Video není dostupné.
Omlouváme se.

పురుడు,మైల,సూతకం గురించి మీ ప్రశ్న మా సమాధానం

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2020
  • ఆర్యవైశ్య సంఘము
    పాతవూరు అనంతపురం.
    ~~~~~~~~~~~~~~~~~~
    ఓం శ్రీ వాసవాంబాయై నమః
    ఆర్యవైశ్య సంఘం పాత ఊరు అనంతపురం భక్త మహాశయులకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆశీస్సులు.
    అమ్మవారు మాకు ఇచ్చిన సంకల్పం మేరకు వాసవి జయంతి రోజున అనగా 02/05/2020 తేదీన దేవాలయంలో అమ్మవారికి జరిపిన పూజ ప్రత్యక్ష ప్రసారం తో ప్రారంభమైన మా VASAVIANS OF ANANTAPUR యూట్యూబ్ ఛానెల్ నాటినుండి నేటివరకు ఏన్నో ఆధ్యాత్మిక కార్యక్రమములు మరియు శ్రావణ,భాద్రపద మాసములలో వచ్చు పండుగల పూజా మరియు వ్రత విధానమును ఆడియో,వీడియో రూపములో ప్రసారము చేశినాము. దేశ విదేశాలలో గల భాక్తాదులు తిలకించి మరియు ఆచరించి వారి సంతోషాన్ని వ్యక్తపరచినారు. ఇందుకు
    నిదర్శనం 1300 మంది మా ఛానల్ సభ్యులుగా నమోదు చేసుకోవడం మరియు ఫణి గౌరీవ్రతమును 10 వేలమంది, జంధ్యాల పౌర్ణమిని 7 వేల మంది పైగా తిలకించి ఆచరించడము.
    అతి స్వల్ప కాలంలోనే అందరి మన్ననలు పొందడం మాకెంతో స్ఫూర్తిని మరియు ఉత్సాహాన్ని ఇచ్చింది.
    మన వ్యవస్థలో మనము ఆచరించవలసిన విధానములలో ముఖ్యంగా జనన మరణ విషయములో అనుసరిస్తున్న పురుడు మరియు సూతకం గురించి సందేహములను వేదపండితుల ద్వారా శాస్త్రోక్తంగా వివరించమని ఫోన్, మైల్,మెసేజ్ ద్వారా తెలిపినారు భక్తాదులు కోరిక మేరకు ఈ రోజు మేము ఈ కార్యక్రమమును దేవాలయ ప్రధాన అర్చకులు వేదపండితుడు శ్రీ గడియారం నాగ వెంకట శర్మ గారి చేత వివరించడం జరుగుచున్నది.
    మేము ఇచ్చిన మెసేజ్ మేరకు భక్తాదులు స్పందించి వారి వారి సందేహములను పంపినారు.
    ఆ విధముగా మాకు ఇప్పటివరకు వచ్చిన ప్రశ్నలన్నింటినీ ఏకీకృతం చేసి మా సంఘ సభ్యుల చేత అడిగించి సమాధానములను వీడియో రూపములో మీకు అందిస్తున్నాము.
    మీరందరూ తిలకించి మీబంధు మిత్రులకు ఈ వీడియో లింక్ ను పంపి సందేహ నివృత్తి చేసుకొనగలరు.
    ఈ కార్యక్రమమును నిర్వహించుటకు మాతో సహకరించిన మా సంఘ అధ్యక్షుడు సంధ్యావందనం బిరుదాంకితుడు శ్రీ పార్శo సత్యనారాయణ శెట్టి గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీ చిందలూరు శ్రీనివాసులు గారికి, ఆలయ ధర్మకర్త శ్రీ గర్జాల నాగరాజు గారికి అదనపు కార్యదర్శి శ్రీ శిరిగుప్ప కొండయ్యా గారికి మరియు ప్రత్యక్షంగా,పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాము.
    ఇట్లు-
    దూపకుంట్ల సాయినాథ్ గుప్త -
    ప్రధాన కోశాధికారి
    మరియు
    తొమ్మండ్ర నగేష్ గుప్త
    ఉప కోశాధికారి
    ఆర్యవైశ్య సంఘము
    పాతవూరు అనంతపురం.
    ~~~~~~~~~~~~~~~~~~

Komentáře • 17