krupaa krupaa sajeevulatho ॥ కృపా కృపా సజీవులతో ॥

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • #hosannaministries #hosannalive #hosannaministriesofficial #hosannaofficial #hosannaministriesguntur #hosannalivesongs
    కృపా - కృపా సజీవులతో నను నిలిపినది నీ కృపా
    నా శ్రమదినమున నాతో నిలిచి
    నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప
    కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా
    శాశ్వతమైన నీ ప్రేమతో
    నను ప్రేమించిన శ్రీకరుడా
    నమ్మకమైన నీ సాక్షినై నే
    నీ దివ్యసన్నిధిలో నన్నోదిగిపోని
    నీ ఉపదేశమే నాలో ఫలబరితమై
    నీ కమనియ్యకాంతులను విరజిమ్మెనే
    నీ మహిమను ప్రకటింప నను నిలిపెనే
    గాలితుఫానుల అలజడిలో
    గూడుచెదరిన గువ్వవలె
    గమ్యమును చూపే నిను వేడుకొనగా
    నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి
    నీ వాత్సల్యమే నవ వసంతము
    నా జీవిత దినములు ఆద్యంతము
    ఒక క్షణమైన విడువని ప్రేమామృతము
    అత్యున్నతమైన కృపలతో
    ఆత్మఫలముల సంపదతో
    అతిశ్రేష్ఠమైన స్వాస్థ్యమును పొంది
    నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ
    నా హృదయార్పణ నిను మురిపించని
    నీ గుణాతిశయములను కీర్తించని
    ఈ నిరీక్షణ నాలో నెరవేరని

Komentáře • 73