క్రైస్తవ స్పందన Ep - 83 (Christian response)

Sdílet
Vložit
  • čas přidán 3. 06. 2024
  • 1. 3:59 - లేఖనాలలో త్రిత్వమైయున్న దేవుడు మాత్రమే కాకుండా ఇంకా అనేకులు దేవుడు అని పిలువబడ్డారు. ఆ మాట అన్యదేవతల గురించి వాడబడిందా? వివరించగలరు.
    2. 6:05 - పత్రికల్లో ప్రారంభ వచనాలలో వందనాలు చెప్తున్నప్పుడు గానీ ముగింపు వచనాలలో ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు గానీ తండ్రి కుమారుల ప్రస్తావన కనబడుతుంది, పరిశుద్ధాత్మ ప్రస్తావన ఉండదు. ఎందుకని?
    3. 7:06 - ఆశీర్వచనాలలో త్రిత్వంలోని ముగ్గురి గురించీ ప్రస్తావించడం అంటే ముగ్గురికీ ప్రార్థించడమే. కానీ మనం సాధారణంగా పరిశుద్ధాత్మకు ప్రార్థన చెయ్యము. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
    4. 10:29 - నేను యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తూ, త్రిత్వమైయున్న దేవునికి ప్రార్థన చేస్తున్నాను అని అనుకోవచ్చా?
    5. 12:07 - అపొస్తలులు తండ్రీకుమారపరిశుద్ధాత్మలను ఉద్దేశించే ప్రార్థన చేశారు కానీ వాళ్ళు పరిశుద్ధాత్మకు నేరుగా ప్రార్థించినట్లు ఎక్కడా కనిపించదు. కాబట్టి మనం కూడా నేరుగా పరిశుద్ధాత్మకు ప్రార్థన చెయ్యకూడదు అని అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు?
    6. 13:17 - ముగింపు ఆశీర్వచనాలు ప్రార్థనే అని చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. దాని గురించి కాస్త స్పష్టత ఇవ్వగలరా?
    7. 14:27 - ప్రార్థన త్రిత్వంలోని ఒక్కరికి చేసినా త్రిత్వమైయున్న దేవునికే చేస్తున్నాము అని అర్థం చేసుకోవాలని మీరు చెప్పారు కదా. మరి దైవిక కార్యాల విషయంలో కూడా ఒక్కరు చేసిన పనిని త్రిత్వమైయున్న దేవుడు చేసాడు అన్నట్లుగానే అర్థం చేసుకోవాలా?
    8. 18:08 - కీర్తన 51:11లో "... నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము" అని దావీదు భక్తుడు అంటాడు. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి నివాసం ఉండడానికి అనుగ్రహించబడ్డాడు అని అనుకోవడానికి దావీదును ఉదాహరణగా తీసుకోవచ్చా?
    9. 20:36 - అభిషేకించబడటానికీ పరిశుద్ధాత్మను పొందుకోవడానికీ సంబంధం ఉందా? అభిషేకించబడటం అంటేనే పరిశుద్ధాత్మను పొందుకోవడమా? సమ్సోనులో నుండి బలము తొలగిపోయెను అన్న మాటలను ఆధారం చేసుకొని, అతనిలో నుండి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు అని అనుకోవచ్చా?
    10. 23:15 - లూకా 11:13లో "పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను" అని ఉంటుంది. మనం రక్షించబడిన దినమే ఉచితంగా దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు కదా. మరలా మనం అడగడం ఏంటి?
    11. 26:00 - సౌలును విశ్వాసిగా చూడాలా? అవిశ్వాసిగా చూడాలా? అలాగే కొత్త నిబంధనలో కేవలం విశ్వాసులకు మాత్రమే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతున్నాడు కానీ పాత నిబంధనలో ఒక వ్యక్తి విశ్వాసి కాకపోయినా కేవలం పరిచర్య నిమిత్తం పరిశుద్ధాత్మ అనుగ్రహించబడే అవకాశం ఉండిందా?
    12. 29:26 - కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తికీ అనుగ్రహించబడ్డాడు, ఎప్పటికీ అతన్ని విడిచి వెళ్ళిపోడు; కానీ పాత నిబంధనలో కొన్నిసార్లు పరిశుద్ధాత్మ వచ్చాడు, కొన్నిసార్లు వెళ్ళిపోయాడు. ఈ రెండింటినీ ఎలా అర్థం చేసుకోవాలి?
    13. 33:29 - మత్తయి 7లో యేసు ప్రభువు నామమున అద్భుతాలు చేసినవారు, సాతాను శక్తి చేత అటువంటి కార్యాలు చేశారు అని అర్థం చేసుకోవాలా?
    14. 34:48 - మత్తయి 12లో "31.కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు" అని ఉంటుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
    15. 42:27 - తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతి వింతైన త్రిత్వ సిద్ధాంత తప్పుడు అవగాహన - Modalism : తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే మరణించి తిరిగి వెళ్లి పరిశుద్ధాత్మగా వచ్చాడు. దీని గురించి వివరించగలరు.
    16. 48:13 - తండ్రీకుమారపరిశుద్ధాత్మలు సమానమా? అని ఒకరు విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని అడిగినప్పుడు "నన్ను పంపిన తండ్రి నాకన్నా గొప్పవాడు అని యేసు క్రీస్తే అన్నాడు గనుక యేసు క్రీస్తు తండ్రి కంటే తక్కువవాడు" అని సమాధానం చెప్పాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
    17. 51:34 - విజయ్ ప్రసాద్ రెడ్డి గారి లాగా చాలామంది యేసుక్రీస్తు తండ్రి కన్నా తక్కువవాడు అన్న అవగాహనతో ఉంటున్నారు. అలాంటివారు రక్షించబడ్డారా?
    Q & A Session
    On 28 - 05 - 2024

Komentáře •