SriKrishna Rayabharam - By Gummadi Gopala Krishna & Deekshith DS

Sdílet
Vložit
  • čas přidán 25. 09. 2014
  • Watch Gummadi Gopala Krishna Srikrishna Rayabharam, under the direction of Deekshith D.S. The drama stars Gummadi Gopala Krishna, Kyamadhati Venkateswara Sharma, R.A Naidu, Deepika Prasad, Parawada Syam Prasad, Pundareekaksha Sharma, Surabhi Jamuna Rayala, P.V Subba Rao.

Komentáře • 598

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 Před 4 lety +56

    పద్యం చెవికి సోకి ఎంతో.వినసొంపుగా మా చిన్న తనం లోకి తీసుకెళ్ళింది.మా గ్రామం మునిగలవీడు అని నెల్లికు దుర్ మండలం ఇప్పటి మహబూబాబాద్ జిల్లా తెలంగాణ.1973,1974& 1975 సంవత్సరాలలో మా వూరికి సత్య సాయి నాట్యమండలి విజయవాడ నుండి శ్రీ K.హరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ రాయబారం,శ్రీ రామాంజనేయ యుద్దం నాటకాలు ప్రదర్శించారు.హరిప్రసాద్ గారు కృష్ణుడిగా,రాముడుగా అద్భుతంగా ప్రదర్శించే వారు.అప్పట్లో మేము సినిమాలు చూసి ఉండ నందున రాముడు, కృష్ణుడు అలాగే వుంటారు కాబోలు అనుకునే వారం. తిరిగి హరిప్రసాద్ గారు నాకు 1986 లో సూర్యాపేట లో ఒక నాటక ప్రదర్శన కోసం వచ్చినప్పుడు చూసాను.పద్యాలు వారు చాలా అద్భుతంగా పాడేవారు. వారి ప్రదర్శనకు సంబంధించిన వీడియో లు ఉన్నట్లైతే ఈ మాద్యంలో వుంచగలరాని మనవి

  • @vivekanandyagalla5057
    @vivekanandyagalla5057 Před 3 lety +14

    చాలా బాగుంది సార్. పద్యం బేస్ కాబట్టి ఇప్పటి వారికి క్రింద అర్ధం తెలుగులో కూడా వ్రాస్తే ✍️ సులువుగా 👌 బాగా అర్ధం అవుతుంది. లేకపోతే ఇబ్బంది గా ఉండి చూడడం కష్టం... యాగళ్ల వివేకానంద 👍 🙏

  • @sudhakarr9275

    చాలా చాలా బాగుంది ప్రతి సన్నివేశం, పాత్రలు ఎంతగానో ఆకట్టుకున్నాయి చాలా సంతోషంగా ఉంది.

  • @kakumanusrinivasarao1421
    @kakumanusrinivasarao1421 Před 2 lety +9

    సార్ గోపాలకృష్ణ గారు భీముడ్నీరెచ్చకొట్టటం మరలా ప్రసన్నం చెయ్యటం చాలా బాగుంది

  • @prasadraovelumala8480
    @prasadraovelumala8480 Před 3 lety +15

    హలో బ్రదర్ ఈకృష్ణరాయబారమునందు వేరొక చోటంజూపని పద్య సన్నివేశాధిఖ్యం బులను సుగాత్రాభినయంబులన్జఖక్కగాను జూపినఃదులకు అభినందనలు.మరీమరీ ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి జనోమనో రంజకమొనర్ప గోరుచున్నాను,కానీఈ కృష్ణ రాయబారం సంపూర్ణంగా నిర్వహించనందు లకు చింతిస్తున్నాను.వి.ఆర్.ప్రసాద రావు.

  • @sudhakarpathri5636
    @sudhakarpathri5636 Před 2 lety +13

    మీ స్వయంకృషి శాశ్వతకీర్తికి కారణ భూతమై నది.

  • @chandramoulibuddoju3640
    @chandramoulibuddoju3640 Před 2 lety +3

    నా చిన్న తనలో సురబి వారి డ్రామాలు చూసే వాడిని,ఆదివారం మద్యాహ్నం రేడియో లో రంగస్థలం పద్యాలు వినేవాణ్ని.ఈ ఫోన్ పుణ్యమా అని మల్లీ ఇపుడు చూడ కలుగుతున్నదనే.

  • @immannivenkatasatyam1237

    చాలా అద్భుతమైన కాంబినేషన్. నాటకం ఆసాంతం చాలా బాగుంది. ఇప్పటికి నేను ఎన్ని సార్లు చూసానో లెక్కలేదు. గుమ్మడి గోపాల కృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు.

  • @suryaprabhakarasarmachatla16

    చాలా బాగుంది.

  • @somasekharreddy5845
    @somasekharreddy5845 Před 2 lety +7

    EXCELLENT Sir

  • @kesavaraoramaraju1985

    అద్భుతమైన నాటకం.. గోపాలకృష్ణ గారి అత్యద్భుత నటన.. దీటుగా మిగిలినవారి నటవైభవం.. ఒకనాడు నాటకాలు చూడలేకపోయినవారు ..‌ఆ రుచి తెలిసిన వారు తప్పక చూడవలసిందే...

  • @janardhanaytha4356
    @janardhanaytha4356 Před rokem +3

    పద్యాలు, వేశాధారణ, పద్యాలు పాడిన విధానం, సెట్టింగ్స్ నన్ను యాభై సం. వెనుకకు తీసుకవిల్లివవి. చాలా అద్భుతం. నటులకు టెక్నిసియన్స్ laku🙏 పాదాభి వందనాలు. Bkjanardhan Rtd. MRO JMKT

  • @svrmurthy51
    @svrmurthy51 Před 3 lety +15

    మరుగున పడి మరచిపోతున్న పద్య నాటకాలు పునర్జీవింప జేస్తున్నారు . ధన్యోస్మి

  • @charan.k7300
    @charan.k7300 Před 4 lety +26

    Neelam koyyana

  • @damodarajanapadam9692
    @damodarajanapadam9692 Před 3 lety +33

    కమ్మని గుమ్మడి నోట

  • @SatyaNarayana-ew7gg
    @SatyaNarayana-ew7gg Před 3 lety +6

    కమ్మటి తెలుగు పద్యాలు చాలా బాగున్న వి పాత్రధారులు ఎవరి పాత్రలు వాళ్ళు చక్కగా పోషించారు అద్భుతం

  • @gaddamlaxmaiah7782

    అద్భుతమైన పద్యనాటకం.

  • @gandhinewschannel9410
    @gandhinewschannel9410 Před 2 lety +2

    అన్ని పాత్రలూ అమోఘం.. నటులు కాదు.. నటనా సర్వభౌములు.. మహనీయులు ..

  • @gaddamlaxmaiah7782

    ధర్మజుడు,అర్జునుడి గాత్రమాధూర్యం అసాధారణం.

  • @turlapatisambhayachary9600

    శ్రీకృష్ణ రాయబారం నా టకం సర్వాంగ. సుందరం నిత్య నేత్ర పర్వము శ్రవణ పర్వము