పత్తి సాగులో లక్ష్మా రెడ్డి జయభేరి || Success Story of Cotton Cultivation || Karshaka Mitra

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    పత్తి సాగులో లక్ష్మా రెడ్డి జయభేరి || Success Story of Cotton Cultivation || Karshaka Mitra
    వర్షాధారంగా పండించే వివిధ పంటల్లో పంటల్లో పత్తి ప్రధమ స్థానంలో వుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న ఈ వాణిజ్య పంట సాగులో బి.టి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత రైతులు విజయకేతనం ఎగురవేస్తున్నారు. పత్తి నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకునే పంట. అధిక వర్షాలను సైతం అధిగమిస్తుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన సందర్భాల్లో ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని రైతులు నమోదుచేస్తున్నారు. నీటి పారుదల కింద 15 నుండి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ప్రస్థుతం మద్ధతు ధర ఆశాజనకంగా వుండటంతో పత్తి సాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు.
    తెలంగాణ రాష్టం పత్తి సాగులో దేశంలో రెండవ స్థానంలో నిలుస్తోంది. ఖరీఫ్ లో వర్షాధారంగా 50 లక్షల ఎకరాలకు పైగా సాగవుతూ... మొత్తం విస్తీర్ణంలో 40 శాతం భూభాగాన్ని ఆక్రమించింది. ఆముదం, అపరాలు, నూనెగింజల పంటలకంటే వర్షాధారంగా పత్తి సాగు తమకు అన్నివిధాలుగా లాభిస్తోందని రైతు లక్షా రెడ్డి చెబుతున్నారు. నల్గొండ జిల్లా, చందంపేట మండలం, ముడిదండ్ల గ్రామానికి చెందిన ఈ రైతు గత 20 సంవత్సరాలుగా పత్తి సాగు చేేస్తూ, ఎకరాకు 7 నుండి 14 క్వింటాళ్ల దిగుబడి తీస్తున్నారు. ఈ ఏడాది మొదటి సారిగా నానో సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన నానో గోల్డ్ ఎరువును ఉపయోగించి వర్షాభావ పరిస్థితులను అధిగమించారు. పత్తి సాగులో ఈ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    నానోగోల్డ్ ఎరువు కోసం
    పోన్ నెం : తెలంగాణ - 93461 12007
    ఆంధ్రప్రదేశ్ - 72072 27224
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    CZcams:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...
    #karshakamitra #cottoncultivation #successstoryofcotton #cottontelangana
    #nanofertilizers #nanogold

Komentáře • 102