Latest Telugu Christan songs with Lyrics ||Randi Randi Yesuni yoddaku|| Andrakristava keertanalu||

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Latest Telugu Christan songs with Lyrics||Randi Randi Yesuni yoddaku || Andrakristava keertanalu||
    song lyrics
    రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
    ప్రయాసపడి భారము మోయువారలు
    ప్రభుని చెంతకు పరుగిడి వేగమే
    1.యేసుని పిలుపు వినియు నింక - యోచింపరేల
    అవనిలో అగచాట్ల పాలైన
    అబ్బదు శాంతి ఆత్మకు నిలలో ||రండి||
    2.కరువు రణము మరణము చూచి - కలుగదు మారుమనస్సు
    ప్రవచనములు సంపూర్ణములాయెను
    యూదులు తిరిగి వచ్చుచున్నారు ||రండి||
    3.ప్రభు యేసు నీ కొరకై తనదు - ప్రాణము నిచ్చె గదా
    సిలువను రక్తము చిందించియును
    బలియాయెను యా ఘనుడు మనకై ||రండి||
    4.యేసుని నామమునందె పరమ - నివాసము దొరకును
    ముక్తిని పాప విమోచనమును
    శక్తిమంతుడు యేసే యిచ్చును ||రండి||
    5.నేనే మార్గము నేనే సత్యము - నేనే జీవమును
    నేను గాకింకెవరు లేరని
    యెంచి చెప్పిన యేసుని వద్దకు ||రండి||
    please like share and subscribe
    our channel

Komentáře • 24