HD Revanna Cancels His Plans To Visit Hassan | No Sign Of Prajwal Revanna's Return From Abroad

Sdílet
Vložit
  • čas přidán 14. 05. 2024
  • కర్ణాటకను కుదిపేస్తున్న హాసన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక నిందితుడైన- MP ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ దొరక్క పత్యేక దర్యాప్తు బృందం-S.I.T తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. విదేశాల్లో తలదాచుకున్న ప్రజ్వల్ బుధవారం బెంగళూరుకు చేరుకుంటారని భావించినా.. ఆయన చివరి క్షణంలో తన విమాన టికెట్ రద్దు చేసుకున్నారని సిట్ అధికారులు గుర్తించారు. తన తండ్రి- మాజీ మంత్రి H.D రేవణ్ణకు జామీను లభించడంతో ప్రజ్వల్ బెంగళూరుకు వస్తారని భావించి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే.... సిట్ అధికారులు చాలా సేపు వేచి చూశారు. చివరి క్షణంలో ఆయన తన టికెట్ రద్దు చేసుకోవడంతో వెనుదిరిగారు. మ్యూనిచ్ నుంచి బుధవారం మధ్యాహ్నం బయలుదేరి, అర్ధరాత్రి పన్నెండున్నరకి ప్రజ్వల్ బెంగళూరుకు రావాల్సి ఉండగా.... విమానం టికెట్ ను రద్దు చేసుకున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ పెరుగుతోంది. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలంటూ వంద మందికి పైగా సాహితీవేత్తలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖరాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře •