చీమ కాకి నీతి కథ || Ant and crow Telugu grandma stories || 3D animated bedtime stories

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • చీమ కాకి నీతి కథ || Ant and crow Telugu grandma stories || 3D animated bedtime stories
    #చీమకాకినీతికథ #Antandcrow #Telugumoralstories
    **********చీమ-కాకి నీతి కథ **********
    ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టు వుండేది. ఆ చెట్టుకు వున్న కొమ్మమీద కాకి, చెట్టుకు వున్న తొర్రలో చీమ జీవిస్తూ ఉండేవి. కాకిది కాస్త దూకుడు స్వభావం అయితే, చీమ చాలా నెమ్మదస్తురాలు.. దేని గురించైనా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది. అవి రెండూ రోజూ ఉదయాన్నే లేచి వాటివాటి ఆహార వేటను కొనసాగించడంలో హడావిడిగా వుండేవి.
    చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేలమీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకునేది. దాన్ని చెట్టుక్రింద వరకూ మోసుకెళ్లి తినగలిగినంత తిని, మిగిలింది స్దావరంలో దాచి పెట్టుకునేది.
    కాకి మాత్రం హాయిగా, స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ కావుకావుమని పాటలు పాడుకుంటూ తిరుగుతూ వుండేది. పంటల చేలల్లోకి దొంగతనంగా వెళ్లి, తిన్నంత తిని.. పాడుచేయగలిగినంత పాడు చేసేది.
    ఒక్కోసారి రైతు చూసి వెంబడిస్తే.. తన వెంట అతన్ని అటూ ఇటూ పరుగులు పెట్టించి, అందకుండా గాల్లొకి రివ్వున ఎగిరిపోయి ఆనందించేది.
    ఒకరోజు చీమకు పెద్ద ఆహారపు గింజ కనిపించింది. దాన్ని చూస్తూనే అది ఆనందంలో మునిగిపోయింది.
    " హయ్ .. ఎంత పెద్దగా వుందో.. దీన్ని తీసుకెళ్లి భద్రంగా దాచుకుంటే నాకు చాలా రోజులకు సరిపోతుంది." అనుకుని ఆ గింజను లాక్కెళ్లసాగింది.
    చాలా నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఒక ఆహారపు గింజను లాగలేక లాక్కుంటూ వస్తున్న చీమను చూసి కాకి పకపక నవ్వసాగింది.
    చీమకు కోపం వచ్చి ‘ఓయ్.. పొగరుబోతు కాకీ! ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు?’ అని ప్రశ్నించింది.
    ‘‘నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది. నువ్వెంత, నీ ఆకలి ఎంత? ఎందుకు ఎప్పుడూ ఆహారాన్ని లాక్కువెళ్లి గూటిలో పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడుతుంటావు? నన్ను చూడూ, గాల్లో ఎగురుతూ, హాయిగా పాటలు పాడుకుంటూ, తిన్నంత తిని, అప్పుడప్పుడూ పంటలను పాడు చేసి, ఆ రైతును ముప్పుతిప్పలు పెట్టి ఎంత ఆనందం పొందుతున్నానో.. నీవూ అలా వుండవచ్చు కదా! ఇన్ని కష్టాలెందుకు..’ అన్నది.
    దానికి చీమ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్లి పోయింది.
    కోతలు పూర్తయి పంట అంతా రైతుల ఇళ్లకు వెళ్లిపోయింది.
    ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి. అడవి అంతా వర్షంతో ముద్దముద్ద అయిపోయింది. గూడు నేలకూలడంతో కాకికి ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు.
    అప్పుడది చీమ ఇంటికొచ్చి ‘మిత్రమా! వర్షంలో తడిసి పోతున్నాను. ఆకలికి చచ్చిపోతున్నాను. నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు. నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా ఇంత పెట్టు’ అని బ్రతిమాలింది.
    చీమ పకపక నవ్వి ‘వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను. ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను.’ అని చెప్పి లోపలికి వెళ్లిపోయింది.
    ఆ తర్వాత కాకికి తను చేసిన తప్పేంటో తెలిసి బుద్ది వచ్చింది.
    ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే.. " ముందుచూపు చాలా అవసరం."

Komentáře • 592