సోమనాథ్ ఆలయం విశిష్టత | Origin of Somnath temple in telugu | Somnath Temple Mystery Dharma Dharshan

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024
  • సోమనాథ్ ఆలయం విశిష్టత | Origin of Somnath temple mystery in telugu. Somnath Temple Mystery | Dharma Dharshan Telugu
    Chapters:
    0:00 Intro
    0:23 Main Story
    2:27 Temple destruction and reconstruction
    Story: పురాణాల ప్రకారం పరమేశ్వరుని యొక్క జ్యోతిర్లింగాలు పన్నెండు వున్నాయి. అందులో మొదటిది గుజరాత్ లోని ప్రభాస తీర్థం సమీపంలో వున్న సోమనాథ్ ఆలయం. ఈ ఆలయం విశిష్టత ఏమిటి, దీనిని ఎవరు నిర్మించారు అనే చరిత్ర ఈ వీడియో లో తెలుసుకుందాం.
    దయచేసి ఈ వీడియో ని like చేసి, channel కి subscribe చేసుకొని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి.
    ద్వాదశ జ్యోతిర్లింగాలకి మన పురాణాలలో చాలా ప్రాముఖ్యత వుంది. ఈ పన్నెండు క్షేత్రాలలో శివుడు స్వయంభుగా వెలిసాడు అని చెప్తారు. చరిత్ర ప్రకారం చంద్ర భగవానుడికి దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కూతుర్లతో వివాహం జరిగింది. కానీ చంద్రుడు మాత్రం రోహిణితో మాత్రమే సన్నిహితంగావుంటూ ఎక్కువ సమయం తనతోనే గడిపేవాడు. మిగిలిన 26 మంది భార్యలను నిర్లక్ష్యం చేసాడు. అప్పుడు వారందరు వెళ్లి దక్షుడికి తమ బాధను వివరిస్తారు. విషయం తెలుసుకున్న దక్షుకు ఆగ్రహానికి లోనయ్యి చంద్రుడిని తన వెలుగుని కోల్పోతావ్ అని శపిస్తాడు. దీనితో చంద్రుడు ప్రకాశాన్ని కోల్పోతూ చివరకి ఒకరోజు పూర్తిగా ఆకాశం నుంచి మాయమవుతాడు. అలా మాయమైన చంద్రుడికి బ్రహ్మదేవుడు ప్రభాస తీర్థం చేరుకొని శివుని గురించి తపస్సు చేయమని సలహా ఇస్తాడు. అప్పుడు చంద్రుడు బ్రహ్మ సూచన మేరకు ప్రభాస తీర్థం చేరుకొని శివుణ్ణి వేడుకొంటాడు. తనకి తగిలిన ఈ శాపాన్ని నివారించుకోవడానికి చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి కఠినమైన తపస్సు చేసాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై భార్యలందరిని సమానంగా చూసుకోమని చంద్రుడికి సలహా ఇచ్చాడు. చంద్రుడిని శివుడు తన తలమీద ధరించి వెలుగుని మళ్ళి పొందేలాగా చేసి శాపాన్ని ఉపసంహరించాడు. నీవు ప్రతిష్టించిన ఈ శివలింగంలో నేను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాటిచ్చాడు.
    ఆ శివలింగం ప్రతిష్టించబడిన ప్రదేశంలో ఆలయాన్ని రకరకాలుగా నిర్మించినట్లు పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది. ఇంద్రుడు బంగారంతో సోమనాథ్ ఆలయాన్ని నిర్మించాడు. త్రేతాయుగంలో రావణాసురుడు వెండితో నిర్మించాడు అని, ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు గంధపు చెక్కలతో నిర్మించాడు అని చెప్తారు. మొదటి జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్ ఆలయానికి ప్రాణప్రతిష్ట పదవ త్రేతాయుగం సమయంలో శ్రావణమాసంలో జరిగిందని స్కందపురాణంలో పేర్కొన్నారు. ఈ ఆలయంలో వేదాలూ మరియు పురాణ ఇతిహాసాలు దర్శనమిస్తాయి. ప్రాచీన ఆలయమైన ఈ గుడిలో అనేక పురాణగాధలు కళ్లకుకడతాయి. భాగవతం, స్కంద పురాణం, శివపురాణం వంటి గ్రంధాల ఆనవాళ్లు ఈ ఆలయంలో కనిపిస్తాయి.
    గత వెయ్యి సంవత్సరాలలో ఈ ఆలయాన్ని చొరబాటుదారులు చాలాసార్లు ధ్వంసంచేశారు. ఆలయంలోని నిధుల్ని దోచుకెళ్లారు. అయితే ఎన్నిసార్లు కూలగొట్టినా హిందువులు మళ్ళి ఈ ఆలయాన్ని అక్కడే అనేకసార్లు నిర్మించారు. వెయ్యి ఇరవైనాలుగవ సంవత్సరంలో ఘజని మొహమ్మద్ అనే చొరబాటుదారుడు థార్ ఎడారి గుండా ఈ ఆలయాన్ని చేరుకొని తన దండయాత్రలో భాగంగా సోమనాథ్ ఆలయాన్ని మొదటిసారిగా ధ్వంసంచేశారు అని చరిత్రకారులు పేర్కొన్నారు. ఆలయాన్ని తిరిగి ఒకవెయ్యి ఇరవైఆరవ సంవత్సరం నుంచి ఒకవెయ్యి నలభైరెండవ సంవత్సరాల మధ్యలో మాల్వా రాజైన భోజి మరియు సోలంకి రాజైన భీమదేవులు పునర్నిర్మించారు. పదమూడవ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం సోమనాథ్ ఆలయంపై మళ్ళి దాడిచేశారు. పదిహేడువందల ఒక్కటో సంవత్సరంలో ఔరంగజేబు దాడిచేసి ఆలయాన్ని ధ్వంసంచేశాడు. చివరిసారిగా ఈ ఆలయాన్ని పంతొమ్మిదొందల నలభైయేడులో సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్శించి శిధిలావస్థలో వున్న ఈ ఆలయాన్ని మల్లి నిర్మించాలని నిర్ణయించారు. పటేల్ గారి మరణం తరువాత ఈ ఆలయం నిర్మాణం భారతదేశ ప్రభుత్వం చొరవతో చాళుక్యుల నిర్మాణశైలిలో పంతొమ్మిదొందల యాభైఒకటిలో పూర్తయింది.
    సోమనాథ్ పుణ్యక్షేత్రం వున్న ప్రభాస తీర్థంలో కపిల, హిరానీ మరియు సరస్వతి నదుల కలయికతో త్రివేణి సంగమం ఏర్పడింది. కపిల మరియు హిరానీ నదుల సంగమం మనకి కనపడుతుంది కానీ సరస్వతి నది కంటికి కనిపించదు. సరస్వతి నది ప్రత్యేకత తెలుసుకోవాలంటే description లో వున్న రెండవ వీడియో చూడండి.
    somnath temple mystery,secrets of somnath temple,somnath temple history in telugu,who built somnath temple,12 jrotirlingalu,unknown facts about siva lingam revealed in telugu,unknown facts about somnath temple,somnath temple,unknown facts about somanath temple in telugu,somanath temple facts,Somnath jyotirlinga,somnath jyotirlinga temple,story of somnath temple,somanath temple story in telugu,somnath temple mystery telugu,indian temples,hindu temples

Komentáře •