శ్రీ సాయి సచ్చరిత్ర లో పాము, కప్ప కథ జరిగిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా?

Sdílet
Vložit
  • čas přidán 13. 03. 2021
  • షిరిడి సిరులు // Shiridi Sirulu Ep 26 || శ్రీ సాయి సచ్చరిత్ర లో పాము, కప్ప కథ జరిగిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా? అక్కడ ఉన్న వీరభద్ర స్వామి ఆలయంలో మీ కోరిక తీరుతుందా? లేదా !తెలుసుకోవచ్చు // Shiridi SaiBaba Story // SaiLeela || సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడంగెను. "ఒకనాడుదయము ఉపాహారము ముగించిన తరువాత వాహ్యాళికి పోయి యొక చిన్న నది యొడ్డున చేరితిని. అలసిపోవుటచే నచట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి, హాయిగా కూర్చుని యుంటిని. అచట చెట్లనీడలున్న కాలిత్రోవ బండిత్రోవలు రెండును కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప యొకటి బెక బెక లాడుట వింటిని. చెకుముకిరాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణీకుడు వచ్చినాప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో నాహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నా కందజేసెను. కప్ప బెక బెక మనుట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలిసికొన గోరెను. ఒక కప్ప తన పూర్వ జన్మపాపఫలముననుభవించుచున్నదని చెప్పితిని. గతజన్మలో చేసినదాని ఫలము నీ జన్మలో ననుభవించి తీరవలయును. దానినిగూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును బీల్చి నాకందజేసి, తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి యరచుచుండెననియు గతజన్మలో రెండును దుర్మార్గులేగాన, ఈ జన్మయందు గతజన్మయొక్క పాపము నీశరీరములతో ననుభవించు చున్నవనియు చెప్పితిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్దపాము ఒక కప్పను నోటితో బట్టుకొని యుండుట చూచెను. అతడు నావద్దకు వచ్చి 10, 12 నిముషములలో పాము కప్పనుమ్రింగునని చెప్పెను. నేనిట్లంటిని. "లేదు. అట్లు జరుగనేరదు. నేనే దాని తండ్రిని (రక్షకుడను). నేనిచటనే యున్నాను. పాముచేత కప్ప నెట్లు తినిపించెదను? నేనిక్కడ ఊరకనే యున్నానా? దాని నెట్లు విడిపించెదనో చూడు." చిలుము పీల్చిన పిమ్మట, మేమా స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్నుకూడదగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీదపడి కరచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు బోయి యిట్లంటిని. "ఓ వీరభద్రప్పా! నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపపడుట లేదా? నీవు సర్పజన్మ మెత్తినప్పటికిని వాని యందు శత్రుత్వము వహించి యున్నావా? ఛీ, సిగ్గు లేదా! మీ ద్వేషములను విడచి శాంతింపుడు."
    తరువాత జన్మలో ఆ లోభి మధురాపట్టణములో నొక బ్రాహ్మణకుటుంబములో పుట్టి వీరభద్రప్పయను పేరనుండెను. అతని భార్య పూజారి కొమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరి యని పేరు పెట్టిరి. డుబ్కీ మందిరపు గొరవ యింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్న బసప్ప యని నామ మిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరుచుగా వచ్చుచుండెను. నావద్ద కూర్చుండి మాట్లడుచు చిలుము పీల్చెడివాడు. అతని కొమార్తె గౌరి కూడ నా భక్తురాలు. ఆమే త్వరగా నెదుగు చుండెను. ఆమె తండ్రి వరునికై వెదకుచుండెను. ఆ విషయమై చీకాకు పడనవసరము లేదనియు, నామె భర్త తానై వెదకుకొని వచ్చుననియు నేను చెప్పితిని. కొన్నాళ్ళకు వీరభద్రప్పయను ఒక బీద బ్రాహ్మణబాలుడు భిక్షకై పూజారి యింటికి వచ్చెను. అతడుకూడ నా భక్తుడయ్యెను. ఏలన వానికి పిల్లను కుదిర్చితినని నాయందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈజన్మలో కూడ ధనముకై మిగుల తాపత్రయ పడుచుండెను. నా వద్దకు వచ్చి యాతడు కుటుంబముతో నుండుటచే తన కెక్కువగా ధనము వచ్చునట్లు చేయుమని బతిమాలుచుండెను.
  • Zábava

Komentáře • 36

  • @ramadevirao9069
    @ramadevirao9069 Před 5 hodinami +1

    Om Sai Ram
    🙏🙏🌹🌹🌷🌷🌹🌹🙏🙏🙏

  • @nunnanagasankari2285
    @nunnanagasankari2285 Před 3 lety +1

    Thanque very much sister baba vari entho viluvaina vishayalu cheptunnaru evanni chustunnappudu,vintunnappudu matalalo cheppalemu santoshamga undi.mammulanu babaku daggara chestunnamduku Danya vadalu.sakshattu babane tana charitranu chebutunnatlu,memu kuda akkade undi babanu chustunna anubhuti kalugutundi sister baba ante naku pranam.nsku baba vari meeda unna Prema ,bhakti rettimpu avutunnatlu exactly Swapna darsanamunu kaligincharu baba vari. Om Sai Sri Sai jaya jaya Sai.jai bholo satchidanandha samarda sadguru sainath Maharaj ki Jai.

  • @advitha7719
    @advitha7719 Před 3 měsíci

    Om sairam 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @jansirani6612
    @jansirani6612 Před 2 lety

    Om sai ram 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
    Thank you akka ❤️

  • @dushyanthkumar7326
    @dushyanthkumar7326 Před 3 lety +1

    Sai sai sai

  • @ShivaJohnCena
    @ShivaJohnCena Před 2 lety

    Om Sai Ram 🕉️

  • @nshekar7941
    @nshekar7941 Před 3 lety

    Om sai ram,,🙏🙏🙏🙏🙏

  • @kiranmayimedisetti334
    @kiranmayimedisetti334 Před 2 lety

    Om Sairam 🙏🙏🙏🙏

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 Před 10 měsíci

    Om sai ram

  • @krishnakondaka9974
    @krishnakondaka9974 Před 3 lety

    Iam greatful to saitv

  • @lakshmikumari7461
    @lakshmikumari7461 Před 2 lety

    Om Sai ram

  • @badetimonika7042
    @badetimonika7042 Před 3 lety

    Thq so much

  • @ismartchinnuchannel1398

    🙏🙏🙏🙏🙏🙏

  • @S22M24
    @S22M24 Před 3 lety +1

    Om sai nathaya namaha 🌷🌷🙏🙏🙏🙏🙏

  • @polireddypavani2792
    @polireddypavani2792 Před 3 lety +2

    Om Sairam 🙏🙏🙏

  • @harikrankran6721
    @harikrankran6721 Před 3 lety

    🌺🌿 Om Sai 🙏 Om Sai 🙏 Om Sai 🙏 Om Sai 🙏 Om Sai 🙏 Om Sai 🙏 Om Sai 🙏 Om Sai 🙏 Om Sai 🙏🌿🌺

  • @nireeshavaranasi
    @nireeshavaranasi Před 3 lety +1

    Thanq for valuable info.sai tv😊

  • @medummanjuladevi8253
    @medummanjuladevi8253 Před 3 lety

    Yentho manchi vishayaalu choopinchaaru sai tv vaaru 🙏🏽🙏🏽🙏🏽

  • @vemulabindupriyankasaisong8545

    Very thanks, om sai ram

  • @sibbyalasurendra5253
    @sibbyalasurendra5253 Před 3 lety

    Om sai sree sai Jaya Jaya sai 🙏🙏🙏

  • @komalathaparavada961
    @komalathaparavada961 Před 3 lety +1

    Thanku for valuable information...

  • @ramananelluri7278
    @ramananelluri7278 Před 3 lety

    Om sai Sri Sai jai jai sai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nalinisudhani2779
    @nalinisudhani2779 Před 3 lety

    Om Sai Ram 🙏

  • @jyothidulla292
    @jyothidulla292 Před 3 lety

    Ohm Sairam 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @pavanithupili1457
    @pavanithupili1457 Před 3 lety

    Om Sairam 🙏

  • @vijenderreddy5045
    @vijenderreddy5045 Před 3 lety +3

    Om sai ram 🌹🌹🌹🙏🙏🙏

  • @jyothimarrapu988
    @jyothimarrapu988 Před 3 lety

    Om sri sai ram 🙏🙏🙏🙏🙏

  • @sandhyaguntupalli6957
    @sandhyaguntupalli6957 Před 3 lety

    0m sai raja ram

  • @vaidyula2013
    @vaidyula2013 Před 3 lety

    Jai sai ram..how much distance from shiridi?

  • @nagarajyamtokala7620
    @nagarajyamtokala7620 Před 3 lety

    Om Sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasrao3134
    @srinivasrao3134 Před 3 lety +1

    Om sai ram

  • @kethanalakshmi7802
    @kethanalakshmi7802 Před 3 lety

    Om Sai Ram 🙏

  • @triveninimmagadda1490
    @triveninimmagadda1490 Před 3 lety

    Om sai ram