ఏ మాటకామాట | బీసీల రాజ్యంలో వెలమ రెడ్లు | వెలమ రెడ్డి దొరల ట్రాప్ లో బీజేపీ ఎలా పడ్డది..?

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • #bccommunity #leadership #JanaAdhikaraSamiti
    ఏ మాటకామాట
    బీసీల రాజ్యంలో వెలమ రెడ్లు
    వెలమ రెడ్డి దొరల ట్రాప్ లో బీజేపీ ఎలా పడ్డది..?
    బీఅర్ఎస్ వెలమల పార్టీ అని,కాంగ్రెస్ రెడ్ల పార్టీ అని జగమేరిగిన సత్యమే కదా..!
    2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు బీసీలను పార్లమెంట్ కి పంపించిన బీజేపీ పార్టీ బీసీల పార్టీగా మారుతుందని ఆశపడ్డాం.
    బండి సంజయ్,ధర్మపురి అరవింద్,ఈటెల రాజేందర్, కే లక్ష్మణ్, లాంటి నాయకులు బీసీల కోసం కొట్లాడుతున్న క్రమంలో బీజేపీ పార్టీ రెడ్డి,వెలమ దొరల ట్రాప్ లో పడి బీసీ లను మర్చిపోతున్నది అనిపిస్తున్నది.
    వెలమ రెడ్డి దొరల ట్రాప్ లో బీజేపీ ఎలా పడ్డది..?
    ఏనాడు బీజేపీ గురించి ఆలోచించని,బీజేపీ జండా పట్టని,ఎన్నడు బీజేపీ ఐడియాలజీని అర్థం చేసుకోని వెలమ రెడ్లను ఎట్లా బీజేపీ పార్టీలో రాత్రికి రాత్రే చేర్చుకుంటునరు..!
    అత్యధికంగా బీసీలు వున్న మంచిర్యలలో మళ్లా వెలమ దొరకే టికట్టా? మున్నూరు కాపు పద్మశాలీల పెద్దపెల్లిలా రెడ్డెయ్యకు టికట్టా?
    ఆగస్ట్ 13న కోరుట్లలో జరిగిన పద్మశాలి యుద్ధభేరీ తదనంతరం కోరుట్ల నియోజకవర్గం నిక్కచ్చిగా పద్మశాలిలదేనని తేలిపోయింది.పద్మశాలిలు ఎంతో ఆశత,ఉత్సాహంతో ఉన్న దశలో రాత్రికి రాత్రే ఒక అనామకుడైన వెలమ దొరని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి బీజేపీ పార్టీ సిద్ధమవుతున్నదని వార్తలస్తున్నాయి.
    మొన్నటికి మొన్న పార్లమెంట్ లో బీసీలకు చట్ట సభల్లో 33% సీట్లు కేటయించాలని గొంతెత్తి అరిసిన బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు సిగ్గులేదు.ఆ పార్టీలు మాటలు తప్ప చేతలు ఉండవు. కానీ
    బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల తరహాలో సిగ్గులేకుండా బీజేపీ పార్టీ కూడా బీసీలను తోసి పుచ్చితే తెలంగాణ బీసీలు ఊరుకుంటారా...?
    వేములవాడ,సిరిసిల్ల,సిద్ధిపేట, గజ్వేల్,జగిత్యాల,కోరుట్ల నియోజకవర్గాలు వెలమ కారిడార్లు కాదు. ఇవి ముమ్మాటికీ పక్క బీసీ కారిడార్లు అని అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలె....!
    #bccommunity #leadership #politics #contestants #telangana
    #obc #obcreservation #OBC #brs #brsparty #bjp #bjptelangana
    #justice #justicetobc #Mudirajcommunity #unity
    #etelarajender #cmkcr #telanganapolitics

Komentáře •