Video není dostupné.
Omlouváme se.

#Laxmi

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2020
  • Laxmi Sitapata Kuriseti Sinukullajada Folk Song||Full Song|| Singer Laxmi || Bantu Narsaiah || Raana||Nani Bhojanna
    🎧 మా పాట మీకోక జ్ఞాపకమవ్వాలి...
    🎧 మా ఆట మీకు ఆహ్లాదాన్ని అందించాలి...
    🎧 ప్రతి పూట మీకు ఓ పండగలా అనిపించాలి...
    🎧 మా BANTU Music మీకు బంధువులా మారాలి...
    🎻🎻🎻🎻🎻
    ఇలా మీతో కలిసి అడుగులు వేస్తున్నందుకు చాలా సంతోషం..
    మీ కుటుంబమంతా వినేలా మా పాటల పదాలతో మీ మనసులో మా అక్షరాసుమాలు పూయించాలనేది మా ఆతృత,అభిలాష,ఆకాంక్ష...
    అందుకు మీరు మాకు తోడు నిలవాలి...
    మీ ఆశీస్సులు అందించాలి..
    మమ్మల్ని ఆదరించి,ఆశీర్వదించాలి మొత్తానికి కళకి కళాకారులకి తోడు నిలవాలని కోరుకుంటూ...
    .....
    ....
    సదా మీ శ్రేయస్సు కోరే..✒️
    మీ BANTU Music
    Lyrics: Nani Bhojanna
    Singer: Dasa Laxmi
    Music: Ravi Kalyan
    Camara: Mahesh Alle
    Editing: Ashok Boge
    Titles :Bejugam Srikanth
    Asistent Director: Sri Charan
    Director: Raana
    Producer: Bantu Narsaiah (7780554065)
    𝗧𝗲𝗰𝗵𝗻𝗶𝗰𝗮𝗹 𝗔𝗱𝘃𝗶𝘀𝗲𝗿 : 𝗥𝗼𝗻𝗶 𝗘𝗱𝗶𝘁𝗶𝗻𝗴 𝗦𝘁𝘂𝗱𝗶𝗼
    #𝐑𝐨𝐧𝐢𝐎𝐫𝐢𝐠𝐢𝐧𝐚𝐥𝐬
    (𝟵𝟳𝟬𝟬𝟯𝟳𝟬𝟬𝟲𝟳)
    ఎవరైనా అనుమతి లేకుండా పాటను కాపీ చేస్తే కాపీరైట్స్ వేయడం జరుగుతుంది దయచేసి సహకరించగలరు.
    ఇక నుండి మేము రిలీజ్ చేసే ప్రతీ పాట కూడా మీకోసం ఇలా లిరిక్స్ రూపంలో అందిస్తాం..
    సిటపట కురిసేటి సినుకుల్ల జాడ
    పల్లవి:- సిటపట కురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్త అంటున్నదో
    నా యదపైన రాలేటి గంధాల మేడ నను పిలుసుకుంటున్నదో {సిట, నా..2}
    సిరిమోము నాబావ శీనయ్య ఏడంటు నను నిలదీస్తున్నదో...
    {సిటపట}
    చరణం:- నా కురులన్ని కులికేను సరసామాడుకుంటు సందేల సల్లంగనో
    నా మెడసుట్టు నగలన్ని గిలిగింతవెడుతుంటే నడిరాత్రి ఏమందునో
    {నా కురులన్ని, నా మెడ 2}
    ఇక జాలు అంటుంటే అలిగీ కూసున్నాయి అల్లీన ఆ పువ్వులో
    {సిటపట}
    చరణం:- గాజులన్నీ ఘల్లుమనుకుంటు నను జూసి ఘోరంగదిడుతున్నాయో
    కాలి గజ్జకేమయ్యిందో గరం గావట్టే గగ్గోలు వెడుతున్నాయో {గాజులన్నీ, కాలి గజ్జ 2.}
    అందుకుందామంటే అందేలన్ని ఇంకా అల్లారువడుతున్నాయో..
    {సిటపట}
    చరణం:- కొంగుకేమయ్యిందో కోరికతో నాతో కొట్లాటవెడుతున్నదో
    నా సెంగుకేమయ్యిందో సిరుగాలి వీస్తుంటే పైకెగర జూస్తున్నదో {కొంగు, సెంగు 2.}
    సిన్నంగ నా సేతవట్టుకుంటే నన్ను సీదరిస్తవున్నయో..
    {సిటపట}
    చరణం:- సింతసిగురుగొయ్యావోతే సిలకాలన్ని గూడి సీరాకువడుతున్నాయో
    సెలిమీజెయ్య నీకు సెలికాడు లేడంటూ సిన్నంగ నవ్వినయో.. {సింత, సెలిమి 2.}
    ఎన్నితీర్లుగా నిన్ను దలుసుకున్నా నీ జాడే కరువాయనో...
    {సిటపట}
    ...... రచన & స్వరకల్పన ......
    నాని భోజన్న
    #laxmibathukammasongs
    #laxmifolksongs#Laxmisongs #andhukundhamanteandhelanienkaallarupaduthunnayo#bantumusic #nanibhojannasongs.#kongukemayyindhokorikathonathokotlatapaduthunnayo#newfolksongs#latestlaxmifolksongs#tiktoktrendingsongs#bantumusic#bantunarsaiahsongs#bantu

Komentáře • 3,3K

  • @venkateshwarlupittala3092
    @venkateshwarlupittala3092 Před 3 lety +179

    భోజన్న గారూ హ్యాట్సాఫ్ మీరచన చాలాబాగుంది ఆ పాటకు ప్రాణం పోస్తూ మీరు స్వరపరిచిన తీరు అమోఘం
    ఇక లక్ష్మీ గారు సహజంగా చక్కని కంఠస్వరంగల గాయిని కావడం ఒక ఎత్తు
    మళ్ళీ ఆమె నటనలో కూడా జీవించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అలా అపూర్వంగా ఉంది మీ కృషి కొనియాడదగినది. అద్భుతంగాఉంది

  • @sanganamonivishnu554
    @sanganamonivishnu554 Před 4 lety +608

    లక్ష్మి పాడిన పాటలలో అన్నింటిలో కంటే ఈ పాట చాలా బాగుంది అనే వారు లక్ష్మి పాటలు ఇష్టపడే వారు ఒక లైక్ వేయండి ఈ పాట కోసం ప్రయత్నించిన వారందరికి పేరు పేరునా ధన్యవాదాలు.........

  • @nageshnaidu6163
    @nageshnaidu6163 Před 4 lety +681

    ఈ పాటలో లక్ష్మి వాయిస్ అదిరిపోయింది వాయిస్ నచ్చిన వాల్లు లైక్ కొట్ట౦డి

  • @loserscelluloid529
    @loserscelluloid529 Před 3 lety +183

    చెత్త చెత్త పాటలకి కోటి వ్యూస్ వచ్చాయి.
    కానీ ఇంత మంచి సాహిత్యం ఉన్న పాటకి రాకపోవడం అస్సలు బాలేదు.

    • @nanibhojannaofficial250
      @nanibhojannaofficial250 Před 3 lety +3

      అదే బాధగా అనిపిస్తుంది బ్రదర్..

    • @mobiksa7686
      @mobiksa7686 Před 3 lety +3

      Adhe nen baaadhapadthunannu😌

  • @chinthalayadagiri.beautifu475

    సాహిత్యం లో ఉన్న ఎక్స్ ప్రేషన్ కంటే కూడా ‌ మీ బాడీ ఎక్స్ ప్రేషన్స్‌ అద్భుతం‌ ...సరైన‌ స్ర్కిప్ట్ దొరికితే ‌... నీలోని‌ నటన‌ బయటకొస్తుంది... శుభాకాంక్షలు లక్ష్మి 🤝🤝🤝

  • @rajnandangandrakota8948
    @rajnandangandrakota8948 Před 4 lety +146

    సింగర్ + డాన్స్+ ఎక్స్ ప్రేశన్స్= లక్ష్మీ.....

  • @kumarveeramalla3958
    @kumarveeramalla3958 Před 4 lety +267

    లక్ష్మీ ఇన్ని రోజులు గాన కోకిలే అనుకున్నాం కానీ పురివిప్పిన నెమలి లాగా నాట్యం చేస్తుంది అని ఈ పాటతో తెలిసింది

  • @devenderthota8736
    @devenderthota8736 Před 4 lety +60

    బాధనైన , సంతోషాన్ని అయినా సాధారణ ప్రజలకీ అర్థమయ్యే విధంగా ఉండేది నా తెలంగాణ జానపాధనికి మాత్రమే సొంతం

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 Před 2 lety +5

    సినిమా పాట ఎందుకూ పనికి రాదు ఈ పాట దగ్గర..... Super

  • @saikrishnashanagonda9186
    @saikrishnashanagonda9186 Před 4 lety +270

    నాకయితే సినిమా పాటల కంటే జానపద పాటలు చాలా ఇష్టం అందులో ఈ పాట విన సొంపుగా ఉంది 👌

  • @shyamsundarreddy7947
    @shyamsundarreddy7947 Před 4 lety +461

    మీ పాట మాకు ఒక జ్ఞాపకం
    మీ ఆట మాకు ఆహ్లాదాన్ని ఇస్తుంది
    సింగర్ లక్ష్మి అక్క వాయిస్ నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్👍👌👌😍😍🙏🙏

    • @psairamsairam8668
      @psairamsairam8668 Před 4 lety +3

      Hai

    • @psairamsairam8668
      @psairamsairam8668 Před 4 lety +2

      You thinking verry nice

    • @Rishi12062
      @Rishi12062 Před 4 lety +4

      U want likes Priya 👍

    • @nanibhojannaofficial250
      @nanibhojannaofficial250 Před 4 lety +2

      మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏...
      ...
      అలాగే షేర్ and స్టేటస్ లో కూడా ఉంచి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ..
      ధన్యవాదాలు 🙏🙏✒️✒️🙏🙏

    • @shyamsundarreddy7947
      @shyamsundarreddy7947 Před 4 lety +1

      @@nanibhojannaofficial250 💃💃👍👍

  • @roshanrohan4029
    @roshanrohan4029 Před 3 lety +17

    ఆంధ్ర నుండి నాలాగే లక్ష్మి సాంగ్స్ గురించి ఎదురుచూసే వాళ్ళు like చేయండి ఇక్కడ

  • @anushayambadi2729
    @anushayambadi2729 Před 8 měsíci +45

    Insta la chusi itu ochinollu enthamandhi...????

  • @ramasanishekar840
    @ramasanishekar840 Před 4 lety +94

    నీ పాటకి ఒక మాటలో చెప్పాలంటే ఈ కామెంట్ బాక్స్ సరిపోదు...
    నేను ఎం అని చెప్పాలి....👌👌👌👌👌👌👌

  • @jaikarnenejaikarnene6794
    @jaikarnenejaikarnene6794 Před 4 lety +219

    ఈ సాంగ్ లో ఒక పెద్ద హీరోయిన్నీ పెట్టిన అంతబాగా ఎక్స్ స్ప్రెషన్ చేయదేమో ,ఎందుకంటే మన పల్లెపదలు కదా 😍👌👌💐💐

    • @kottagatturamesh7044
      @kottagatturamesh7044 Před 4 lety +3

      Yes brother

    • @nanibhojannaofficial250
      @nanibhojannaofficial250 Před 4 lety +2

      నిజమే బ్రదర్

    • @narmetaranjithkumar1988
      @narmetaranjithkumar1988 Před 4 lety +2

      ఈ సాంగ్ లో ఒక పెద్ద హీరోయిన్ పెట్టిన అంత బాగా ఎక్స్పీరియన్స్ చేయదు ఎందుకంటే మన పలే పదలు కదా సూపర్ లక్ష్మి అక్క💐💐💐🌹🌹🌹🌻🌻🌻🌼🌼🌼🙏🙏👍🏿👍🏿👍🏿

    • @iamgeethareddy
      @iamgeethareddy Před 3 lety +1

      Avnu annya

    • @ravibavu6973
      @ravibavu6973 Před 3 lety

      @@kottagatturamesh7044
      0ppppp in

  • @rajucherla7704
    @rajucherla7704 Před 3 lety +13

    👏లక్ష్మీ సింగర్ అనుకున్న కానీ సూపర్ డాన్సర్ కూడా ఎక్స్ ప్రెషన్స్ తో చంపేసావు సూపర్ లక్ష్మి👌👌🌷

  • @pillikarnaveen3098
    @pillikarnaveen3098 Před 3 lety +35

    భోజన్న గారు మీ పాటకు లక్మి ప్రాణం పోసింది...ఆమె గానం తో నాట్యం తో.. nice bro

  • @tsrisailamgoud8691
    @tsrisailamgoud8691 Před 4 lety +320

    Comment చదువుతు చూస్తున్నా వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @pammallesh3710
    @pammallesh3710 Před 4 lety +604

    రెండు సార్ల కంటే ఎక్కువగా ఈ పాటని విన్న వాల్లే ఇక్కడ లైక్ చేయండి

  • @kingdon8870
    @kingdon8870 Před 2 lety +6

    నాకైతే సినిమా పాటల క‌ంటే జానపద పాటలంటేనే ఇష్టం 🖤🖤🖤

  • @DurgaPrasad-mj1jq
    @DurgaPrasad-mj1jq Před 3 lety +5

    చక్కని పాట, రచన విన్యాసం చాలా బాగుంది, తెలంగాణ భాషకు యాస తప్ప, అందం, భావం ఏమున్నది? అన్నవారికి, ఈ పాట మంచి ఉదాహరణ.
    All the best

  • @sakshi.vinodkumar6098
    @sakshi.vinodkumar6098 Před 4 lety +89

    అడవిలో నెమలి నాట్యానికి , చల్లని గాలి తుంపర వాన ఈపాట ,చాలా బాగుంది. అందరికీ ధన్యవాదాలు

  • @ashokedula3309
    @ashokedula3309 Před 4 lety +146

    కొంగుకేమైందో కోరికతో నన్ను కొట్లాట పెడుతున్నదో
    నా సింగుకేమైందో సిరుగాలి వీస్తుంటే పైకెగరచుస్తుందో..👌superb lyrics

  • @karthikkontham4558
    @karthikkontham4558 Před 4 lety +23

    లిరిక్స్ ఒక ఎత్తు ఐతే ఆ హావభావాలు...మామూలు గా లేదు...🙏🙏🙏

  • @yerrannapaata1415
    @yerrannapaata1415 Před 3 lety +6

    ఇంత అందమైన పాట ఇంత అందమైన డాన్స్ పాట రాసిన నీకు డాన్స్ చేసిన లక్ష్మి కి పాడినందుకు డాన్స్ చేసినందుకు నిజంగానే మీరిద్దరూ నాకు బంధువు అయిపోయారు నువ్వు పాటలు ఇలాంటివి అందించి ప్రజల మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీమ్ అందరికీ కృతజ్ఞతలు మీ వీర అభిమాని ఎర్రన్న సింగర్ రైటర్ డాన్సర్ యాక్టర్ మోటివేటర్ మరియు ఆల్కాల్ అడిక్షన్ కౌన్సిలింగ్ మాస్టర్ వరంగల్ జిల్లా

  • @udaykumars7728
    @udaykumars7728 Před 4 lety +142

    ఈ సాంగ్ నా మైండ్ లో నుండి పోవట్లేదు...... తెలియకుండానే మనసులో పాడుకుంటున్న Tq

  • @gaaa998
    @gaaa998 Před 4 lety +82

    ఇలాంటి పాట కేవలం సినిమాలో మాత్రమే ఉండాలి అల్ డిపార్ట్మెంట్ న్యాయం చేశారు మనస్ఫూర్తిగా చెప్తున్న .ఒక కళాకారుడిగా మీకు సినీ భవిషత్తు ఉంది.

  • @eramesh4165
    @eramesh4165 Před 3 lety +23

    లక్ష్మి చాలా బాగా పడవు నువ్వు సూపర్ తల్లీ 🙏🙏🙏❤️❤️❤️

  • @Bojjasrinivas750
    @Bojjasrinivas750 Před 2 lety +4

    లక్ష్మీ గారు పాటలే కాదు డ్యాన్స్ కూడా అద్భుతంగా ఉంది .👌👌👌👏👏👏

  • @bhoothagaddasrinivasfarmer7351

    సీటపాట కురిసెటి సీనుకులల్లో పురివిప్పిన నెమలి వాలే నాట్యం
    వావ్ లక్ష్మి చాలా చాలా బాగుంది మీ ఆహార్యం👌

  • @cobraking7500
    @cobraking7500 Před 4 lety +89

    ప: మా లచ్చిమీ కి ఈ మధ్య ఏమైనదో డాన్స్ ఇంత మంచిగా పాటలు ఇంత మంచిగా పాడుతున్నదో,,,

  • @swapnassswapna2205
    @swapnassswapna2205 Před 4 lety +11

    అక్క పాట సూపర్ గా ఉంది నువ్వు పాడితే మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తది అక్క ని వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం

  • @humanisamofbharath2685

    ఓ జానపదమా....జన పదం లో జన్మించి ఆ లక్ష్మీ సోదరి స్వరంలో అమరి ఎంత మధురమయ్యాఓ ఒక్కసారి నీ జన పదం రుచి చూసుకో.........

  • @tovideos7132
    @tovideos7132 Před 4 lety +50

    ఈ సాంగ్ రాజన్న సినిమాలోని సాంగ్స్ అన్నిటికీ మించిపోయింది...lovevet

  • @santhuadepu
    @santhuadepu Před 4 lety +52

    ఇది ఎంత విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది... లక్ష్మి వాయిస్ కీ నేను ఫిదా..i love her expressions🥰🥰♥️♥️♥️♥️

    • @laxmankoyeti3694
      @laxmankoyeti3694 Před 3 lety

      H jb sjh anubjhjhj hmm
      J fmghgdbl
      Hhcmlgh
      Kufnkh ft ogj ch ch kjuo
      Jjjbjahfjflg

    • @santhuadepu
      @santhuadepu Před 3 lety

      @@laxmankoyeti3694 rayarakapothe sappudeka ukunte ayipothunde bro.. urikene ni ejjath mottam thiskuntunnaru? Adi em language annttu kilkil basha naa😃😃😃😅😅😅🤔🤔🤔🤔🙄🙄

  • @banalamahesh218
    @banalamahesh218 Před 4 lety +4

    ఈ పాట నిండైన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేల ఉండడమే కాకుండ, తెలంగాణ జానపదాలను మనకు గుర్తు చేస్తున్న బంటు. నర్సయ్య గారికి, గానకోకిల లక్ష్మిగారికి దన్యవాదాలు...

  • @srinivasmadupu4374
    @srinivasmadupu4374 Před 3 lety +11

    మంచి ఆహ్లాదాన్ని,, ఆనందాన్ని కలుగ చేస్తున్న ఈ పాటతో మనసు పులకరిస్తుంది...

  • @mallaiahballapuram9814
    @mallaiahballapuram9814 Před 4 lety +87

    సూపర్ గా ఉంది
    వింటుంటే మళ్ళీ,మళ్ళీ వినాలనిపిస్తోంది
    మంచి లిరిక్స్,మంచి మ్యూజిక్,మంచి వాయిస్,మంచి డ్యాన్స్ మొత్తం అందరి కృషి అద్భుతం,అభినందనీయం
    ఆల్ ది బెస్ట్

  • @maggidiajay6943
    @maggidiajay6943 Před 4 lety +25

    👌👌నాకు నచ్చిన కొన్ని పాటలో ఈ పాట ఒకటి సూపర్ గా ఉంది అల్ ది బెస్ట్ 😍😍

  • @sampathgopalasampath2477
    @sampathgopalasampath2477 Před 2 lety +4

    తెలంగాణ జానపదానికి ఉందే గొప్పదనమే వేరు, చాలా గొప్పగా పాడింది మరియు నటించింది

  • @bsbeditzz310
    @bsbeditzz310 Před 2 lety +3

    చెల్లే ఈ పాట ప్రతి రోజూ వింట విన్న తరువాత నిద్ర తల్లి సూపర్ నాని

  • @harishsana211
    @harishsana211 Před 4 lety +48

    Laxmi akka ki Okka like vasukudiiii💕💕💕👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tankarinarsimha9038
    @tankarinarsimha9038 Před 4 lety +9

    సూపర్ బ్రో మస్తుగుంది పాట.👌👍👍👏👏👏💐💐💐

  • @Silent_killer_Ravi
    @Silent_killer_Ravi Před rokem +3

    నిజం గా మీ ఈ పాట నాకు జ్ఞాపకమ్...
    లక్ష్మి గారి ఆట మాకు ఆహ్లాదాన్ని అందించింది...
    ఎల్లాంటి సంగీతం కోసం ... సాహిత్యం కోసం ..డ్యాన్స్ కోసం .. సాధ మీ తోడుంటాం...BANTU Music మ బంధువు......

  • @harnalaharnala
    @harnalaharnala Před 3 lety +4

    ఇయర్ ఫోన్ పెట్టి విన్నారంటే పాటకు ప్రాణం ఇచ్చేస్తారు 👌👌👌👌

  • @gangadharthavutu1684
    @gangadharthavutu1684 Před 4 lety +46

    సముద్ర అలలాంటి ఆ గొంతు.... పడుతూ లేస్తూ...ఎదను అలా అలా తాకుతూ దూరంగా వెళుతున్నట్టు....
    మల్లి దగ్గరకి వచ్చి లేపుతున్నట్టు ఉంది....
    సూపర్బ్.....💐💐

  • @rajenderrajender2805
    @rajenderrajender2805 Před 4 lety +111

    Song frist time venavalu OK like kotandeee

    • @anreddy8288
      @anreddy8288 Před 4 lety +2

      Super undi song records break chesthadi

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Před 10 měsíci

    అసలు ఆ ఎక్స్ప్రేషన్ చంపేశారు మాములుగా లేదు కో రీయోగ్ర పి మ్యూజిక్... పాట లోని అక్షరాలు పల్లె లోని ఆ ప్రాంతాలు wa ఇప్పటికి పాట వింటున్న వాళ్ళు like it 🥰🥰🥰🎉🎉🎉

  • @venkatkavi1860
    @venkatkavi1860 Před rokem +2

    చాలా బాగుంది లక్ష్మీ.అపర గాన కోకిలవై....చాలా చక్కగా పాడాను నృత్యాన్ని అందంగా నర్తించారు.... రచయియ నాని భోజన్న గారికి సర్వాభినందనలు.టీం కు కూడా అభినందనలు .....బి. వెంకట్ కవి

  • @Naresh_vodnala
    @Naresh_vodnala Před 4 lety +109

    అదే జాను హేమ dance chesthe ee పాటికి 10m views vochevi
    పాట భావాన్ని చూడండి అమ్మాయిలను కాదు...
    ఒక మంచి పాటను అందించిన టీమ్ మొత్తానికి నా అభినందనలు.....

  • @rider_bro365
    @rider_bro365 Před 4 lety +19

    E song kosam wait chesina vallu oka like vesukondi👌👌

    • @battusatyanarayana8573
      @battusatyanarayana8573 Před 4 lety

      లక్ష్మి నా నేమ్ ని e patalo ఎక్ష్ప్రెస్స్ స్పర్ర్య్ maa

  • @bsbeditzz310
    @bsbeditzz310 Před 2 lety +1

    సెల్లే సూపర్

  • @tlgchannel
    @tlgchannel Před 3 lety +3

    మీ నటన, మీ గానం, మీ ఆంగికాభినయం అద్బుతం. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
    మీ
    TLG CHANNEL

  • @vestigegopibudutha1428
    @vestigegopibudutha1428 Před 4 lety +14

    జనపదాలకు బ్రతికించటానికి పుట్టినా మట్టిలో మాణిక్యం మీ గొంతు లక్ష్మి గారు,
    మీ సాంగ్స్ వినడం లో మొదటి వరుసలో నేనుఉంటా మేడం..
    కృతజ్ఞతలు....

  • @devarisurender265
    @devarisurender265 Před 4 lety +50

    పాట, కొరియోగ్రఫీ, అక్క exprations.. లొకేషన్స్... అని బాగున్నాయ్...all the best...team..

  • @padakandlanagasubbarao8904

    మల్టీ టాలెంటెడ్ లక్ష్మి గారు ఒక్కసారి మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఉంది మీరు దేవుడిచ్చిన వరాలు

  • @mybunnykalmuri8311
    @mybunnykalmuri8311 Před 2 lety +4

    లక్ష్మీ అక్క పాడిన పాటలు చాలా బాగుంటాయి.... అందులో ఈ పాట ఒక రోజులో 10సార్లు వింటాను..... i like it song...... అద్భుతమైన పదాలు సమకూర్చిన రచయితకు నా సెల్యూట్.,...

  • @9NAYADUNIYA
    @9NAYADUNIYA Před 4 lety +13

    లచ్చక్క voice superb .....expressions superb .....ఒక like vesukondi

  • @saidulumaddi8489
    @saidulumaddi8489 Před 4 lety +12

    మంచి గొంతుతో అలరించారు లక్ష్మీ గారు..
    నటించే అవకాశం వేరే వారికి ఇస్తే బాగుండు...

  • @anushayadav3411
    @anushayadav3411 Před 3 lety

    ఎం లిరిక్స్ రా నాయన, సూపర్ అన్న, మైండ్ రిలీఫ్ అయింది పాట వినగానే, మ్యూజిక్ సూపర్బ్ . Tq team members .

  • @nivruthateluguchannel8676
    @nivruthateluguchannel8676 Před 4 lety +33

    లక్ష్మీ గారు మీ smile చాలా బాగుంటుంది మీ voice బాగుంటుంది simply superb ఎన్ని సార్లు విన్నా కూడా వినాలనిపిస్తుంది

  • @gangaram6219
    @gangaram6219 Před 4 lety +4

    Supar song 💐💐💐💐💐

  • @neerudiashokashokneerudi7747

    ఈ పాటకు ప్రాణం పోసావు లక్ష్మీ గారు జనపదం చనిపోయింది అనే వేళలో మళ్ళీ పురుడు పోసావు ఎలాంటి పాటకు మరి ఎన్నో పడాలి అన్ని మాన్షుపూర్తిగా కోరుకుంటున్న

    • @nanibhojannaofficial250
      @nanibhojannaofficial250 Před 4 lety

      తప్పకుండా... మీరన్నట్టు జానపదానికి ఎప్పటికి అంతం ఉండదు ఇది తెలిస్తే చాలు కొందరికి...

  • @venkateshwarlupittala3092

    లక్ష్మి గారి ఈ సాంగ్ లో పాడటం ఒక ఎత్తైతే ప్రదర్శించడం ఎన్నోరెట్లు గొప్పగా ఉంది.

  • @pakkapalletoor
    @pakkapalletoor Před 4 lety +64

    అన్నో .....ఇంకా ఆరు గంటల సరే వేయి కండ్లతో వేచి చూస్తున్న...అన్న💯♥️👌🏻👌🏻

  • @jaikarnenejaikarnene6794
    @jaikarnenejaikarnene6794 Před 4 lety +237

    150 km వరకు ఈ ఒక్క పాటనే వినుకుంటు పోయిన ....wow నైస్ song కిర్రాక్ వాయిస్ అబ్బా ,సూపర్ మ్యూజిక్ good కొరియోగ్రాఫి 👌👌💐💐👍👍😍😍😘😘

  • @kranthikumar1255
    @kranthikumar1255 Před 3 lety +4

    రోజు ఈ పాట వింటూ మా ఊర్లో కాలువ గట్టు పై ఉదయపు నడక కి వెళ్తుంటే అసలు ఈ అనుభూతి చాలా బాగుంది...

    • @shivanyadav4944
      @shivanyadav4944 Před 3 lety +1

      Feeling that day we have a experienced good day about full song👌💐😍

  • @venkat93125
    @venkat93125 Před 3 lety

    నకు జనపద పాటలు చాలా ఇస్తం అంధులో ఇ సాంగ్ చాలా ఇస్తమ్ ఎన్నిసార్లు చుసినా చుదలనిపిస్తుంధి

  • @bhojannadodikindi2565
    @bhojannadodikindi2565 Před 4 lety +44

    ఇలా ఇలాంటి పాటలు చాలా చాలా ముందుకు రావాలని కోరుకుంటున్నాము

    • @nanibhojannaofficial250
      @nanibhojannaofficial250 Před 4 lety +3

      మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏...
      ...
      అలాగే షేర్ కూడా చేసి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ..
      ధన్యవాదాలు 🙏🙏✒️✒️🙏🙏

  • @sanganamonivishnu554
    @sanganamonivishnu554 Před 4 lety +38

    ఈ పాట రాసినందుకు నాని బోజన్న గారికి
    శతకోటి వందనాలు మీరు ఇలాగే ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న మీ అభిమానులు.............

    • @Mana_Janam_Velugu
      @Mana_Janam_Velugu Před rokem

      మీ ఈ కామెంట్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది డియర్ బ్రదర్.. నేనే లేట్ గా చూసుకున్న కామెంట్..
      Thankq so much

  • @kamalasumalatha9925
    @kamalasumalatha9925 Před 3 lety +1

    Superb Laxmi

  • @sreekanthmukkamula278
    @sreekanthmukkamula278 Před 3 lety +60

    అడవీలొ నేమలీ నాట్యం ఆడీనట్టుందీ ఆవాతావరణం ఆ డాన్స్ ఆ ఎక్స్ ప్రెశన్స్ సుపర్ లక్ష్మీ

  • @freefirelovers1554
    @freefirelovers1554 Před 4 lety +19

    Song bagundhi ante 1 like kottandhi

  • @siddusmart6607
    @siddusmart6607 Před 4 lety +10

    పాటకే పాటతో లాలిపాట పాడినట్లుంది
    రచన,సంగీతం,గానం,నటన అన్ని సూపర్👌👌👌👌👌👌😍😍😍💟💟💟

    • @nanibhojannaofficial250
      @nanibhojannaofficial250 Před 4 lety +1

      మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏...
      ...
      అలాగే షేర్ and స్టేటస్ లో కూడా ఉంచి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ..
      ధన్యవాదాలు అన్నగారు 🙏🙏✒️✒️🙏🙏

    • @singerlaxmidasa6087
      @singerlaxmidasa6087 Před 4 lety +1

      Thank u siddhu

  • @gopalyadav3930
    @gopalyadav3930 Před 2 lety

    Ee patalo prathipadamlo amrutham noo posinattuunndhi anthe adbhuthanga Lamxi thalli presents chesidhi.Hats off Bangaroo.

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Před 3 lety +2

    అద్భుతమైన బాణీ గానం కూడా అంతే అద్భుతంగ ఉంది 👌👌👌పాటకుతగ్గట్టు హొయలు 👌👌👌👌👌

  • @shmrshmr
    @shmrshmr Před 4 lety +7

    Superb........ Song
    Laxmi performance exlent..........
    పాట చాలా బాగా రాసారు
    లక్ష్మి కోసమే ప్రత్యేకంగా రాసినట్టు ఉంది ఈ పాట లక్ష్మి గొంతు లోని సహజ సిద్ధమైన తియ్యదనం ఈ పాటకి ప్రాణం పోసింది అని చెప్పొచ్చు. అంతే కాకుండ natural star అయిన Laxmi perfomance ఈ పాటలో ఒదిగి పోయింది. Very very .... superb..
    ఇలాంటి పాటలు ఇంకా Laxmi చెయ్యాలి.

  • @Rishi12062
    @Rishi12062 Před 4 lety +11

    Laxmi Garu
    me dance ki..
    Me voice ki..
    Me expressions ki..
    Me dressings ki..
    Take a bow 👍🙏🙏

  • @ajayofficial7153
    @ajayofficial7153 Před 3 lety +18

    మెల్ వెర్షన్ లో కావాలి annavaru లైక్ చెయ్యండి

  • @kampillasrisailamKampilla

    రాజన్న మూవీ సాంగ్ కి దగ్గరగా ఉంది

  • @vinayakgone1313
    @vinayakgone1313 Před 4 lety +7

    నాని భోజన్న సూపర్ బాగా రాసావ్ సాంగ్. Keep it up. చాలా బాగా పాడించావ్

  • @nraju655
    @nraju655 Před 4 lety +10

    Super performance
    Great presentation
    ఈ పాట చూస్తుంటే పల్లె సెలయేరు లో పయనించి నంత హహ్లాదకరం గా ఉంది
    కొద్ది సేపు బాధలు మరచిపోయి ప్రశాంతంగా ఉన్నా
    ఇలాంటి వీడియోలు చేసి
    మా బాధలు మరిచి పోయాలా చేయమని
    కోరుకుంటున్నాము
    థాంక్స్

  • @satyanarayanakollu1112

    అప్పుడే అయిపోయిందా పాట అనిపిస్తుంది 👌👌👌👌

  • @gopalyadav3930
    @gopalyadav3930 Před 2 lety

    Laxmi voice tho palikina ee lyrics & Laxmi acting ee pata vinnantha sepu Prapanchanni maripinchindhi Great song great presentation & acting Laxmi thalli.

  • @santhuadepu
    @santhuadepu Před 4 lety +8

    Singer voice abba acham kohila digivachinattu undi... Choreography osm😍🥰🥰🥰♥️♥️♥️♥️♥️♥️

  • @vempatipraveenkumar5884
    @vempatipraveenkumar5884 Před 3 lety +5

    Supar song kadha

  • @radhikanalagorla8582
    @radhikanalagorla8582 Před 3 lety +1

    Hi lakshmi akka nenu meeku big fan & me voice super eppudu elane navvutu happy ga undali enka chala songs padali

  • @immadirajita5627
    @immadirajita5627 Před 3 lety +1

    Chala bhaga padavu with dance superb

  • @julurusreenu3427
    @julurusreenu3427 Před 3 lety +4

    పాటను 3d లో భలే set చేశారు!!...,super ,,exallent..🤗🤗👌👌👌💙💙💙💙

  • @ebalu3162
    @ebalu3162 Před 4 lety +29

    మీ అక్షరాలా పదాలకు అక్క వాయిస్ సూపర్ ఆక్టింగ్ super anna

  • @mallimk6797
    @mallimk6797 Před 3 lety

    Endi lachakka edi Ila aipoyav ....entha mudhu ga padinav ...adinav ..... super akka 🥰🥰🥰🥰🥰

  • @rajlath1234
    @rajlath1234 Před 20 hodinami +1


    Chala Chala bhagu nnadi epata

  • @adilahmed9952
    @adilahmed9952 Před 4 lety +5

    Nice

  • @sairam-ip9jn
    @sairam-ip9jn Před 4 lety +45

    🙏🙏🙏ఇంత మంచి పాటను అందించిన lyricist,singer, producer and all technical supporters ki ధన్యవాదములు..song👌👌👌👌

    • @nanibhojannaofficial250
      @nanibhojannaofficial250 Před 4 lety +2

      మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏...
      ...
      అలాగే షేర్ and స్టేటస్ లో కూడా ఉంచి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ..
      ధన్యవాదాలు 🙏🙏✒️✒️🙏🙏

    • @KondariSwamy
      @KondariSwamy Před 4 lety +2

      Lachhaluuuu Love you ra ur Singing

    • @swamydontharamaina5088
      @swamydontharamaina5088 Před 4 lety +1

      @@KondariSwamy superlaxmisong

    • @anjaiahmodumpally854
      @anjaiahmodumpally854 Před 4 lety +1

      Excellent Song

    • @rajkanna8934
      @rajkanna8934 Před 4 lety +1

      @@nanibhojannaofficial250 special ga lyrisist ki shathakoti dhandaalu Anna folk song charithralone the best song Anna all the Best waiting for next song

  • @RajaYarlagadda
    @RajaYarlagadda Před 9 měsíci +1

    లక్ష్మీ గారూ.....మొదటగా మీరు ఈటీవీ డ్రామా కంపెనీలో పాడిన పాటలు విన్నా అప్పటినుండి మీ పాటలు యూ ట్యూబ్ లో వింటూనే ఉన్నా.మీ వాయిస్ చాలా ఇష్టం ❤

  • @narsimharao8349
    @narsimharao8349 Před 3 lety +1

    అచ్చ తెలుగు పదాలు తెలంగాణ యాస లో 🔥🔥🔥🔥🔥🙏🙏🙏👍👍👍 impressive performance ❤️❤️❤️

  • @koyyabomma_koyilamma7987
    @koyyabomma_koyilamma7987 Před 3 lety +5

    రచయుతకి నా శతకోటి వందనాలు..సినిమాలకి సరిపోయే రచన...😍😍❤️💐💐💐💐

    • @Mana_Janam_Velugu
      @Mana_Janam_Velugu Před rokem +2

      చాలా చాలా సంతోషంగా ఉంది మీ కామెంట్.. ఒక రచయితగా నాకు ఇంకేం కావాలి... thankq

  • @Sanjayy_4444
    @Sanjayy_4444 Před 4 lety +11

    *Pakka **#BlockBuster** Song...🔥👌🏻*
    *Nani Bhojanna Lyric's Next Level...👏🏻*

  • @sreenucreativestudiosshow4412

    లక్ష్మీ గారు మీ అన్నీ సాంగ్స్ నేను చూస్తుంటాను కానీ ఈ పాటలో ఏదో మాయ ఉంది.సాంగ్ ఫ్లో వింటుంటే వేరే లోకానికి తీసుకెళ్తుంది.

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Před 2 lety

    లక్ష్మీ అక్క మీరు సాంగ్ చాలా బాగా పాడారు వెరి నైస్ సాంగ్ congraselations🤝🤝🎶🎶