మిక్స్డ్ వెజ్ పచ్చడి | Mixed Vegetable Pickle Recipe | Veg Pickle | Mixed Pickle Recipe

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • మిక్స్డ్ వెజ్ పచ్చడి | Mixed Vegetable Pickle Recipe | Veg Pickle | Mixed Pickle Recipe
    ‪@HomeCookingTelugu‬
    మిక్స్డ్ వెజ్ పచ్చడిని మీకు నచ్చిన కూరగాయలన్నిటినీ వేసి తయారుచేసుకోవచ్చు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వీడియోలో మేము చూపించింది ఇన్స్టెంట్ పచ్చడి. ఇది సాధారణంగా బయట ఉంచితే మూడు-నాలుగు రోజుల వరకూ నిలవుంటుంది. ఫ్రిడ్జ్లో ఉంచితే, ఇంకా ఎక్కువ కాలం నిలవుంటుంది. తప్పకుండా ఈ పచ్చడిని తయారుచేసుకుని ఆస్వాదించండి.
    #mixedvegpickle #homecookingtelugu #mixedvegpachadi #homecooking #hemasubramanian #picklesintelugu
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    Here's the link to this recipe in English: bit.ly/2AmEKR8
    తయారుచేయడానికి: 30 నిమిషాలు
    వండటానికి: 15 నిమిషాలు
    సెర్వింగులు: 15 - 20
    కావలసిన పదార్థాలు:
    ఆవాలు - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/2GUoDKd)
    మెంతులు - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/2Sh0x1P)
    క్యాలీఫ్లవర్
    క్యారెట్
    మగ్గించిన నిమ్మకాయ ముక్కలు
    పచ్చిమామిడికాయ
    పచ్చిమిరపకాయలు - 2
    వెల్లుల్లి రెబ్బలు
    తరిగిన అల్లం
    ఉప్పు - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/2vg124l)
    ఎండుకారం - 3 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/3b4yHyg)
    మెంతిపిండి - 2 టీస్పూన్లు (Buy: amzn.to/2P11474)
    ఆవపిండి - 2 టీస్పూన్లు
    రెండు నిమ్మకాయల రసం
    నూనె - 2 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/2RGYvrw)
    ఆవాలు - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/2GUoDKd)
    ఎండుమిరపకాయలు - 3 (Buy: amzn.to/37DAVT1)
    ఇంగువ - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/38sr0QZ)
    తయారుచేసే విధానం:
    ముందుగా ఆవాలు, మెంతులని విడివిడిగా వేయించి, పొడి పట్టి పక్కన పెట్టుకోవాలి
    ఒక బౌల్లో, తరిగిన క్యాలీఫ్లవర్, క్యారెట్, మగ్గించిన నిమ్మకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి, తరిగిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి
    ఇందులో ఉప్పు, ఎండుకారం, ఫ్రెష్గా పొడి పట్టిన మెంతిపిండి, ఆవపిండి కూడా వేసి అన్నిటినీ బాగా కలపాలి
    ఇప్పుడు నిమ్మరసం, నూనె వేసి మళ్ళీ కలిపి పక్కన పెట్టాలి
    తాలింపు కోసం ఒక పాన్లో ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించి, పచ్చట్లో వేసి కలుపుకోవాలి
    మీకు కావాలంటే ఇంకా ఎక్కువ నూనె కూడా వేసుకోవచ్చు
    అంతే, ఇన్స్టెంట్ మిక్స్డ్ వెజ్ పచ్చడి తయారైనట్టే. ఇది అన్నం, రోటి, దోశల్లాంటివాటిలోకి చాలా బాగుంటుంది
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK - / homecookingtelugu
    CZcams: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...
  • Jak na to + styl

Komentáře • 40