరిత్ర
    మహాకాళేశ్వర ఆలయాన్ని అనేకసార్లు చొరబాటుదారులు ధ్వంసం చేసారు. పదమూడవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాను ఇల్తుత్మిష్ దాడి చేసి ధ్వంసం చేసాడు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సమూలంగా పెకలించివేసి దగ్గర్లో వున్న ఒక కుంటలోపడేసారు అని చరిత్రకారులు చెప్తారు. ఆలయంలోని ఎన్నో నిధులను ప్రాముఖ్యమైన వస్తువులను దొంగలించారు. ఈ ఆలయాన్ని మరాఠా రాజు రానోజి సింధియా మరియు రామచంద్ర బాబా కలిసి పద్యేనిమిదో శతాబ్దంలో పునర్నిర్మించారు. జ్యోతిర్లింగాన్ని పడేసిన కుంట కోటి తీర్థంగా ప్రాముఖ్యత పొందింది. మహాకాళేశ్వర ఆలయం శివ భక్తుల అపారమైన విశ్వాసానికి చిహ్నం.
    ఆలయ నిర్మాణశైలి
    మహాకాళేశ్వర ఆలయం మరాఠా, చాళుక్య మరియు భూమిజా నిర్మాణశైలుల కలయికగా ఉంటుంది. మూడు అంతస్థులలో వుండే ఈ ఆలయంలో ఒక్కో అంతస్థులో ఒక్కో శివలింగం ఉంటుంది. మొదటి అంతస్థులో మహాకాళ జ్యోతిర్లింగం ఉంటుంది. ఈ లింగాన్ని దక్షిణాముఖి అంటారు. లింగానికి దక్షిణం వైపున స్వామివారి ముఖం ఉంటుంది కావున ఇలా పిలుస్తారు. ఈ ప్రత్యేక లక్షణం కారణంగా ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్ధించే విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు లింగానికి భస్మహారతి ఇస్తారు. మీరు మహాకాళేశ్వర ఆలయానికి వెళ్తే ఈ ఘట్టం తప్పక చూడండి.
    రెండవ అంతస్థులో ఓంకారేశ్వర లింగం వుంది. ఈ ఆలయంలో ఉత్తరం దిక్కున పార్వతి దేవి, పశ్చిమాన గణేశుడు, తూర్పున కార్తికేయుడు, మరియు దక్షిణాన నందీశ్వరునివి వెండితో చేసిన విగ్రహాలు ఉంటాయి.
    మూడవ అంతస్థులో నాగచంద్రేశ్వర లింగం వుంది. కేవలం నాగులపంచమి రోజున మాత్రమే భక్తులకు ఈ లింగ దర్శనానికి అనుమతి ఉంటుంది.
    We used a small clip from this CC licensed video • भस्मआरती दर्शन 02 01 2...

Komentáře • 3