Legendary Singer SP Balasubramanyam's Best Performances in ETV Swarabhishekam | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 24. 09. 2020
  • #Swarabhishekam #SPB #SPBalasubramaniam #Playbacksinger #TeluguShow #ETVWin To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/appsETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9 Facebook - bit.ly/2L2GYYhETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtuETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWFETV Plus India(CZcams) - bit.ly/2OlEAOgFacebook - bit.ly/2DudC0tETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTbFacebook - bit.ly/2OSrIhvETV Life(CZcams) - bit.ly/2OiKAY6Facebook - bit.ly/34tiqzkETV Telangana(CZcams) - bit.ly/33nRaAKFacebook - bit.ly/37GkVQFETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZzFacebook - bit.ly/2R0vs3k► Like us on Facebook : / etvwin► Follow us on Instagram : / ► Follow us on Twitter : / etv__win► Visit Website : www.etvwin.com/► Pin us on Pinterest: / etv_win
  • Zábava

Komentáře • 1,4K

  • @singerabdullah7705
    @singerabdullah7705 Před 3 lety +28

    ఏది ఏమైనా మా జన్మ ధన్యం మీ పాటలు వినే అవకాశం మాకు కలిగింది

  • @priyanka9indhira813
    @priyanka9indhira813 Před 3 lety +9

    బాలు గారి పాటలు వింటుంటే కన్నీళ్లు ఆగటం లేదు మీరు మాకు దూరం అవ్వలేదు సర్, పాటల రూపంలో మా మధ్యనే ఉన్నరు ఎప్పటికి ఉంటరు గాన గాంధర్వం మీ సొంతం, దేవుడు మాకు
    ఇచ్చిన గొప్ప వరం సర్,మీ గాంధర్వం చరణ్ గారి గొంతులో మ్రెగటం మా అదృష్టం

  • @vsrmurthyvullaganti9089
    @vsrmurthyvullaganti9089 Před 3 lety +246

    నా భార్య అడుగుతున్నది, ఎందుకు, మీ కళ్ళ వెంట అలా నీళ్లు వస్తున్నాయి అని. ఏం చెప్పాలి, 70 ఏళ్ల నా జీవితంలో 50 ఏళ్లకు పైగా మహానుభావుడు S P బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటూ హాయిగా గడిపేసాను. ఇప్పుడు ఈ మిగిలిన జీవితం బాలసుబ్రహ్మణ్యం లేరనే కఠిన సత్యం జీర్ణించుకోలేక గుండె కరిగి నీరై కళ్ళవెంట కారుతున్నాదని చెప్పలేక కళ్ళు తుడుచుకున్నాను. బాలసుబ్రహ్మణ్యం లేరనే సత్యం ఈ మిగిలిన జీవితాన్నంత వెంటాడుతుందన్న, ఆ బాధ ఒకరితో చెప్పుకునేది కాదని, చెప్పుకుంటే తీరేది కాదని ఎలా చెప్పేది, ఎవరికి చెప్పేది. బరువెక్కిన గుండెతో ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.

    • @group0347
      @group0347 Před rokem +13

      Avunu sir meeru cheppindi nijame..
      Naa vayasu mee vayukante 40 years takkuve ayina "balu gari galam maa tharaniki teeyani swaram".Aayana lerane thalapu sangeeta saamrajyanike kadu manalanti endariko teerani lotu.
      We all miss a legendary singer who is a son of saraswathi maata

    • @nallanagula
      @nallanagula Před 11 měsíci +1

      Ala em ledu... Balu is different! Ayanaki minchina vadu puttaledu.. puttaru.. anthe

    • @VenkataramanaPasagadugula
      @VenkataramanaPasagadugula Před 9 měsíci

      😢

    • @user-mm9oi1zq1e
      @user-mm9oi1zq1e Před 9 měsíci +1

      😢😢😢😢😢. చాలా బాధగా ఉంటుంది ...మనలో Talent ఉన్న. కూడా దాన్ని ఎవరు గుర్తించకపోతే చాలా చాలా బాధగా ఉంటుంది beacouse offf నేను

    • @mallikarjungoud5382
      @mallikarjungoud5382 Před 9 měsíci +2

      😢

  • @priyankabhukya7235
    @priyankabhukya7235 Před 3 lety +42

    మీ పాట వింటూ బ్రతికేస్తనయ్య మహానుభావా🙏 గాన గాంధర్వ

  • @fatherofkautilya7015
    @fatherofkautilya7015 Před 2 lety +14

    బాలుగారు మీరు మా మధ్యలో లేరన్న నిజాన్ని తలుసుకుంటుంటే మా నయనాలు జలపాతలుగా మారుతున్నవి...
    తండ్రిని కోల్పోయినట్టుంది..
    చాలా బాధగా ఉంది...

  • @SureshKumarOfficialpage
    @SureshKumarOfficialpage Před 2 lety +34

    ఎంతటి గొప్ప చిలిపి మనిషి...
    గొప్ప వ్యక్తిత్వం కలగలిపిన మనిషి...
    మానవత్వం కలిగిన మనిషి...
    గౌరవం...ఆత్మీయత...ఒదిగి ఉండే మేరుపర్వతం బాలూ గారు.
    మీరు ఇలా ఉన్నారు కాబట్టే మీ కుమారుడు చరణ్ కి అది శ్రీరామ రక్ష...
    మనం చేసిన మంచి చెడులు మన పిల్లలను కాపాడతాయి అంటే ఏమో అనుకున్నాను.
    మీ వ్యక్తిత్వం మీ మంచితనం మీ గొప్పతనం
    మీ కుమారునికి జడ్ ప్లస్ సెక్యూరిటీ...

  • @umamaheshvarada8167
    @umamaheshvarada8167 Před 3 lety +99

    మీ పాటలు వింటుంటే ఎన్ని టెన్షన్లు ఉన్న మనసు ప్రశాంతంగా ఉంటుంది సార్ ఇలాంటి పాటలు మాకు ఇంకెవరు పాడుతారు సార్ మీరు పాటలు రూపంలో మాతోనే ఉంటారు ఐ మిస్ యూ సార్ మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నాను

  • @rowdyrishi7128
    @rowdyrishi7128 Před 3 lety +11

    మీరు మీ పాట లో బ్రతికే ఉన్నారు సార్, గ్రేట్ లెజెండర్ సింగర్, మీ పాట పడాలంటే, మరో జన్మం మీరే sp బాలసుబ్రమణ్యస్వామి లాగా, పుట్టాలి, అది మీకే సాధ్యం. ఐ లవ్ sp బాలు.

  • @srikantlanda5143
    @srikantlanda5143 Před 3 lety +22

    మధ్యమవతి that is sp balu garu ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి మంచి బాలుడు దొరికితారు మన హయాంలో

  • @rkrajenderchari1350
    @rkrajenderchari1350 Před 3 lety +24

    మీరు ఎక్కడ ఉన్న మీరు ఆలపించిన పాటలు, మాటలు, ఎప్పటికి అలా నే ఉండిపోతాయి సర్. దేవుడు ఎప్పుడూ మిమ్ములను కారుణిస్తాడాని అనుకొంటున్న. ఓ దేవుడా మా బాలు సర్ నీ కాపాడు. మరల జన్మ ఇవ్వు స్వామి.

  • @jayabadri8925
    @jayabadri8925 Před 3 lety +81

    స్వరాభిషేకం లో పాట పాడిన తరువాత spb గారు పాటకు సంబందించిన పాత విషయాలు ఎంత అందగ గుర్తు పెట్టుకొని చెప్తారు
    We miss u lot sir

  • @varaprasad7693
    @varaprasad7693 Před 2 lety +3

    ఓ గాన గాంధర్వ ఎక్కడున్నవయ్యా ఒక్కసారి వినిపించు దేవుడా మా బాలు నీ మాకు ఎచ్చేవయ్యా

  • @ajaymicrosculptures7364
    @ajaymicrosculptures7364 Před 3 lety +161

    ఈ విశ్వం ఉన్నంతవరకు మీపాట ఉంటుంది సార్.
    బాలు సార్ మీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

  • @gowriduvvada9450
    @gowriduvvada9450 Před 3 lety +18

    పాట బ్రతికున్న వరకు మీరు బ్రతికున్నట్లే బాలు గారు..... మా జనరేషన్ వాళ్ళం అదృష్టవంతులం .. ఎందుకంటే మీరు మా కాలములో పాడటం....

  • @jalagamvenkatasatyanarayan9806

    Sir, మీరు లేరన్న నిజాన్ని ఇప్పటికీ మేము అంగీకటించలేక పోతున్నాం సర్.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaprasad1845
    @ramaprasad1845 Před 3 lety +27

    బాలు గురువు గారు మీకు మీరే సాటి . పాటైన,మాటైనా సూపర్.మీకు సమకాలికులు గా పుట్టటం మా అద్రుష్టం

  • @sampathkumar6642
    @sampathkumar6642 Před 11 měsíci +15

    భగవంతుడు మహా స్వార్థపరుడు, ఎందుకంటే భూలోకంలో మానవుల్ని ఎక్కువగా ఆనందింపడడం యిష్టంలేక మిమ్మల్ని ఎత్తుకెళ్లి వాళ్ళలోకంలో మీచేత పాడించుకొంటూ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తున్నారు, కానీ మీరు ఎక్కడ ఉన్నా పాటకు రారాజు మీరేనండీ.....😢😢😢

  • @Prince-jg2gd
    @Prince-jg2gd Před 3 lety +31

    మిమ్మల్ని ఎలా మర్చిపోతాం బాలు సార్
    మీ మాటలు, పాటలు ఎప్పుడూ మాతోనే
    దేవుడు మీకు ఎంత చక్కని స్వరం ఇచ్చారు
    మిమ్మల్ని దేవుడు అప్పుడే ఎందుకు పిలిచారు అర్థం కావడం లేదు. We miss you sir

    • @venkataswamy804
      @venkataswamy804 Před 8 měsíci

      ఆయనని అక్కడ పడటానికి పిలిచాడు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అన్నమయ్య కీర్తనలు రచించడానికి అక్కడికి పిలిపించుకున్నారు

  • @MrPillabaccha
    @MrPillabaccha Před 3 lety +97

    మీ లాంటి మహా గాయకుడు ఈ యుగంలో పుట్టడం..అది ఈ భారతదేశం లో......మేము చాలా అదృష్టవంతులం....అయ్యా ❤💔😭😭😭

  • @pk.thesaviour7223
    @pk.thesaviour7223 Před 3 lety +179

    బాలు.... మీరంటే అందుకే అంత ఇష్టం.... నీవు లేని లోటు... జీర్ణించుకోలేక పోతున్నా ము....😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @mppzphschoolsvechalam5424
    @mppzphschoolsvechalam5424 Před 3 lety +64

    మీ పాటలు వింటు ఉంటే ఈలోకం తెలీదు సర్ .మీ పాటలు వింటు బ్రతకేస్తాం సర్ 😭😭😭

    • @gvssir7625
      @gvssir7625 Před 3 lety +2

      బాలు గారి గాత్రం ఇక ఎప్పటికీ రాదు.. రాబోదు..ఆయన పాట తెలుగు జాతి ఉన్నంతవరకూ..వుంటుంది..వింటూనే వుంటాం..వింటూనే బ్రతికేస్తాం.బాలు సార్..మిమ్మల్ని మేము miss అయ్యాం..సార్..

  • @vasanthayadala4249
    @vasanthayadala4249 Před 2 lety +3

    Excellent ,high energitik singing ee vayasulo SP baalugaaru.

  • @ChandraSekhar-jm5wv
    @ChandraSekhar-jm5wv Před 3 lety +36

    రోజు మీ పాటలు వనకుండా మాకు తెల్లవారదు రాత్రి కాదు మా కన్నీటి వీడ్కోలు స్వీకారం సర్ 😭😭😭😭🎤🎤🎤

  • @Sri539359
    @Sri539359 Před 3 lety +21

    మీ పాట విన్న ప్రతిసారి మీరు మా ఎదురుగా ఉన్నట్టే వుంటారు....
    మీరు లేని లోటు తీరలేనిది😢😢😢😢

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh Před 3 lety +4

    నీవు మరణంలేని మనిషివి పెద్దాయనా....నీకు సాటి ఎవరూలేరు బాలుగారూ మేమందిస్తున్నాము కన్నీటివీడ్కోలు

  • @satyanaidu...7229
    @satyanaidu...7229 Před 3 lety +97

    మీరు సంగీత ప్రపంచానికి చేసిన సేవ చిరస్మణీయుము... కన్నీటితో ఆశ్రునివలి ఇవ్వడం తప్ప ఏమీ చేయలేము... 😓😓 మీ ఆత్మకు శాంతి చేకూరాలి ఆశిస్తున్నాం బాలు గారు...💐💐

  • @jiljilljigaa7547
    @jiljilljigaa7547 Před 3 lety +25

    మనసు నిండి , ఉప్పొంగి కనుల నుండి కురుస్తుంది కన్నీటి తీరులో...మీరు దేవుడు sir 🙏🙏🙏🙏@SPB🙏🙏🙏

    • @vvsnarayana
      @vvsnarayana Před 3 lety +1

      ఈ సంగీత ప్రపంచంలో మీరు లేని లోటు ఎవరు తీర్చలేనిది ఇతర గాయకులు చిన్న తప్పు చేసాన వాళ్ల తప్పులను తెలియపరిచే వారు సరిదిద్ది పాడించేవారు🙏🙏

    • @jamesnallamothu7699
      @jamesnallamothu7699 Před 2 lety +1

      బాలు సార్, మీరు లేకపోయినా మాకు మీరు ఉన్నట్టే ఉన్నారు. We miss u .

    • @rajanikoyyana2515
      @rajanikoyyana2515 Před 2 měsíci

      K n❤​@@jamesnallamothu7699

  • @venumadhavsandupatla2117
    @venumadhavsandupatla2117 Před 3 lety +38

    బాలు గారి పాటలు, మాటలు తేట తెనుగు ఊటలు వాటిని 50 ఏళ్లుగా ఆస్వాదిస్తున్న నేను ఎంతో భాగ్యవంతుడను. వారు లేని లోటు నిజంగా ఎవరూ పూడ్చలేనిది. ధన్యోస్మి.

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 Před 3 lety +21

    ఇంత పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేసిన ఈ టీవీ యాజమాన్యానికి

  • @m.mahepal960
    @m.mahepal960 Před 5 měsíci +6

    🎉🎉🎉 ఆయన పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగాటే ఎంతో మంది ఉన్నారు అని దేవుడితో సమానంగా ఉంటాయి కదా

  • @nagarjunavavilinagarjunava4864

    బాలు గారు మీ మధురమైన గానంతో అందరి మనసులొ చెరగని ముద్ర వేశారు మీరు లేని లోటు ఎవరు తీర్చలేనిది

  • @rammohan9768
    @rammohan9768 Před 6 měsíci +3

    ఆ మహానుభావుని విగ్రహాన్ని పెట్టి స్వరాభిషేక కార్యక్రమం చెయ్యండి పాడుతా తియ్యగా కూడా

  • @praveenkumar2142
    @praveenkumar2142 Před 3 lety +77

    ఈ భూమి మీద మనిషే వున్నా అన్ని రోజులు మీరు మీ పాటలు మీరు బ్రతికి వుంటారు సార్! ఓం శాంతి 💐🙏🙏🙏

  • @naveenp1700
    @naveenp1700 Před 3 lety +126

    మీ గాత్రం అమోఘం, మీ పాట మధురం మీ పాటలు వింటూ బ్రతికేస్తాం😞

  • @VVSRhythm006
    @VVSRhythm006 Před 3 lety +17

    Really miss you sir, మీరు చెప్పినట్టుగానే మీరు మళ్ళీ పుట్టాలి మా ముందుకు రావాలి.. మీరు మళ్ళీ పుట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🥺😭😭🪔💐🙏

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 Před 3 lety +21

    బాలుగారి గొప్ప గాయకుడు మన తెలుగు సీమ లో పుట్టడం ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ విషయం. అలాంటి గొప్ప గాయకుడు ఇక పుట్టరు. ఆయన అమరజీవి.

  • @rampokalkar9164
    @rampokalkar9164 Před 3 lety +59

    అద్భుతమైన గాయకుడు బాలుగారు ఇక లేకపోవడం చాలా విచారకరం.
    మనం ఆయనను కోల్పోవడానికి సైన్సుమీద మనకున్న అగౌరవమే కారణం తప్ప మరోటి కాదు.
    కరోనా విజృభిస్తున్న కాలంలో 74 యేళ్ళ వయసున్న ఒక సీనియర్ సిటిజన్ ని ఒక టీవీ షో కి రమ్మని పిలవడం అసలైన ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. "రివర్స్ ఐసోలేషన్" చేసి ఉండింటే, వయసు మీద పడిన వారిని అసలు బయటకే రానీయకుండా ఇంట్లోనే ఐసోలేట్ చేసి ఉండింటే బాలుగారికసలు ఈ ఇబ్బందే వచ్చి ఉండేది కాదు. టీవీ షో నిర్వాహకులకైనా పెద్దాయనని ఇబ్బంది పెట్టకూడదని తెలియకపోయిందే. కనీసం బాలుగారి బంధు మిత్రులైనా ఈ సమయంలో గాదరింగ్ లు వద్దని వారించలేకపోయారా?. పాటలు పాడినా, గట్టిగా మాట్లాడినా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని డాక్టర్లం చెబుతూనే ఉన్నాం కదా. చూడండి మనకు సైన్సు పట్ల ఎంతటి నిర్లక్ష్యమో!.
    జులై 30 న ఆయన "సామజవరగమనా" అనే టీవీ షో అటెండ్ అయ్యారు. ఆ షోలో అటెండ్ ఐన అందరికీ పాజిటివ్ వచ్చింది బాలుగారితో సహా. మిగితా వారికి కరోనా తగ్గింది. కానీ బాలూ గారు వయసులో పెద్దవారుకదా. కనీసం ఆయన వయసుకు గౌరవం ఇవ్వలేని తెలివి మన చదువులదా?. ఆయనని ఈ సమయంలో పిలవవలసినంత అవసరమేమొచ్చింది?. ఆ మొత్తం ప్రోగ్రామ్ జరిగిందే బాలు గారిని ఈ దశలో కోల్పోవడం కోసమనేలా ఉంది. ఇపుడు ప్రోగ్రామ్ జరగకపోతే ఏం కొంపలు మునిగేవి?. గౌరవమే లేదు. సైన్సంటే గౌరవం లేదు. కరోనా వచ్చి ఆరు నెలలు దాటినా దాని బారినుంచి ఎలా రక్షించుకోవాలో ఈ రోజుకీ అవగాహన రాకుంటే అసలు చదివేదేమి చదువులు, పనికిమాలిన చదువులు కాకుంటే. ఈ రోజుకీ కరోనా వైరస్సే లేదనే వాట్సాప్ మేధావులున్నారంటే ఏం చెయ్యాలి?.
    ఏదేమైనా బాలు వంటి గాయకుడికి రావలసిన కష్టం కాదిది. చాలా దుఃఖంగా ఉంది. వుయ్ మిస్ యూ సర్! 🙏🙏🙏.

    • @SirisClassroom
      @SirisClassroom Před 3 lety +5

      S Sir ur absolutely right 😭😭😭😭😭😭

    • @vvlaxmivvlaxmi4771
      @vvlaxmivvlaxmi4771 Před 3 lety +2

      It's true amduke alage jarigiundavachu andarm kolpyamu mana singing icon

    • @sreenadhganti3315
      @sreenadhganti3315 Před 3 lety +3

      Well said sir leka pothe balugaru inkoka 10 years padutu undevaru even at his age his voice reach is amazing not even slightest shivering in voice etc . It's a irreplaceable loss

    • @ap5g3423
      @ap5g3423 Před 3 lety +1

      How diplomatically you expressed. Great

    • @afreenaffu3807
      @afreenaffu3807 Před 3 lety

      Absolutely right

  • @vutaraju7673
    @vutaraju7673 Před 3 lety +43

    మహానుభావుడు జీవించిన కాలంలో మేము పుట్టడం మా అదృష్టం

  • @dhanavathrajendar1410
    @dhanavathrajendar1410 Před 3 lety +4

    బాలుగారు మీరు చాల ఇష్టం మి ఆత్మకు శాంతి చేకుర్చలని కోరుకుంటున్నాను ⚘⚘⚘⚘⚘🌺🌺🌺🌺🌷🌷🌷🌷

  • @user-cc3pr4vs9m
    @user-cc3pr4vs9m Před 4 měsíci +1

    బాలుగారు మీకుమిరే పోటీ మీకెవ్వరు లేరు సాటి

  • @akulasambasivarao2127
    @akulasambasivarao2127 Před 3 lety +71

    ఇలా ఆయన పాట వింటూఉంటే ఇంకా మన మధ్యే ఉన్నారు అనిపిస్తుంది... భౌతికంగా ఆయన మన మధ్య లేకపొవచ్చు.కానీ ఆయన పాట ఈ సృష్టి ఉన్నoత వరుకు మనతోనే ఉంటుంది...MISS U SPB...SIR .....

  • @seenumathaku6462
    @seenumathaku6462 Před 3 lety +10

    Eee show nii
    Maaku andinchinamduku
    Thank you E TV📺
    And miss you sir 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @ULLANGI1994
    @ULLANGI1994 Před 3 lety +2

    గ్రేట్ సింగెర్స్

  • @durgaprasad.goparaju5458
    @durgaprasad.goparaju5458 Před 3 lety +34

    ఎక్కడికి వెళ్ళిపోయారు స్వామీ గుండెను ముక్కలు ముక్కలుగా కోసి నట్లు ఉంది 😭😭😭 ఎప్పటికీ మీగొంతు సజీవంగా ఉంటే ఎంత బాగుండేది

  • @yoursfriendknowledgegnanes2938

    బాలు గారి పుట్టిన దినమైన june 4 ni singers day ga చేస్తారని మనవి

  • @kishoresiddala4236
    @kishoresiddala4236 Před 3 lety +305

    మీ పాటలను వింటూ బ్రతికేస్తాను సార్ 😭😭😭😭

  • @singerabdullah7705
    @singerabdullah7705 Před 3 lety +7

    ఎంత ఎదిగినా అంతగా వొదిగి వుండే ఒక అద్భుతమైన కళా శృష్టి బాలు గారు

  • @rameshn6055
    @rameshn6055 Před 3 lety +2

    బహుశా దేవుడు లేడనిపిస్తుంది

  • @hariprema7936
    @hariprema7936 Před 3 lety +50

    మీ మీ పాటలు మీ మాటలు అన్ని మిస్ అయ్యాం సర్ మీలాంటి మంచి వాయిస్ మల్లి ఇక ఈ జన్మలో వినలేము మిస్ యు సర్😢😢😢😢😢

  • @madhukarpasunuri810
    @madhukarpasunuri810 Před 3 lety +13

    పాట చెరిగిపోని జ్ఞాపకం .....ఆనాటి జీవన పరిస్థితులకి దర్పణం ...

  • @MaiStudio
    @MaiStudio Před 3 lety +710

    ఈటీవీ వారికీ ఒక మనవి : ఇకపై బాలు గారి పాటలను వారి కుమారుడు SP చరణ్ గారిచే పాడించండి ....చరణ్ వాయిస్ కూడా అచ్ఛం బాలు గారిలాగే ఉంటుంది .....

  • @kunumallamanjushakiran9094
    @kunumallamanjushakiran9094 Před 3 lety +138

    Who miss sp bala Subramanyam sir like me 😭😭😭😭😭😭

  • @yagnanarasimhamurthi
    @yagnanarasimhamurthi Před 3 lety +12

    అసలు నీ మెదడుకు ఇంత పదును ఎలా ఇచ్చాడయ్యా,ఆ దేవుడు!!ఇక నీ కంఠం గురించి ఏమని మాట్లాడేది!!
    ఎవరయ్యా చెప్పింది నీవు లేవని!!నీవెప్పుడు దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నావు,తండ్రి.ఇకనైనా ప్రశాంతంగా ఉండనీ నీ ఆత్మ.🌺🌺🌹🌹🙏🙏

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 Před 3 lety +11

    శ స్వరబి షేకం చేసిన రామోజీ రావు గారు కి పాద భి వందనం

  • @kumartony4244
    @kumartony4244 Před 2 lety +3

    Ento sir e janam miru chanipoyaru ani antunaru....miku maranam enti sir mi pata vunnanta varaku miru matone untaru❤️😘😘😘😘😘😍

  • @karthiks6681
    @karthiks6681 Před 3 lety +261

    ఇలా ఆయన పాట వింటూఉంటే ఇంకా మన మధ్యే ఉన్నారు అనిపిస్తుంది... భౌతికంగా ఆయన మన మధ్య లేకపొవచ్చు.కానీ ఆయన పాట ఈ సృష్టి ఉన్న0త వరుకు మనతోనే ఉంటుంది...MISS U SPB...SIR😥

  • @meruvakishorkumar7431
    @meruvakishorkumar7431 Před 3 lety +3

    బాలుగారూ మాకోసం మల్లీ ఒక్కసారి పుట్టవా ప్లీజ్ సార్

  • @supreethnikki4117
    @supreethnikki4117 Před 3 lety +7

    😭😭😭😭😭😭❤️❤️❤️ లవ్ యూ ఫర్‌ ఎవర్ బాల మీ పాట వింటూ నిద్ర పోఎవాళ్ళం ఇప్పుడు ఏడుపు ఆగక నిద్ర కు ముందుపాటలు వినడం మానేశాం . ఎంత పని చేశావయ్యా : వెంకయ్య అన్నమయ్య ఉన్నారు. కదా నీ దగ్గర మాకు బాలని కొన్ని రోజులు ఉంచాల్సింది. కదా వెంకన్న😭

  • @ravidavaleswarapu5329
    @ravidavaleswarapu5329 Před 3 lety +13

    Paata brathikunnantha Kalam meere prathi paata lo vinipistu kanipistuntaru
    Really we are all miss you sir

  • @adianjireddy4643
    @adianjireddy4643 Před 3 lety +7

    మీరు అదృష్టవంతులు కాదు సార్,,, మీ పాటలు వింటున్న మేము సార్ అదృష్టవంతులం,,, బ్రతికేస్తాను మీ పాటలు వింటూ బ్రతికేస్తాను

  • @user-si2mg3xr9p
    @user-si2mg3xr9p Před 3 lety +12

    ఇ చంచలమైన మనస్సు ఎక్కడ అగాదు బాలు అనె గోంతువింటె చాలు హయిని పొందుతు అగుతుంది

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 Před 3 lety +46

    గుండెలోని బాధ కంట్లోనుండి కారుతూ గొంతు నొప్పిగా వుంది... బాలుడు మనలని వొదిలి వెళ్ళాడు 😭😭
    8:10, 58:24 పాట గురించి పాటలోని పదాలగురుంచి ఇంక మాకు ఎవరు వివరించాలి...
    13:45 ఈ నవ్వు ఇక రికార్డింగ్స్ లోనేనా
    23:18, 36:10

    • @vijayakumarsushma
      @vijayakumarsushma Před 3 lety +1

      Balu garu, we miss you. Evaru intha chakaga maku chepagalaru. 😢😢😢😢😢

    • @kchennaiah5010
      @kchennaiah5010 Před 3 lety +1

      @@vijayakumarsushma sa

    • @venkysafety3303
      @venkysafety3303 Před 3 lety +1

      We miss u sir me place ni evvaru full fill cheyyaleru

  • @khatwangi.2506
    @khatwangi.2506 Před 2 měsíci +2

    ఇంత గొప్ప గాత్రం. ఇంకా సృష్టి లో వుందా ఎక్కడైనా

  • @ayodhyaram1352
    @ayodhyaram1352 Před 3 lety +118

    ఈ భూమి మీద తెలుగు భాష ఉన్నంత కాలం బాలు గారు బ్రతికే ఉంటారు. ఆయనకు మరణం లేదు.

  • @mopurishanker751
    @mopurishanker751 Před 3 lety +112

    స్వర్గలోకంలో కూడా తన స్వరం తో మంత్రముగ్ధుల్ని చేయాలని ఆహ్వానం అందినట్లుంది అందుకే మనందరినీ వదిలి వెళ్ళాడు

  • @vajipeyajulavenkataramana3496

    He is a very great Singer. SPB Voice is God Gift 🙏🙏

    • @sheshadrishamala1513
      @sheshadrishamala1513 Před 2 lety

      We miss you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @uppuvenkateswarlu8511
      @uppuvenkateswarlu8511 Před 2 lety +1

    • @yaramantisreenivasulu4205
      @yaramantisreenivasulu4205 Před 2 lety

      @@sheshadrishamala1513 55ñ555555555.55555555555555.555555555555555555555555555n55.5555j55555555555555n5555n55555555n5555555555555
      j55jn
      j&j mjhas and bava santhi kuda ra annaledu ra nuvu tinava em ledu le oy na medda kopam vachindi ne medda kopam is this one mo

  • @marysaroja7212
    @marysaroja7212 Před 3 lety +19

    బాలు గారు మీరు లేని లోటు ఎవరు తీర్చలేరు. మిస్ యు బాలు గారు

    • @sambasivaraomylavarapu7766
      @sambasivaraomylavarapu7766 Před 2 měsíci

      😢😢😢😢😢😢😢😢😢😮😮😮😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😮

  • @arockiarajd9042
    @arockiarajd9042 Před 3 lety +20

    Nobody can fill the vacuum created by the great singer SPB
    So sad, can't believe he is no more.

  • @tippasrinivas4396
    @tippasrinivas4396 Před 3 lety +43

    ఎన్ని కామెంట్లు పెట్టిన భాద తీరటం లేదు బాలు సార్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏

  • @AnandKumar-kv3fc
    @AnandKumar-kv3fc Před 3 lety +11

    Me song vinani na roju ledu.we miss ur voice sir .

  • @BonangiSunitaQ
    @BonangiSunitaQ Před 3 lety +23

    Goddd😬Return him back 💔😭😭😭

  • @luckyrose1007
    @luckyrose1007 Před 3 lety +4

    నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా....శెలవు మహాశయా... శెలవు....🙏🙏😔😔😔బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... 🙏🙏🙏🙏🙏🙏

  • @aieshashaik7952
    @aieshashaik7952 Před 3 lety +20

    mee patalu vintu meeru leru ani ela nammali balu garu miss u alot balu garu idantha Kala aithe bagunnu 😢😢😢😢😢😢😢😢

  • @RadhaAnandan-pc1ot
    @RadhaAnandan-pc1ot Před dnem

    ఆ మహానది బావిని గానం, పాటలు వింటూ వుంటే ఎంతో హాయిగా, ఆనందంగా, చెప్ప లేను❤

  • @gamingwithnani8664
    @gamingwithnani8664 Před 2 lety

    సార్ నిజంగా నే తనివి తీరలేదు ....అందుకే మళ్ళీ మళ్ళీ వింటున్నాము...

  • @maddisarojinidevi1802
    @maddisarojinidevi1802 Před 3 lety +21

    There are no best songs for S.P BALASUBRAMANYAM gaaru ,because all songs which he sings are best

  • @simba8073
    @simba8073 Před 3 lety +19

    బాలు గారు...మీ పాట...మీ మాట.... 🙏😭😰😭🙏

  • @divyashree462
    @divyashree462 Před 3 lety +14

    Pls etv ki requesting to telecast all the episodes of swarabhishekam live performances of SPB sir every Sunday, I called the Etv office they were saying ok will do like that, but I feel they will only take the requests if they receive hundred calls or more than that to re telecast the show... Pls do call

  • @manojchandra8904
    @manojchandra8904 Před 2 lety +37

    ఎలా నీ రుణం తీర్చుకోవాలి ? చచ్చిపోయేటపుడు , నీ పాట వింటూ పోతే చాలు స్వామీ!!!! 🙏🙏🙏🙏🙏

  • @sportschat3039
    @sportschat3039 Před 3 lety +17

    Love you sirr... Missing you on every single day 😭

  • @nandurimadhuri3425
    @nandurimadhuri3425 Před 3 lety +7

    Miru lekapothe chalaa aagipothay Balu Gaaru..chalamandi aagipotharu..I Still don't have enough strength to bear this loss 😭😭😭
    RIP Sripathi Panditharadhyula Balasubrahmanyam Garu !!!

  • @ramanarajapu4066
    @ramanarajapu4066 Před 2 lety +3

    మహా అద్భుతం మీ పాటలు వినే భాగ్యం కలిగినందుకు నిజంగా నా జన్మ తరించింది 👌👌👌❤️❤️❤️❤️❤️

  • @spbkapoor6685
    @spbkapoor6685 Před 3 lety +2

    ఇదే కదా ప్రోగ్రమంటే ఇది కదా పాట పడే విధానమంటే సమజవరాగమనాలో అసలు ఏమి కనిపించడం లేదు

  • @santakumarichunduri1836
    @santakumarichunduri1836 Před 3 lety +9

    Very lucky to see SP live shows.

  • @jani4334
    @jani4334 Před 3 lety +29

    Sir you are in everyone's Hearts❤💞.
    But physically we all miss you😭 sir

  • @mvvramalakshmi7517
    @mvvramalakshmi7517 Před 3 lety +2

    సార్ మిరు చాల బాగుంటారు
    We miss you sir
    Thanq
    SP.BALASUBRAMANAYAM

  • @meinhoonaaa
    @meinhoonaaa Před 3 lety +39

    Such an amazing singer...... Legendary personality....Can't believe that he's no more

  • @sridevimovva9097
    @sridevimovva9097 Před 3 lety +10

    మీ లాంటి అద్భుతమైన గాయకుడు పుట్టిన భూమి మీద మేము కూడా పుట్టి మీ పాటలు వినడం మా అదృష్టం.. మీరు భౌతికంగా లేకపోయినా భూమి అంతరించరించేవరకు మీ పాట ఉంటుంది 🙏🙏🙏🙏

  • @santhoshallu7767
    @santhoshallu7767 Před 3 lety +8

    Balu Garu kallallo kanneellu aagatledu... meeru paadina patalatho maalo sajeevanga vuntaru Indian legendary singer Balu Garu ki Rip

  • @meerasrinivasan1331
    @meerasrinivasan1331 Před 3 lety +21

    A great singer, human being and above all a great soul. Balu Anna, you will be alive as long as music lives.

  • @samsonarava7803
    @samsonarava7803 Před 3 lety +6

    ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు మీరు కూడా సజీవంగా ఉంటారు .పాటల రూపంలో

  • @mramesh9748
    @mramesh9748 Před 3 lety +3

    Balu gari pataluvintunte chala relaxation and peace of mind

  • @naganagaraja2451
    @naganagaraja2451 Před 3 lety +3

    సార్ మీరు చని పోలేదు సార్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది సార్

  • @chennamsetty.navyasri5693
    @chennamsetty.navyasri5693 Před 3 lety +27

    We miss legendry voice.We miss you..SP.Bala subramanam garu😭😭😭

  • @satyavanitarigoppula670

    అపురూపం, అనిర్వచనీయం, అరుదైన,అందమైన, అత్యంత మధురమైన ఆ కంఠం అజారామరం నిత్యము, సత్యము,వింటూ బతికెయ్యచ్చు

  • @goverdhanraokandepaneni6285

    Difficult to digest about SPB demise!
    Great singer and human being!!
    Mankind will conquer this virus and pay huge tributes to SPB!!!

  • @umadevipothagani
    @umadevipothagani Před 3 lety +69

    We are blessed to have such great singer. He will live in our hearts for ever and ever

  • @mail2srinis
    @mail2srinis Před 3 lety +22

    Spb will always remain in our hearts

  • @chaladipurnachandrarao6290

    ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. మంచి బాణీలు, సాహిత్యం, కోరస్ కూడా.కనీసం వెయ్యి సార్లు వినివుంటాను

  • @padmajanagendran
    @padmajanagendran Před 3 lety +16

    బాలు గారు మీరు తెలుగు వారు కావడం తెలుగు వారందరికీ గర్వకారణం.మీరు భౌతికంగా మామధ్య లేక పోయినా ఈ ప్రపంచంలో సంగీతం ఉన్నంతవరకూ మీరు పాట రూపంలో చిరంజీవి గా ఉంటారు, మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి🙏🙏🙏.

    • @pallavivuppala
      @pallavivuppala Před 3 lety

      Chala bagah cheparu

    • @manisk4563
      @manisk4563 Před 3 lety +3

      కానీ ఒక్క మనం హీరోలు అని చెప్పుకుంటున్న ఒక్క నటుడు కూడా ఆయన చివరి యాత్రకు వెళ్ళలేదు, ఆయన తెలుగువాడు అయినా తమిళ్ వారు ఇచ్చినంత గౌరవం ఇవ్వలేదు

    • @padmajanagendran
      @padmajanagendran Před 3 lety +1

      @@manisk4563 నిజం అండి మీరు చెపినది, ఇప్పుడు ఉన్న తెలుగు పెద్ద హీరోలు అందరు బాలు గారు పాటలు వల్ల లాభం పొదినావలె కాని ఒక్కరు వెళ్లలేదు

    • @manisk4563
      @manisk4563 Před 3 lety +1

      వాళ్ళు హీరోలు కాదండీ కేవలం నటులు మాత్రమే