శివ నామమే నా గానము (telugu lyrics) పర్థీపురం భజన బృందం Budda reddy palle Bajana potilu 2023 songs

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • ఇలాంటి పాటల కోసం WhatsApp group లో చేరండి :- 👇
    chat.whatsapp....
    నీలాంబరి రాగం : ఆది తాళము
    సాకి :- శిరమున గంగను మోయుచు
    కరమున ఢమరుకము దాల్చి కడు భీకరమౌ
    యురగము మెడలో నాడగ
    పరికింతువు భక్త జనుల మానస తలపుల్.
    పల్లవి :- శివ నామమే నా గానము,
    ఓంకారమే నా ప్రాణము
    అను పల్లవి:- శంభో శంకర,
    సాంబ సదాశివ, కైలాస వాస, గిరిజా రమణా.
    చరణం :- పరిపరి విధముల హరహర యంటిని
    పరమాత్ముడవని ప్రార్ధించితిని
    నిరతము నిన్నే కీర్తించితిని
    నటన మనోహర నమశ్శివాయ. ౹౹శివ౹౹
    చరణం :- నీ గుణ గానము చేసెదమయ్యా
    సరిగమ పదనిస స్వరములు పలుకగ
    భరత నాట్య విన్యాసము చూపిన
    భయ నాశంకర భవహర శంకర. ౹౹శివ౹౹
    చరణం :- నీ గళమందున గరళము నింపి
    ప్రళయమునాపిన ప్రణవ మూర్తివే
    భజనలు చేసే భక్త జనావళిని
    బ్రోవగ రావా గావగ లేవా. ౹౹శివ౹౹
    చరణం :- నంది వాహనా! నాగాభరణా!
    పార్వతి రమణా! పన్నగ భూషణ!
    ఫాల విలోచన! పాప విమోచన!
    పరమ దయాకర పాహి ప్రసన్నా! ౹౹శివ౹౹

Komentáře • 8

  • @JeevanKumar-go1gi
    @JeevanKumar-go1gi Před 2 měsíci

    Super

  • @maheshkuruva4824
    @maheshkuruva4824 Před měsícem

    Om namashivaya

  • @yadagiriu1358
    @yadagiriu1358 Před 5 měsíci

    👌

  • @YajnaNarayanaSarmaBhagavatar

    శివ నామమే నా గానము.... ఓంకారమే నా ప్రాణము ...
    పరిపరి విధముల హరహర యంటిని నీలకంఠ నను బ్రోవగారావా!! నీలాంబరిలో నాట్యము చేసే
    నయన మనోహర....
    నమశ్శివాయ...
    //శివ నామమే//
    నీ గుణగానము చేసెదమయ్యా సరిగమపదయని స్వరములే పలుక భరతనాట్య విన్యాసము చూపిన నయన మనోహర నమో నటరాజ
    //శివ నామమే//
    నీ గళమందున గరళము నింపి ప్రళయమునాపిన.. ప్రణయమూర్తివే భజనలు చేసే " భక్త జయంతిని " నిజముగా బ్రోచే గజముఖ జనక
    //శివ నామమే//
    ఇంతేనండీ బాబూ కీర్తన....గ్రహించగలరు...

  • @tvt952
    @tvt952 Před 8 měsíci +1

    This song is very melodious. My hearty pranam to the Harmonist as well as the tabala player includimg all the singers also. Very sweet. Please mention the phone No. of the harmonist so that I can talk with him please..
    .

  • @sogalachandrayya7832
    @sogalachandrayya7832 Před 4 měsíci

    Nilambari ragam

  • @Ravitejamassmaharaja975
    @Ravitejamassmaharaja975 Před 6 měsíci

    Nice song

  • @YajnaNarayanaSarmaBhagavatar

    అయ్యా
    మాది అమలాపురం...నాపేరు బ్రహ్మశ్రీ యజ్ఞనారాయణ శర్మ భాగవతార్...ఈ..కీర్తన మా గురువుగారైన బ్రహ్మశ్రీ జయంతి విశ్వనాథం గారు 1986 సం.రంలో రచించగా నీలాంబరి రాగంలో మేమే దీనిని ట్యూన్ చేసాము..ఈయనకి "జయంతి" గారు అని పెద్ద పేరు...మంచి బుర్రకథకులు...మంచి హార్మోనిష్ట్ కూడా...అయితే ఈ లిరిక్స్ లో ఎవరో అనుపల్లవి అని పెట్టారు...గాని అది వారు వ్రాయలేదు...ఆయన మూడు చరణాలు మాత్రమే వ్రాసారు...కానీ ఇందులో నాల్గవ చరణం కూడా పెట్టారు...ఈ నాల్గవ చరణంకూడా ఆయన వ్రాయలేదు...
    పరి పరి విధముల...
    నీగుణ గానము
    నీగళమందున...ఈ మూడే వారు వ్రాసారు...
    కీర్తనకి చివర రచయిత పేరుంటుంది...దీనిని అంకితం చేయుట అంటారు...ఓ రామదాసు గారివో...త్యాగరాజుగారివో కీర్తనలు మీరు చూడండి..
    అలాగే మా గురువుగారు కూడా "భక్త జయంతి" అని చాలా...చాలా...కీర్తనలు వ్రాసారు...ఇక్కడ
    "భజనలు చేసే భక్త జయంతిని.." అని మనందరం పాడుకోవాలి...అది భక్త జనావళిగా మార్చేసారు...నాకు చాలా బాధ కలిగింది...ఎంతో కష్టపడి ఆయన సాహిత్యంను ఏర్చి...కూర్చి...పేర్చి..తే...
    కావున మీరందరూ దయతో ఈ సాహిత్యాన్ని సవరించి పాడుకోవలసినదిగా కోరుతూ...బ్రహ్మ శ్రీ జయంతి గారి శిష్యుడు
    యజ్ఞనారాయణ శర్మ భాగవతార్...
    నా సెల్ 98494 35296...
    Hyderadbad