DACHANNA DARILO THYAGALA PATA | NERNALA KISHORE | GADDAR |

Sdílet
Vložit
  • čas přidán 27. 05. 2024
  • DACCHANNA DARILO THYAGALA PATA | NERNALA KISHORE | GADDAR | #NERNALACREATIONS
    Special Thanks to
    ADMS Shivaji
    Gaini Gangaram
    Dr Thogaru Vidyasagar
    Concept & Direction - Nernala Kishore
    Lyrics - Vemuganti Adinarayana & Nernala Kishore
    Singer - Nernala Kishore
    Music - ML Raja
    Choreography, DOP & Editing - Shanthi Raju
    DI - Srinivas
    Posters - Sagar
    Drone - Srinivas
    Makeup - Krishna, Nagesh
    Costumes - Sailu
    Casting - Nernala Kishore
    GADDAR (ADMS-Shivaji)
    SRIKANTHCHARY - Naresh
    POLICE KISTANNA,Wife - Rajitha Nammindla Rajeshwaro
    WARANGAL SUMAN - Anthadupula Aravind
    SIRIPURAM YADAIAH - Varikupalla Rakesh
    PALAMURU SUVARNA - Sriharshitha
    Suvarna thandri - Gainigangaram
    Suvarna thalli - Sumalatha
    YADIREDDY - Orsu Srinivas
    #nernalakishore #gaddar #nernalacreations #jaitelangana
  • Zábava

Komentáře • 872

  • @udaykumarkr8092
    @udaykumarkr8092 Před 14 dny +15

    తెచ్చుకున్న తెలంగాణ ఆగం అయ్యేటట్టు ఉంది
    నీ పాటకు వందనం తెలంగాణ అమరవీరులకు వందనం తల్లి తెలంగాణకు వందనం

  • @rajannacholleti3143
    @rajannacholleti3143 Před měsícem +81

    మట్టి పరిమళం మా నేర్ణాల కిషోర్ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమే ఊపిరిగా జీవించిన కిషోర్ ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి నాకు తెలిసి మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఎన్నో లాటి దెబ్బలు తిన్నాడు ఎందుకోసం ఆంటే జై తెలంగాణ అంటే నహి తెలంగాణా అన్నారు ఆంద్ర పోలీసు అధికారులు తీసుకొని పోయి చంచల్ గూడ జైలు వేసారు అయినా అలుపెరుగని పోరాట పటిమ గల వ్యక్తి నేర్ణాల కిషోర్

    • @NernalaCreations
      @NernalaCreations  Před měsícem +1

      Thank you so much

    • @KGRUSATeluguVlogs
      @KGRUSATeluguVlogs Před měsícem +2

      Yes....Anna nenu, inko 70 mandimi Chanchalgooda Jail mates mi...
      --- Girendar Rao, Srigadha, Rajanna Siricilla
      From America

  • @orugantisikindergoud8227
    @orugantisikindergoud8227 Před měsícem +55

    రావాలి మళ్లీ వీర తెలంగాణ పోరాటం ఈ పాటను చూసి మారాలి జనం తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలి

  • @saiprasadreddyVlogs
    @saiprasadreddyVlogs Před měsícem +96

    మరొకసారి తెలంగాణ అమరవీరులను యాదిలోకి తెచ్చిన నేర్నాల కిషోర్ గారికి ధన్యవాదములు.
    ఈ పాట చిత్రీకరణ మా గ్రామంలోని గుట్టపై జరిగినది.

  • @mahendarchinnu8631
    @mahendarchinnu8631 Před měsícem +38

    అన్న మీ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటన్నాయి... తెలంగాణ అమర వీరులకు మీ పాటతో నిజమైన నివాళి అన్న..... జోహార్ తెలంగాణ అమర వీరులకు ✊✊✊

  • @ponnalavinaykumar9772
    @ponnalavinaykumar9772 Před 5 dny +2

    తెలంగాణ వచ్చిన బ్రతుకులు మారలేదు. అమరులైన అమర వీరుల కోసం మళ్ళీ పోరాటం చేద్దాం.భవిష్యత్తు కోసం 😢

  • @muthyalarameshramesh8548
    @muthyalarameshramesh8548 Před měsícem +27

    అన్నా మొదటిసారి బార్డర్ లో సైనికుడా పాట విని మీ అభిమానిని అయ్యా ఇప్పుడు తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరుల మీరు రచించి పాడిన ఈ పాట జనులందరికీ ఇన్స్పిరేషన్ అవుతుంది

  • @jaganchina813
    @jaganchina813 Před 8 dny +4

    లాల్ సలాం బ్రదర్ ఇంత మంచి పాట రాసినందుకు నిజంగా మీకు పాదాభివందనాలు

  • @ramraj8785
    @ramraj8785 Před měsícem +66

    Instagram lo song chusi vachinavalu like chyndi

  • @vikramgandla3871
    @vikramgandla3871 Před měsícem +13

    తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను మరల గుర్తుకు చేస్తున్న ఈ పాటకు నా వందనాలు ….జోహార్ తెలంగాణ అమర వీరులకు🙏🏾

  • @gangarapuyadagirigoodmesse4274
    @gangarapuyadagirigoodmesse4274 Před měsícem +17

    ఓ అమర వీరులరా...... తెలంగాణ ఉద్యమ కళాకారులారా.... మీకీవే.. 🚩 red... 🙏.. సెల్యూట్ జోహార్

  • @RamakrishnaBoddupally
    @RamakrishnaBoddupally Před měsícem +20

    నిరుద్యోగ తెలంగాణ ధూంధాం ఉద్యమ కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి ✊✊✊✊✊

  • @drdurgaprasadrao1188
    @drdurgaprasadrao1188 Před měsícem +11

    చరిత్రలో నిలిచిపోయే పాట. తెలంగాణ అమరులకు అంకితం చేసిన నేర్నాల గారికి అభినందనలు. ❤

  • @sandeepkumarchinthakunta3250
    @sandeepkumarchinthakunta3250 Před měsícem +9

    చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి సాహిత్యంతో మా ముందుకు వచ్చారు కిషోర్ అన్న...
    జోహార్ అమరవీరులకు... 🪔🙏💐

  • @kantenaveen7503
    @kantenaveen7503 Před měsícem +9

    జోహారు తెలంగాణ అమరవీరులరా 🙏 మీ పాటతో తెలంగాణ అమరుల ప్రాణ త్యాగాలను మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించరు అన్న 🙏😢

  • @MeriAnthadupula
    @MeriAnthadupula Před měsícem +22

    ఇదిరా బై తెలంగాణ పాట అంటే

  • @djsanthoshrathnapoor
    @djsanthoshrathnapoor Před měsícem +44

    మా కామారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కిష్టయ్య గారికి పాదాభివందనం విద్యార్థుల త్యాగఫలమే ఈ తెలంగాణ రాష్ట్రం🥹

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 Před měsícem +15

    తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల మీద పాట ని, వాళ్ళు తెలంగాణ కోసం ఎలా చనిపోయారో కళ్ళకి గుచ్చినట్టుగా గుర్తుండిపోయేలా మాట,పాట రూపంలో చూపించిన మట్టి పరిమళం మా నేర్నాల కిషోరన్న💐 కి & అల్ టీమ్ కి💐✊ నా కలాబీ వందనాలు 🙏🙏🙏

  • @rajannacholleti3143
    @rajannacholleti3143 Před měsícem +14

    కంగ్రాట్స్ కిషోర్ తెలంగాణ అమరుల కుటుంబాలకు ఈ ఆల్బమ్ అంకితం జై తెలంగాణ జై తెలంగాణ జై కిషోర్

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 Před měsícem +45

    ఈ పాట వింటుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేనెందుకు ఒక అమరున్ని కాలేకపోయాను అనే బాధ నాలో కలిగింది నర్నెల కిషోర్ అన్న మీకు వందనం మీ పాటకు వందనం

  • @Everything_Telugu_official
    @Everything_Telugu_official Před měsícem +10

    ఎందరో విద్యార్థులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వల్ల ప్రాణాలను త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ...అమర వీరులకు జోహార్లు...తెలంగాణ అవతరణ దినోత్సవ శభాకాంక్షలు జై తెలంగాణ జై జై తెలంగాణ ✊

  • @konkaravi599
    @konkaravi599 Před měsícem +23

    ఈ 10 సంవత్సరాల కాలంలో అమరవీరుల మర్చిపోయా పరిస్థితి వచ్చింది కిషోర్ అన్న తెలంగాణ అమరవీరుల త్యాగాల గురించి పాట రాసి మా కళ్ళు తెరిపించిన వన్న నీకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-xt5yd7fj3u
    @user-xt5yd7fj3u Před měsícem +32

    మళ్ళి 10ఏళ్ల తరువాత అమరవీరులని గుర్తు చేసింది ఈ పాట super మీ అందరికీ

  • @nandyadarajender
    @nandyadarajender Před měsícem +9

    తెలంగాణ రాష్ట్ర కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు జోహార్లు జోహార్లు అర్పిస్తూనము
    కిషోర్ అన్న చాలా రోజుల తరువాత మరచిపోని పాట రసినారు అన్న
    మీకు మీ బృందం కు ప్రత్యేక వందనలు అన్న 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @parshuram7004
    @parshuram7004 Před měsícem +6

    అన్నా అమర వీరుల ప్రాణత్యాగాలకు నివాళులు అర్పిస్తు నీవు పాడిన ఈ పాట అద్భుతం అన్నా..జోహార్ తెలంగాణా అమరవీరులారా ..జై తెలంగాణా

  • @mohanpappula
    @mohanpappula Před měsícem +6

    Telangana kosam pranatyagam chesina amaraveerulu joharlu 🙏
    Kishor anna paata ML Raja gari music 👏👏👏👍💐

  • @Prashanthbathini1212
    @Prashanthbathini1212 Před měsícem +13

    తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులు అందరికీ జోహార్🎉🎉🎉

  • @aravindyadavcreations353
    @aravindyadavcreations353 Před měsícem +46

    ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఈ రోజు ప్రజల నోట తెలంగాణ అనే మాట రావడం లేదు... ఈ నాటి పాలనలో..

  • @user-fe4zo7wh6i
    @user-fe4zo7wh6i Před 25 dny +4

    జోహార్ తెలంగాణ అమరవీరులకు 🙏

  • @sannapureddy6205
    @sannapureddy6205 Před měsícem +12

    నేర్నాల కిషోర్ అన్నకు ఉద్యమాభి వందనాలు తెలంగాణ జన సమితి మీ సహచర మిత్రుడు మీ అన్నపురెడ్డి శ్రీనివాస్ ఆనాటి అశ్వరావుపేట నియోజకవర్గం ఇంచార్జ్ జై నేర్నాల

  • @raparthichandrashekhar9673
    @raparthichandrashekhar9673 Před měsícem +9

    జోహార్ తెలంగాణ అమరవీరులకు, నేర్నాల కిషోర్ అన్నకు ఉద్యమమాభీవందనాలు.

  • @narasimhasimha7055
    @narasimhasimha7055 Před 3 dny +3

    Joharlu telangana Amaraveerulaku జోహార్లు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babupunya1647
    @babupunya1647 Před měsícem +7

    తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలర్పించిన అమరవీరుల మీద ఒక మంచి పాట పాడినందుకు చాలా సంతోషం మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కొరకు ధూంధాం కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించారు తెలంగాణ ఉద్యమంలో మీ పైన పోలీసు కేసులు ఎన్ని అయినా కూడా ఎదుర్కొన్నారు కానీ కొందరి స్వార్థ రాజకీయాలకు మీరు బలైపోవడం చాలా బాధాకరం కెసిఆర్ గారు తెలంగాణ అమరవీరులను మరియు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వారిని మర్చిపోవడం ఇప్పుడు అతని పతనానికి నాంది అయింది. తెలంగాణ అమరవీరుల మీద ఒక మంచి ఉద్యమ పాట పాడినందుకు కిషోర్ అన్న గారికి స్పెషల్ థాంక్స్

  • @user-ec1kc3iq4g
    @user-ec1kc3iq4g Před 20 dny +2

    Mana telangana kosam pranathyagam chesina prathi okariki na sirasavanchi padhabhivandhalalu johar telangana veruklaku johar johar✊✊

  • @kiranjanampally6835
    @kiranjanampally6835 Před měsícem +6

    ఈ పాట ప్రజలకు వినిపించినందుకు నిర్మల కిషోర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు

  • @Telugu_cricket_fantasy
    @Telugu_cricket_fantasy Před 17 dny +3

    Literally Nernala Kishore Garu Your Voice Is Goosebumps…🙏

  • @sadanandamchoppari6935
    @sadanandamchoppari6935 Před měsícem +2

    Chaala rojula tarvata Kishore anna song excellent em icchina runam teerchukolem ❤

  • @avishettybhagyaraju7683
    @avishettybhagyaraju7683 Před 24 dny +2

    అన్నా, అమరులను తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగడం లేదు....ఎన్నో కష్టాలు పడి సాధించుకున్న తెలంగాణా పాలన నేడు ఉద్యమ ద్రోహుల చేతికి వెళ్ళింది,అభివృద్ధి ఆగింది....ఉద్యమ వీరులకు రెడ్ సెల్యూట్

  • @SSCVLOGS1456
    @SSCVLOGS1456 Před měsícem +2

    Nice song nenu aethe eroju motham e song chusthuna

  • @SrinivasSathyavathi
    @SrinivasSathyavathi Před měsícem +5

    తెలంగాణా అమరులకు పాదాభి వందనాలు 🙏🏻🙏🏻🌹🌹జై తెలంగాణా ✊🏻🔥🔥🔥

  • @polepakavishwateja8098
    @polepakavishwateja8098 Před měsícem +6

    ఎన్నో సామాజిక తెలంగాణ ఉద్యమ గీతాలు రాసిన నేర్నాల కిషోర్ అన్న రచన దారిలో అమరుల మృతి గీతం చాలా చాలా బాగుంది అన్న పాట చాలా హిట్ అవుతది అన్న

  • @Udayaarts
    @Udayaarts Před měsícem +5

    తెలంగాణ కోసం అమాయకులు ప్రాణత్యాగలు చేశారు. ఈరోజు వాళ్ల కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలియదు.కానీ మర్చిపోయిన వాళ్ళను మళ్ళీ గుర్తు చేశారు..పాట ఆట అద్భుతం..
    Thank You...

  • @Songsnews1
    @Songsnews1 Před 20 dny +2

    పాట చాలా బాగుంది అన్న జై తెలంగాణ ..అమరవీరులకు జోహార్లు

  • @senapathitelugutv7978
    @senapathitelugutv7978 Před 29 dny +3

    జోహార్ తెలంగాణా అమరవీరులకు.... జోహార్

  • @kvraatapata2682
    @kvraatapata2682 Před měsícem +5

    నేర్నాల కిషోర్ అన్న పాట అద్భుతం
    తెలంగాణ అమరవీరులు త్యాగాలు గుర్తుండే విధంగా ఈ పాట రచించి చిత్రీకరించారు ఈ పాట తెలంగాణ అమర జీవులు స్ఫూర్తిగా నిలుస్తుంది
    జోహార్లు తెలంగాణ అమర జీవులకు ✊️🌹🙏✍️

  • @gangadhararishikanth5686
    @gangadhararishikanth5686 Před 27 dny +2

    Entha ayina no one can replace Gaddhar 🙏🙏

  • @easamyadagiri8914
    @easamyadagiri8914 Před měsícem +5

    అన్నా నీకు వందనం ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలి తెలంగాణ మేల్కొని అనుకుంటున్నాం కానీ అది అది నిద్రపోతూనే ఉంది

  • @sudhakarsudhi7955
    @sudhakarsudhi7955 Před měsícem +2

    తెలంగాణ అమరవీరులకు జోహార్లు మరిచిన అమరవీరులను మళ్లీ నీ గొంతు ద్వారా అద్భుతంగా గుర్తుచేసిన నేర్నాల కిషోర్ అన్నకు గద్దర్ అన్న వేషధారణలో ఉన్న అన్నయ్యకు మంచి నృత్యాన్ని అందించిన డాన్సర్ లకు ఈ పాటను అందించిన టీం సభ్యులందరికీ తెలంగాణ ఉద్యమా వందనాలు✊✊✊✊💐💐💐✊✊

  • @user-vq5kt3cn7b
    @user-vq5kt3cn7b Před 27 dny +2

    Telangana poradi thechukunam kani prajala akamsha neraveraledhu prajaswamya Telangana kosam poradadham✊✊✊

  • @Science_599
    @Science_599 Před měsícem +3

    Edhe paata mana Telangana yudha nowka gadara anna paduthe inko level ki poiedhi 🙌🙌 kani ippudu aa gonthu mana madya ledhu

  • @swamydanamapally1568
    @swamydanamapally1568 Před měsícem +5

    అన్న అమరవీల యాదిలో చాలా బాగా వచ్చింది
    తెలంగాణ ఉద్యమాన్ని చూపించావు
    నువ్వు చేసిన ఉద్యమం మళ్లీ మొదలవుతుంది ❤🙏🙏

  • @dharnilimbadri3249
    @dharnilimbadri3249 Před měsícem +4

    అనాడు దొరలా బనిస్త్రవం నుండి మొదలు అయినా తెలంగాణ అమరవీరుల త్యాగం తెలంగాణ ఏర్పాటు అమరులైన వీరులకు జోహార్లు జోహార్లు 🙏🙏✊🚩 థ్యాంక్స్ నెర్రల కీషోర్

  • @bheemraothatra4124
    @bheemraothatra4124 Před měsícem +5

    చాలా బాగుంది అన్నగారు మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టే విధంగా

  • @thejomahima-prathyakshatha
    @thejomahima-prathyakshatha Před měsícem +2

    God bless you mama
    Ni pata dvara Telangana prajalaku rajakiya chaithanyam ravali.
    Endaro pranam thyagam chese Telangana sadiste dongala palu aenadi
    Miru mi pata dvara Malli vudyamam cheyali ani korukuntunanu ❤
    Kani na

  • @ravitejamanthena8946
    @ravitejamanthena8946 Před měsícem +5

    తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేశారు 🙏🏻
    జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్

  • @velpulabalaraju520
    @velpulabalaraju520 Před 12 dny +1

    నెర్నాల కిషోర్ అన్నా పాట విన్నంత సేపు మరో లోకం లో ఉన్నట్లు ఉంది రక్తం మరుగుతుంది అమరవీరులకు జోహార్లు.

  • @sanjeevaburugu6482
    @sanjeevaburugu6482 Před měsícem +3

    తెలంగాణ ఉద్యమ అమరుల త్యాగాన్ని ,వీరత్వాన్ని ,అమరత్వాన్ని,చారిత్రాత్మకంగా చిత్రీకరించిన..నేర్నాల క్రియేషన్ టీమ్ కి ..కలాభివందనాలు,🙏🙏🙏🙏ఉద్యమాభివందనాలు✊✊✊✊...... కల్మషం లేని,భాధ్యత మరువని ప్రముఖ కవి గాయకులు కిషోరాన్నకి ధన్యవాదాలు....

  • @ravikumarvodyarapu5006
    @ravikumarvodyarapu5006 Před měsícem +4

    అమరులను యాది చేసిన కిషోరన్నకు ధన్యవాదాలు.

  • @tharungoudgollapalli5438
    @tharungoudgollapalli5438 Před měsícem +3

    Nernala kishor anna intha chakkaga evaru varnicha ledu amaravirula gurinchi jai Telangana amaravirulaki joharlu

  • @MAHESHVLOGS.4283
    @MAHESHVLOGS.4283 Před měsícem +3

    మీపాటవింటే కానిరు వస్తుందిసార్ అమర వీరులకి నా జోహార్లు😢 జై తెలంగాణ🙏

  • @sathishpanneru319
    @sathishpanneru319 Před měsícem +4

    మల్లితెలంగాణ ఉద్యమాన్ని కళ్లముందు చూపించావుకంటి నిరుతెపించావు సూపర్బ్రో జై తెలంగాణ

  • @Polandboy12345
    @Polandboy12345 Před měsícem +3

    Naku 2days nundi malli udyamam start aindia annattu anipistundi anna patha rojulu gurthochinnay anna
    Jaiiiiiii telangaanaaaaa🎉

  • @naveenbhukya5891
    @naveenbhukya5891 Před 24 dny +6

    మల్లి పాత రోజులు వస్తాయి wait చేయండి

  • @maheshkatapogu6664
    @maheshkatapogu6664 Před měsícem +5

    సూపర్ సాంగ్ అన్న తెలంగాణ అమరవీరులను యాది చేసినవ్ జోహార్ తెలంగాణ అమరవీరులకు 😭😭😭😭😭😭

  • @sudhakarchathala5969
    @sudhakarchathala5969 Před měsícem +7

    తెలంగాణ లోగో లా అమరవీరుల స్థూపం పేటలి

  • @bollarapusunitha1263
    @bollarapusunitha1263 Před měsícem +3

    Song chala bagundi mamayya, song vintunte chanipoena vaari family's gurthochae, mana Telangana prajala kosam chala mandi prana thygam chesaru,veeri thygam maruvalenidi,marupu ranidi.inka elanti manchi manchi songs chala paadalani manaspurthiga korukuntunna mamayya.

  • @arellimusic9697
    @arellimusic9697 Před měsícem +4

    రచన గానం నెర్నల కిషోర్ అన్న గారు చాలా బాగుంది పాట ఇలాంటి గొప్ప పాటలు ఇంకెన్నో రాసి జనుల ముందుకు తేవాలని కోరుకుంటున్న మీ యాక్షన్ అన్న మరి ఇందులో నటించిన ప్రతిఒక్కరు చక్కగా నటించారు కొరియో గ్రాఫర్ రాజు సూపర్

  • @bollampallyaugustinsurendr670
    @bollampallyaugustinsurendr670 Před měsícem +3

    అన్న తెలంగాణా ఉ్యమాన్ని ముందుండి నడిపించిన మీకు ఉద్యమ వందనాలు తెలంగాణా అమరులను త్యాగాలను గుర్తు చేసినందుకు మళ్ళీ తెలంగాణా ఉద్యమ పోరాటం లో పాల్గొన్నజ్ఞాపకాల గుర్తుకచ్చి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న సొమ్మోకడిది సోకోకడిది ఐపోయింది,నిజంగా అన్యాయం చేశారు, మీ పాటలే తెలంగాణా ఉ్యమాలకు ఊపిరిపోసింది, ఆరోజులను గుర్తు చేసినందుకు మీపాదాలకు వేలవేల వందనాలు కిషోరన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @shobhanyadav9106
    @shobhanyadav9106 Před měsícem +232

    మళ్ళీ ఉద్యమం చేసే రోజు వస్తది... రెడీగా ఉండండి

    • @NernalaCreations
      @NernalaCreations  Před měsícem +12

    • @kiranpendyala3354
      @kiranpendyala3354 Před měsícem +8

      Start aindi annaa

    • @shobhanyadav9106
      @shobhanyadav9106 Před měsícem

      @@kiranpendyala3354 మొత్తం తెలంగాణ చేయాలి brother

    • @chanducompitativeexams4184
      @chanducompitativeexams4184 Před měsícem +9

      Kachithanga chedham

    • @pendordadirao3835
      @pendordadirao3835 Před měsícem +16

      రేవంత్ రెడ్డి తన స్వార్థం కోసం తీసిన పాటను వ్యతిరేకిస్తున్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి

  • @ShivayadavYadav2526-zl5gb
    @ShivayadavYadav2526-zl5gb Před měsícem +3

    జై తెలంగాణ.....తెలంగాణ తెచ్చిపెట్టిన అమరవీరులకు నా తలని నేలతల్లికి ఆనించి నివాళి అర్పిస్తూ,,,,అందరికీ మరోసారి ఈ పాట ద్వారా గుర్తు పెట్టుకోవాల్సినది....నేటి రాజకీయాలని కాదు ఎందరో త్యాగాలు, ప్రాణార్పనల ద్వారా మాత్రమే ఏర్పడింది తెలంగాణ.... ఏ రాజకీయాల ద్వారా కాదు మన విద్యార్థుల పోరాటాల ద్వారా ఏర్పరినది మన తెలంగాణ...దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి....ఆ అమరుల త్యాగాలను ప్రతి ఏటా గుర్తు చేసుకొని వారికి నివాళి అర్పించాలి.....జై తెలంగాణ.....జోహర్ అమరవీరులకు....✊❤️💐

  • @Siddharthstudios251
    @Siddharthstudios251 Před měsícem +4

    తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమ స్మృతులను గుర్తు చేసింది ఈ పాట సూపర్ అన్న జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరుల కు

  • @gaddamuday6832
    @gaddamuday6832 Před měsícem +5

    అన్న పాట అమరుల త్యాగాలను మల్లి గుర్తుచేసింది ఏమిచ్చిన తీరనది మిరుణం
    జోహార్లు తెలంగాణ హమరవీరులకు

  • @singingstartharak152
    @singingstartharak152 Před měsícem +2

    Suuuuuuuuperrrr suuuuuuuuperrrr suuuuuuuuperrrr suuuuuuuuperrrr suuuuuuuuperrrr suuuuuuuuperrrr suuuuuuuuperrrr song Jai Telangana johar Amara veeerulaku johar johar

  • @mamidishekar6752
    @mamidishekar6752 Před měsícem +3

    జోహార్ తెలంగాణ అమరవీరులకు కిషోర్ అన్నకు తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ ఇవ్వాలి

  • @ch.praveenchinna5564
    @ch.praveenchinna5564 Před měsícem +2

    Super song Anna vinte kanlalo nunchi kanillu agadam ledhu super

  • @SSCVLOGS1456
    @SSCVLOGS1456 Před měsícem +2

    Miru gaddar chupichinaduku tq anna

  • @prabhakarpendyala2773
    @prabhakarpendyala2773 Před měsícem +6

    తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ త్యాగమూర్తుల ను మరొకసారి గుర్తుండే విధంగా చేసినందుకు కిషోర్ అన్నకు కృతజ్ఞతలు 🙏 కాన్సెప్ట్ అద్భుతం

  • @praveenmudhiraj7412
    @praveenmudhiraj7412 Před měsícem +3

    నేరెళ్ల కిషోర్ నీ పాట అద్భుతం నీ పాట ఒక ఉద్యమం అన్న

  • @kodivenkatdancemaster6314
    @kodivenkatdancemaster6314 Před měsícem +3

    అన్న తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు జోహార్లు ఈ పాటలు మాకు అవకాశం కల్పించినందుకు జీవితాంతం నీకు రుణపడి ఉంటాము నీకు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు మళ్లీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచే టట్టు చేసిన మీకుతెలంగాణ కళాకారులందరూ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం జోహార్ తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాం థాంక్యూ కిషోర్ అన్న అద్భుతమైన పాటను తీసి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచిన అందుకు నిజంగా జన్మ ధన్యమైపోయింది థాంక్యూ సో మచ్ కిషోర్ అన్న

  • @Santhosh-yr2cm
    @Santhosh-yr2cm Před 6 dny +2

    🎉aamaravirula andriki mayokka joharulu 🎉

  • @bheeshmaambedkar333
    @bheeshmaambedkar333 Před měsícem +5

    JAI TELANGANA JOHAR JOHAR TELANGANA AMARA VEERULAKU JOHAR

  • @panikeraraju8684
    @panikeraraju8684 Před 29 dny +2

    అమరుల త్యాగానికి చక్కని పాట

  • @kirankumar5545
    @kirankumar5545 Před měsícem +2

    Super anna malli udhyamani gurthu chesharu

  • @CHINTUYADAV66269
    @CHINTUYADAV66269 Před 24 dny +11

    🙏శ్రీకాంత్ చర్య లాంటి వారు ఎందరో తెలంగాణ పోరాటం కోసం వల ప్రాణాలు త్యాగము చేశారు వాళ్లకు నా జోహారు జై తెలంగాణ ❤

  • @BabuRao-hi7uh
    @BabuRao-hi7uh Před měsícem +21

    ఈ ప్రజా పాలన లో జై తెలంగాణ అనొటోడే లేదు ఇది మన కర్మ....

    • @NernalaCreations
      @NernalaCreations  Před měsícem

      Jia Telangana ✊

    • @naikabittu2256
      @naikabittu2256 Před měsícem

      Jai Telangana ✊✊

    • @malleshgoud4046
      @malleshgoud4046 Před měsícem

      తెల్లార్లు అందరి బదులు నువ్వే అనరాదా మీకు మైండ్ మోకాళ్లలో ఉంటది...అరె ఆహులే తెలంగాణ అనక పోతే జరిగే నష్టము ఏమి ఉండవు...కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో మీ లాగానే చిల్లర చిల్లర చెయ్యరు..

  • @muluguranifolk9267
    @muluguranifolk9267 Před měsícem +2

    తెలంగాణ కోసం అమరులైన అమరవీరులను వారి చావును కళ్ళకు కట్టినట్టు మీ పాటలో చూపించినందుకు మీకు నా కళాభివందనాలన్నా పాట వింటుంటే కన్నీళ్లు ఆగలేదన్న అమరవీరులకు జోహార్లు అన్నా మీరు అంటే నాకు చాలా గౌరవం వరంగల్ శ్రీనన్న ఒక ప్రోగ్రాం కోసం తాడ్వాయి పిల్లలతో హనుమకొండ లో ఒక ప్రోగ్రాం చేసినప్పుడు అక్కడ నేను ఏడువాకు ఏడవకు నాయి బిడ్డో అన్న పాట పాడాను మీరు ఆ పాట విని నన్ను చాలా బాగుంది చెల్లి అన్నారు నాకు చాలా సంతోషం అనిపించింది అన్న మిమ్మల్ని కలుసుకునే రోజు ఎప్పుడు వస్తాదో విమలక్కను జై రాజన్నను యశ్పాల్ సర్ సోమన్నను స్వర్ణక్కను దరువు అంజన్న ను నల్గొండ గద్దర్ అన్నాను ఇంకా పెద్ద పెద్ద కళాకారులను కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ లో కలవడం జరిగింది మిమ్మల్ని కలుసుకునే రోజు ఎప్పుడు వస్తాదో అన్న

  • @ApsNps
    @ApsNps Před měsícem +1

    Telangana charithranu kallaku kattinattu chupinchina Kishor Anna ku Lal Salam

  • @sampathsampath6415
    @sampathsampath6415 Před měsícem +4

    Ma Amma e video lo undadam chala happy undhii love uh Amma ❤❤❤❤❤😊😊😊😊

  • @Divyagoud442
    @Divyagoud442 Před měsícem +2

    Song vintunte goosebumps vasthunai ✊✊

  • @actorappy
    @actorappy Před měsícem +2

    పాట చాలా బాగుంది అన్న, 👌👌👌

  • @KGRUSATeluguVlogs
    @KGRUSATeluguVlogs Před měsícem +3

    Good song Anna... Johar Amarularaa..
    Jai Telangana

  • @battiniprakash7245
    @battiniprakash7245 Před měsícem +2

    మంచి పాట అందించిన కిషోర్ గారికి వందనాలు

  • @abhilashkomirishetty487
    @abhilashkomirishetty487 Před měsícem +2

    Jai Telangana Johar Amarvirulu Johar Anna super song

  • @NarsingRaoAvarakonda
    @NarsingRaoAvarakonda Před měsícem +2

    అన్న మీ ఇ పాట ఎందరో తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తూ చాలా బాగా పాడారు అన్స మీ ఇ పాట ఎప్పటికీ మా గుండెలో నిలిచి పోతుంది జై తెలంగాణ

  • @PrasadPrasad-bt9oe
    @PrasadPrasad-bt9oe Před měsícem +5

    ఎంతో మంది అమరవీరులు బలిదానం చేస్తే వచ్చిన తెలంగాణ మళ్లీ Delhi కల్ల కింద పడింది వల్ల ప్రాణం కి విలువ లేకుండా పోయింది మళ్లీ జై తెలంగాణ ✊😌

  • @vinodghazi3200
    @vinodghazi3200 Před měsícem +2

    Superb song anna...amarulaku vamdanam

  • @chittimillanarayana4623
    @chittimillanarayana4623 Před měsícem +2

    Good song, Joharlu Amarulaku

  • @oddennayadav4874
    @oddennayadav4874 Před měsícem +2

    ఉద్యమ కవి గాయకులు అభ్యుదయ భావాలు గల సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఎందరో ఉద్యమం కళాకారులు కంచాల్లో వెతుకు లైన నేర్నాల కిషోర్ అన్న 🙏
    భవిష్యత్ తరాలు అమరుల త్యాగాలను గుర్తుంచుకునే విధంగా
    పాటలోని పాత్రధారులు ఒకరికి మించి ఒకరు అద్భుతంగా చేశారు ముఖ్యంగా ఇందులో
    అమరుల స్థూపం గద్దర్ పాత్ర చాలా బాగా హైలెట్ గా నిలిచాయి .
    మొత్తానికి పాట ద్వారా మరొకసారి తెలంగాణ ఉద్యమ కాలాన్ని గుర్తు చేసావ్ అమరుల త్యాగాలు సజీవంగా ఉండాలంటే ఇలాంటి ఇంకా
    ఎన్నో పాటలు రావాలి
    కిషోర్ అన్న కలానికి గళానికి ధన్యవాదాలు అమరులకు జోహార్లు✊️✊️✊️💐💐💐

  • @ravijerupothulu2026
    @ravijerupothulu2026 Před měsícem +2

    నిర్మల కిషోర్ అన్నగారికి ధన్యవాదములు ఉద్యమ వందనాలు.... తొలి దశ మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు విప్లవ జోహార్లు... ఆనాటి వారి త్యాగాన్ని ఒకసారి గుర్తు చేసి గుండెలు బరువెచ్చలాగా చేసినా కిషోర్ అన్న గారికి ధన్యవాదాలు వారి స్ఫూర్తి వారి ఉద్యమ బాట ఎక్కడికి పోదు.. తెలంగాణ యువకుల గుండెల్లో పదిలంగా ఉంటుంది... తెలంగాణ అమరవీరులకు జోహార్లు జోహార్లు.. మన ఉద్యమ స్ఫూర్తిని గౌరవించి తెలంగాణ ఇచ్చిన సోనియ అమ్మకు పాదాభివందనాలు ✊✊💐💐🙏🙏

  • @srikanthgadaboina8848
    @srikanthgadaboina8848 Před měsícem +6

    తెలంగాణ అమరవీరులకు ఈ పాట అంకితం కిషోర్ అన్నకు తెలంగాణ అమరవీరుల తరపున ధన్యవాదాలు