మామిడి కొమ్మలు కత్తిరించడం ఎలా//వెదురు కుప్పం చిత్తూరు

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • వెదురు కుప్పం మండలం బోమ్మాయి పల్లి గ్రామం నందు మామిడి కోతలు అనంతరం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులపై రైతులకు చిత్తూరు ఉద్యాన శాఖ వారు రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ కాయలు కోసిన వెంటనే కొమ్మలు కత్తిరింపులు చేపట్టాలని తెలిపారు.కొమ్మలు కత్తిరింపుల ఆవశ్యకతను దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఏ విధంగా కొమ్మలు కత్తిరింపులు చేయాలి,ఎరువులు వేయాలి, దున్నకాలు చేపట్టాలి అనే అంశాలు రైతులకు తెలియజేశారు. రైతులు కొమ్మలు కత్తిరింపులు చేసిన వెంటనే ఎరువులు వేసి నీటి తడులను ఇవ్వాలి. పచ్చరొట్టే పైరు వేసి అది పూత వచ్చిన సమయంలో దున్నడం వలన సూక్ష్మ పోషకాలు చెట్టుకు అంది పూత బాగా వచ్చి, పిందె బాగా పట్టే ఆస్కారం వుంటుంది. దీని వలన కలుపును కూడా తగ్గుతుంది. మామిడి చెట్లకు నీళ్లు కట్టే రైతులు చెట్లు మొదల్లో కాక మూడు అడుగుల దూరం వదిలి ఎరువులు వేసి నీటిని పెట్టాలన్నారు .. అక్టోబర్ 15 వ తేదీ పైన దున్నకాలు, , నీరు తడులు ఆపేయాలి. మరి డిసెంబర్ 15 తర్వాత ఒక తడి ఇవ్వాలి. మామిడి చెట్లకు అధికంగా రసాయని మందులు కొట్టడం వలన రైతులకే నష్టమని పంటలు సరిగా రావని తెలిపారు. తగిన మోతాదులో ఎరువులు వేయడం వల్ల పూత బాగా వచ్చి దిగుబడి వస్తాయని తెలిపారు. రైతులకు మామిడి కొమ్మలు ఎలా కత్తిరించాలనేది ప్రాక్టికల్ గా మామిడి తోపులో చేసి చూపించారు. డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ 5 ఏకారాలలోపు వారికి డ్రిప్ మీద 90 శాతం, స్ప్రింక్లర్లకూ 55 శాతం, 5-10 ఏకరాలలోపు రైతులకు డ్రిప్ మీద 70 శాతం,స్ప్రింక్లర్లకూ 45 శాతం రాయితీ లో ఇస్తున్నారు. కొత్తగా డ్రిప్ కావాలి అనే రైతులు వారి దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల సిబ్బంది దగ్గర వారి పేర్లను తప్పని సరిగా నమోదు చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారి వింధ్య, వ్యవసాయ అధికారి వనిత, రైతు సేవా కేంద్రాల అధికారులు,మండల మామిడి రైతులు తదితరులు పాల్గొన్నారు

Komentáře •