అరిటాకు భోజనం | Traditional Food | Sai Charanam Aritaku Tiffins And Meals | Vijayawada | Food BooK

Sdílet
Vložit
  • čas přidán 12. 05. 2023
  • పరవళ్లు తొక్కే ప్రకృతి సోయగాల ప్రవాహంలో అందాల అరవిందముపై సాగిన ఈ పయనం ఆహ్లాద ప్రమోదమైంది.దుర్గమ్మ దీవెనలతో, కృష్ణమ్మ ఆశీస్సులతో వివిధ రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన విజయవాడ.మహా నగరంగా ఎదుగుతుంది.ఆంధ్ర ప్రదేశ్ నడిబొడ్డున ఉన్న ఈ పుణ్య పుడమితో రాష్ట్ర ప్రజలకు ఉన్న అనుబంధం విశిష్ఠమైనది.నా గమ్య గమనాన దిక్సూచి అయిన బెజవాడ నగరాన ప్రసిద్ధి చెందిన ఆహార పదార్థాలు గురించి కార్యక్రమాలు చిత్రీకరణ చేయాలన్నది నా చిరకాల కాంక్ష.కావున విజయవాడ రావడం నాకెంతో ఆనందాయకం.విజయవాడలోని గవర్నర్ పేటలో గల సాయి చరణం అరిటాకు భోజన శాల గూర్చి ఈ ప్రసారం. ఆహార శాల పేరు నేపధ్యానికి అనుగుణంగా ఇక్కడ అరిటాకులో ఆహార పదార్థాల వడ్డన చూస్తేనే తృప్తిగా ఉంటుంది.ఆహార నాణ్యత తెలియవస్తుంది. ఆకలిని మరింతగా పెంచుతుంది.ఇక్కడ ఆహార ఆస్వాధన నాకు ఓ జ్ఞప్తిగా ఉంటుంది.నిర్వాహకులు లీలా కృష్ణ ప్రసాద్ గారితో ముచ్చటిస్తూ భోజనం చేశాను. ఆహారం గురించి సవివరంగా మీతో పంచుకుంటాను కార్యక్రమ పరంపరలో.ముద్ద పప్పు,ఆవకాయ, నెయ్యి ఈ పద పొందిక ఎంత ఆత్మీయంగా ఉందొ.అవి కలగలిపి తిన్నప్పుడు ఆహారం అంతే అనురాగం అందించింది.ఫలం యొక్క పులుపుదనం రవ్వంత, పచ్చి మిరపకాయ కారం కాస్తంత అలా మామిడికాయ పప్పుతో సంప్రదాయ రుచి లభించింది.పులుపు లేకుండా బఠాని వినియోగంతో సద్గుణ రుచికర అనుభూతి పంచింది వంకాయ కూర.పచ్చి పులుసు,ముద్ద పప్పు,నెయ్యి ఈ ఆస్వాధన వర్ణనాతీతం ఆ కమ్మని రుచి మాటల్లో చెప్పలేం.పెరుగు పులుసులో పచ్చి మిరపకాయల వినియోగం మరింతగా లేకపోవడం నాకు బాగా నచ్చిన విషయం.చక్కని రుచి.సంపూర్ణ ఆస్వాధన కుండలో తోడు బెట్టిన కమ్మటి పెరుగుతో సొంతమైంది.
    #foodbook
    #vijayawada
    #food
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Komentáře • 128

  • @satyanarayanap3494
    @satyanarayanap3494 Před měsícem +2

    ధన్యవాదాలు... మీ తెలుగు ఉచ్చరణ మరియు వివరణ ప్రసన్ననియం..

  • @satyanarayanap3494
    @satyanarayanap3494 Před měsícem +2

    నీకు వెయ్యి నమస్కారాలు స్వామి... మీ తెలుగు వెంటనే బుర్ర పాడవుతుంది అసలు

  • @namgirisuresh2004
    @namgirisuresh2004 Před rokem +24

    మీరు తెలుగు భాష మరియు మీ స్వరం చాలా మధురంగా ఉంటుంది.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      ధన్యవాదాలు సురేష్ గారు

  • @Vikram-md8qv
    @Vikram-md8qv Před rokem +14

    అన్న....మీ గొంతు,మీ తెలుగు భాష ఉచ్చారణ చాలా బాగుంది

  • @rangapuramharinathyadav8278

    ఆంగ్ల పదాలు తక్కువగా వాడుతూ మీరు వివరించిన విధానం అద్భుతం తమ్ముడు 👏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem +1

      ధన్యవాదాలు హరినాథ్ గారు

    • @srikanthamirapu4811
      @srikanthamirapu4811 Před rokem +2

      చక్కటి వీడియో పెట్టేరు. మధురమైన తెలుగు పదాలు వాడుతూ చేసిన ఈ వీడియో మాకు బాగా నచ్చింది.😮

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem +1

      ధన్యవాదాలు శ్రీకాంత్ గారు..

    • @DJINDUSTRIES8
      @DJINDUSTRIES8 Před rokem +2

      Mee vakhchaturyam chala Adhbhutham

  • @punyakotikumarpunyakotikum4169

    మాది విజయవాడ నిజంగా బాగుంటుంది....👍

  • @venky4275
    @venky4275 Před rokem +3

    బాగుంది మొన్న తిన్నా

  • @adileepkumarsingh6487
    @adileepkumarsingh6487 Před rokem +6

    ARITAAKU BHOJANAM IS VERY FAMOUS IN VIJAYAWADA ALSO

  • @mtamsunil2053
    @mtamsunil2053 Před rokem +1

    Meru telugu bhasha chala chakkaga matladutunnaru

  • @opaleshwarcherupalli6284

    Hello, లోకనాథ్ గారు ,మీ వీడియోస్ బాగున్నాయి, విజయవాడలో అరిటాకు భోజనం బాగున్నది, మేము ఉండేది హైదరాబాద్ మేము విజయవాడ వస్తే తప్పకుండా రుచి చూస్తాము, కానీ ఒకటి, మీరు లోకేషన్ మ్యాప్ పిన్ పెడితే బాగుంటది ,నేను విజయవాడ వచ్చినప్పుడు ఈజీగా అడ్రస్సు దొరుకుతది,thank you

  • @venkatakrishnaraoduggirala9438

    Your pure Telugu language speech is excellent. Your respect to mother tongue is divine.

  • @fightalonee
    @fightalonee Před rokem +11

    My favourite veg meals. I went every Saturday to eat. Only problem is parking. Food and quality excellent

    • @harinandini6394
      @harinandini6394 Před rokem

      Where in Governorpet Is This Vegetarian Hotel? These Days Swarna Palace Has Introduced Non Veg In Its Menu

    • @fightalonee
      @fightalonee Před rokem

      @@harinandini6394 it's purely vegetarian hotel. Near besent road, opposite street of axis Bank

  • @mchandrasekharaazaad
    @mchandrasekharaazaad Před 8 měsíci

    చాలా బాగుంటుంది ఆ హోటల్ లో. .. బీసెంట్ రోడ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఉంది. . మాల్ లో షాపింగ్ ఆ హోటల్ లో ఫుడ్ మాకు రెగ్యులర్ గా వుంటుంది... విజయవాడకు వస్తే వదిలేదే లేదు...

  • @asuryaprakash1242
    @asuryaprakash1242 Před rokem +26

    తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ,తెలుగు భాషలో మాట్లాడుతూ,తెలుగు ఆహారం మాకు పెట్టకుండా తింటూ ఉన్న మీకు మా వందనాలు 😂

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem +2

      రండి..సూర్య ప్రకాష్ గారు భోజనం చేద్దాం.

    • @asuryaprakash1242
      @asuryaprakash1242 Před rokem +2

      తమరు అలా పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది మీకు నేను కృతజ్ఞుణ్ణి

    • @swathivizag2603
      @swathivizag2603 Před rokem +1

      Telugu rastrame okate andi ...Andhra rastam anthe

    • @chinnurittu6596
      @chinnurittu6596 Před rokem

      ​@@LOKFOODBOOK1qqq1.

    • @mesrigv
      @mesrigv Před 11 měsíci

      ​@@swathivizag2603telugu rashtram...andhra rashtram okate ? What do u mean

  • @ravienterprises8696
    @ravienterprises8696 Před měsícem

    You are a very good food blogger.

  • @baddurisivasomireddy1652

    సార్, మీ వాయిస్ ఓవర్ చాలా చాలా బాగుంది, మీ స్థాయికి తగిన కార్యక్రమాలు అంటే మీరు మట్టడుతూ వివరించే ప్రయత్నం చేస్తే, చాలా భవిష్యత్ వుంది. బాగా సక్సెస్స్ అవుతారు. కేవలం మీ అస్థి ఏంటంటే మీ భాష, వాక్ చాతుర్యం, మధురమైన గొంతుక, మీరుగా యాంకరింగ్ లేదా వాయిస్ ఓవర్ ఇచ్చే అత్యున్నత కార్యక్రమాలు ఎంచుకోండి. ప్రముఖుల ఇంటర్వ్యూ లతో మొదలు పెడితే బాగుంటుంది.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      హృదయ పూర్వక ధన్యవాదాలు శివ సోమిరెడ్డి గారు.

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr Před rokem +1

    Wow super super bro 👌👌👌

  • @shivaprasad1561
    @shivaprasad1561 Před rokem +1

    Bro you r amazing. Telugu talliki muddhu biddavi. The way u explained very unique

  • @bhavyaandjyothsnasyoutubec6102

    Looking yummy 🤤😋🤤😋

  • @user-jg2wc5ut1h
    @user-jg2wc5ut1h Před rokem

    దేవలోకం భాష చాలా బాగుంది

  • @annadath69
    @annadath69 Před rokem +1

    Very good telugu explanation sir

  • @kailapavani7286
    @kailapavani7286 Před 11 měsíci

    Aritaku bhojanam ante naku chala estam food chala bagundidhi akkada super

  • @suribabu5654
    @suribabu5654 Před rokem +1

    Owner garu chala manchivaru food chala baguntundhi

  • @satishpalukuri3918
    @satishpalukuri3918 Před rokem

    Vedio coostey vijayawada ventane ravalanipistude chakkanayena bojanam very nice

  • @jhansithatavarthy3481

    Good and tasty veg meals

  • @vijayasaradhi6561
    @vijayasaradhi6561 Před rokem +1

    Mee Telugu basha chala baagundi

  • @yaani12345
    @yaani12345 Před rokem +1

    ikkada food taste supperrr untadi❤❤❤

  • @merigasrinivas701
    @merigasrinivas701 Před rokem +1

    Super

  • @ravikiran2810
    @ravikiran2810 Před rokem +2

    Food is marvelous. Worker's also super service.But parking is not their.

  • @madhugoud6610
    @madhugoud6610 Před rokem +2

    Awesome Loknath Anna ❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem +1

      ధన్యవాదాలు తమ్ముడు

  • @krishnam3768
    @krishnam3768 Před rokem +1

    Papurna maina .telugu..lo cheputhu paripurna maina bhojananni bhujistu chala ckkaga chepparu

  • @MNR-creations.
    @MNR-creations. Před rokem

    Super ❤❤

  • @prakashsudhaveni5458
    @prakashsudhaveni5458 Před rokem

    Mi thelugu basa spatamga undhandi .thankyou

  • @karunakarkarra8709
    @karunakarkarra8709 Před rokem +2

    Supar andi

  • @harikishore7968
    @harikishore7968 Před rokem

    Nice bro

  • @cerryramanamma7460
    @cerryramanamma7460 Před 5 měsíci

    Super gaa telugu lo chepputhunaru

  • @nagendramudarakola2095
    @nagendramudarakola2095 Před 3 měsíci

    మీరు చేసే ప్రతి వీడియో కి లొకేషన్ లింక్ కూడా పెడుతూ ఉంటే బాగుంటుంది కొంతమందికి వీడియోలో అడ్రస్ అర్థం అవ్వక పోయిన ఆ లింక్ ద్వారా రూట్ మ్యాప్ పెట్టుకొని వెళతారు

  • @ammacookies7257
    @ammacookies7257 Před rokem +1

    Hai bro me videos chala chusanu. Your way of explanation and terminology is sooo different bro. Food looks delicious bro. Thanks for sharing this video bro.

  • @srkcomputers7145
    @srkcomputers7145 Před 4 měsíci

    Me video evala chusanu andi chala baga cheptunaru meeru me basha meru chepe vedanam chala bagundi nen IFE CHANEL baga chusthanu andi andulo india lo ni ani place s lo best hotels gurinchi chupistharu meru telugu lo chala bagaundi me chanel...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před 4 měsíci

      హృదయ పూర్వక ధన్యవాదాలు అండి

  • @naresha9592
    @naresha9592 Před rokem +1

    Music ❤❤❤

  • @krishnazzrupu901
    @krishnazzrupu901 Před rokem +2

    Vijayawada is best for every thing

  • @mnaresh4465
    @mnaresh4465 Před rokem +1

    Anna 👌👌👌

  • @manikumartavva9740
    @manikumartavva9740 Před rokem +5

    Chala bagunttadhi bro ikkada bojanam ghee yanttakavalanna vasttaru.

  • @jathingm6322
    @jathingm6322 Před rokem

    loknath your videos are so good brother

  • @rkvlogs....5085
    @rkvlogs....5085 Před rokem

    Nice video bro...

  • @naresha9592
    @naresha9592 Před rokem

    ❤❤

  • @satyakotidasari8999
    @satyakotidasari8999 Před rokem

    Super bro

  • @SrijaiRake
    @SrijaiRake Před rokem

    Anna meru Telugu lo reviews cheptuntay edho tayliyani santhosham meku dhanyavadhalu

  • @seshasai1757
    @seshasai1757 Před rokem +1

    Perayyamess Bojanam video cheyyandanna

  • @PavanKumar-vs8sd
    @PavanKumar-vs8sd Před rokem +1

    Plz do lot of videos in VIJ

  • @Chowdary1989
    @Chowdary1989 Před rokem

    👌👌👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      వాసు చౌదరి గారు👍

  • @kotakoti8467
    @kotakoti8467 Před rokem

    Maa abhimana aharashala nenu 4 sarlu tinnanu andi Aritaku

  • @parimianilanil1122
    @parimianilanil1122 Před rokem +2

    Super video anna.... traditional ❤❤❤❤😊😊😊😊

  • @Babujaganpawan
    @Babujaganpawan Před rokem

    Best veg meals in Vijayawada

  • @seshasai1757
    @seshasai1757 Před rokem

    Perayyamess Bojanam
    Governor Peta
    Vijayawada
    Video cheyyandanna

  • @srinivasaraju6857
    @srinivasaraju6857 Před rokem +1

    అనంత శ్రీరామ్ లాగా అచ్చ తెలుగులో బాగా మాట్లాడవు అబ్బాయ్😊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem +1

      ధన్యవాదాలు శ్రీనివాసరాజు గారు

  • @kaverich5663
    @kaverich5663 Před rokem

    లీలా Prasad garu🙏.. మీరు మా hyderbad lo kuda start చేస్తారా

  • @ramprasadchowdary323
    @ramprasadchowdary323 Před rokem

    Hai Brother how are you
    Nice video Brother

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      ధన్యవాదాలు రామ్ ప్రసాద్ గారు. నేను బావున్నాను. మీరు ఎలా ఉన్నారు

  • @bheemarajurampalli8413

    Sir location yekkada vijayawadalo

  • @swamysuggu1430
    @swamysuggu1430 Před rokem

    వైటచ్ డిస్టెన్స్ రైల్వే స్టేషన్

  • @chaitanyachaitu3763
    @chaitanyachaitu3763 Před rokem +4

    Thanks anna meru vijawada ki vachindhuku

  • @kondababu7693
    @kondababu7693 Před rokem

    vankaaya kura nu gujju kura anaru bro. gujju ante gravy ani ardam. vankaya vepudu, vankaya iguru laga vankaya gujju kura annaaru leelaprasad garu

  • @velladurganaresh5214
    @velladurganaresh5214 Před rokem +1

    Telugu language good 👍

  • @rajarao3565
    @rajarao3565 Před 7 měsíci

    Online deliverey undaa

  • @syamsundar5601
    @syamsundar5601 Před rokem

    Address యెక్కడ

  • @gowrikatakam323
    @gowrikatakam323 Před rokem

    క్రిష్ణప్రసాదు ఈ వీడియోలో హనుమయ్యగారిని పద్మగారి ని చూపిసైతే బావుంటుంది.

  • @Aksharaanweshi963
    @Aksharaanweshi963 Před rokem

    ఆ మైకు లేకుండా వినిపిస్తుంది, మీరు ఆ మైకు పెట్టి హోటల్ ఓనర్ ని ఇబ్బంది పెడుతున్నారు, remining అంతా బాగుంది

  • @rajeemadhu7865
    @rajeemadhu7865 Před rokem

    Address pls

  • @kattavenkaiah1563
    @kattavenkaiah1563 Před rokem

    Address

  • @brahmanandamclips1900
    @brahmanandamclips1900 Před 2 měsíci

    భోజనం పార్సిల్ రైల్వే స్టేషన్ కి డెలివరీ ఇస్తారా?, ఎక్స్ట్రా పేమెంట్ కావాలంటే ఇస్తాము ట్రైన్ జర్నీ కోసం డెలివరీ కావాలి

  • @bharatreddy86
    @bharatreddy86 Před rokem +1

    Next time when you post program requesting you to kindly share location link in description.

    • @kavithapotti5196
      @kavithapotti5196 Před rokem

      Maday sir vijayawada lo rajtowers paka streetlo ma hotal sai charan aritaku antay avaryna chayptaru famus

  • @Raviteja-or5rv
    @Raviteja-or5rv Před rokem

    Hai

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 Před rokem +1

    కమ్మదనాన్ని మీరు తిన్నారు,మేము విన్నాము మీరు మాట్లాడే తెలుగులో....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @rajashekarprathipati403

    ADdress plz

  • @ipd7577
    @ipd7577 Před rokem

    Me Telugu bagundi kani sahajanga evvaru news readers laga matladaru

  • @balakodela1692
    @balakodela1692 Před rokem

    Recipes kooda telusukondi as part of videos. You will get more subscribers

  • @shekinahanand2137
    @shekinahanand2137 Před rokem

    Anamika Stories voice narrator meere kada

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      నేను కాదు ఆనంద్ గారు.

  • @naaggarajueditor3175
    @naaggarajueditor3175 Před rokem

    Inni rakalu thine Kalam poyindhi

  • @jaganmohanrao.vissarapu

    Hi Anna

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc Před rokem +5

    Veg ఆంధ్రా భోజనం అందరూ ఆస్వాదిస్తారు......
    Non vegitarians కూడా.
    ఇలాంటి hotels ఎక్కువ ఉండవు .... ఎందుకనో😊

  • @someswararaomadala8800

    There is no feelings on face

  • @satyanarayanadv5752
    @satyanarayanadv5752 Před rokem +1

    Sir food book number pettandi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      చెప్పండి సత్యనారాయణ గారు

  • @appireddyappireddy2065

    First flight

  • @raghuram8485
    @raghuram8485 Před rokem +1

    location address in vijayawada

  • @pavanreddy6666
    @pavanreddy6666 Před rokem

    Baboi gaali undadhu ra babu

  • @vedavidyalayamu
    @vedavidyalayamu Před rokem

    మొబైల్ నంబర్ తెలుపగలరు